Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ 10 వచ్చేస్తోంది - ఆటలో కాదు ఆటే సవాల్... సరికొత్తగా న్యూ సీజన్
Bigg Boss Telugu Season 10 : బిగ్ బాస్ కొత్త సీజన్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఆటలో కాదు ఆటే సవాల్ అనే క్యాప్షన్‌తో కింగ్ నాగార్జున స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.

Bigg Boss Telugu Season 10 Annoncement Video : ఫేమస్ రియాలిటీ షో బిగ్ బాస్ సరికొత్త సీజన్ వచ్చేస్తోంది. ఈసారి మరిన్ని హంగులతో తెలుగు సీజన్ 10 రెడీ అవుతోంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా న్యూ సీజన్ అనౌన్స్ చేశారు.
ఆటే సవాల్
'బిగ్ బాస్... ఎన్నో యుద్ధాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే కాదు. ఎంతోమంది హృదయాలు గెలుచుకున్న మహా సామ్రాజ్యం.' అంటూ నాగ్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్‌తో ప్రారంభమయ్యే వీడియో ట్రెడిషనల్ ఇంటి లుక్‌తో పాటు మాస్ డ్యాన్సులతో ఎంటర్టైన్ చేసింది. స్పెషల్ సాంగ్ ట్రెండ్ అవుతోంది. 'ఆటలో సవాల్ కాదు... ఈసారి ఆటే సవాల్' అనే క్యాప్షన్‌తో గత 9 సీజన్ల కంటే ఈ సీజన్ మరింత రసవత్తరంగా ఉండబోతోందంటూ హింట్ ఇచ్చారు నాగార్జున.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు






















