'పెద్ది' సినిమాలో జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్రలో లుక్స్, ఎక్స్‌పోజింగ్‌పై విమర్శలు వచ్చాయి. దీనిపై ట్రోల్స్ కూడా జరిగాయి.
Dimple Hayathi On Peddi: హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
Janhvi Kapoor Peddi Controversy: 'పెద్ది'లో జాన్వీ కపూర్‌ను చూపించిన తీరు, ఆ రోల్ రాసిన విధానంపై విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదంపై హీరోయిన్లు డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ స్పందించారు.

- ‘పెద్ది’లో జాన్వీ పాత్రపై విమర్శలు; దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణ.
- జాన్వీకి మద్దతుగా డింపుల్ హయతి హీరోయిన్లను నిందించవద్దన్నారు.
- పాత్రలు సక్రమంగా రాయకపోవడం దర్శకుల బాధ్యత అని పేర్కొన్నారు.
- ఆషికా రంగనాథ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
'పెద్ది' విడుదలైన తర్వాత రామ్ చరణ్ నటన, వసూళ్ళ కంటే... సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై ఎక్కువ డిస్కషన్ జరిగింది. అచ్చియమ్మ పాత్రను రాసిన విధానం, సన్నివేశాల్లో జాన్వీ కపూర్ లుక్స్, ఎక్స్‌పోజింగ్‌పై ట్రోల్స్ వచ్చాయి. విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో మహిళలకు క్షమాపణలు చెప్పారు దర్శకుడు బుచ్చిబాబు సానా. ఈ ఎపిసోడ్‌లో జాన్వీని విమర్శించిన ప్రేక్షకులూ ఉన్నారు. తెలుగులో ఫస్ట్ సినిమా 'దేవర', ఇప్పుడు రెండో సినిమా 'పెద్ది'లో మాట్లాడితే పైట తీసేసి అందాల ఆరబోత చేశారని ట్రోల్ చేశారు. ఈ అంశంలో ఆమెకు హీరోయిన్లు డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ అండగా నిలబడ్డారు. ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళిద్దరూ ఏమన్నారంటే?
హీరోయిన్లను బ్లేమ్ చేయకండి...
మాకు వచ్చిన అవకాశాల్లో నటిస్తున్నాం!
Dimple Hayathi On Peddi Controversy: ''కథానాయికల పాత్రలను ఎలా రాస్తున్నారు? ('పెద్ది'లో జాన్వీ కపూర్ పాత్ర అచ్చియమ్మను ఉద్దేశించి) అని ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది'' అని డింపుల్ హయతి తన అభిప్రాయం చెప్పడం మొదలు పెట్టారు. తమకు ఇచ్చిన పాత్రలను పోషించినందుకు హీరోయిన్లను నిందించడం ఒక అలవాటుగా మారిందన్నారు. ఇంకా ఆవిడ మాట్లాడుతూ... ''హీరోయిన్లను నిందించకండి... (సినిమా) వ్యవస్థను, ఇలా తీస్తేనే చూస్తారని, ఈ విధంగా చేస్తే సినిమా అమ్ముడుపోతుందని అని భావించే దర్శక రచయితలు - నిర్మాతలను నిందించండి'' అని పేర్కొన్నారు.
హీరోయిన్లు తమకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ... పెద్ద సినిమాల్లో నటించాలని, ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ అవ్వాలని తమ వంతు ప్రయత్నిస్తారని, అదొక స్ట్రాటజీ అని డింపుల్ హయతి తెలిపారు. ఒకవేళ హీరోయిన్ క్యారెక్టర్లు సరిగ్గా రాయకపోతే... ఆ బాధ్యత దర్శక నిర్మాతలది అని, హీరోయిన్లది కాదని ఆవిడ స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తూ... తమ నటనను ఆవిష్కరించే అవకాశం ఇవ్వకుండా, కేవలం ఇమేజ్ ఆధారంగా క్యారెక్టర్లు ఇస్తూ తమను స్టీరియోటైప్ చేస్తున్నారని, హీరోల చుట్టూ తిరిగే కథల్లో వాళ్ళకు పూర్తి ప్రాధాన్యత ఉంటుందని డింపుల్ అన్నారు.
I’m so glad today on this day we all are speaking about how actresses roles are being written and the instinctive response to blame actress after doing what she was offered ,dont blame the actress blame the system and makers who really think that’s what sells .. and we actors get…
— Dimple Hayathi (@DimpleHayathi) June 6, 2026
Ashika Ranganath On Peddi Controversy: సంక్రాంతికి విడుదలైన రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'లో డింపుల్ హయతి కనిపించారు. ఆ సినిమాలో మరొక హీరోయిన్ ఆషికా రంగనాథ్ కూడా 'పెద్ది'లో జాన్వీ కపూర్ వివాదంపై స్పందించారు. ఇంచు మించు డింపుల్ హయతి తరహాలో హీరోయిన్లను బ్లేమ్ చేయవద్దని, వ్యవస్థను నిందించాలని, ఒకవేళ పాత్రలు సరిగా రాయకపోతే అది దర్శక నిర్మాతల తప్పు అని ఆషికా రంగనాథ్ పేర్కొన్నారు.
Frequently Asked Questions
'పెద్ది' సినిమాలో వివాదం దేని గురించి?
వివాదంపై దర్శకుడు బుచ్చిబాబు సానా ఎలా స్పందించారు?
విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో దర్శకుడు బుచ్చిబాబు సానా మహిళలకు క్షమాపణలు చెప్పారు.
జాన్వీ కపూర్ వివాదంపై ఏ హీరోయిన్లు మద్దతు పలికారు?
డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ జాన్వీ కపూర్‌కు మద్దతుగా నిలిచారు. హీరోయిన్లను నిందించవద్దని వారు పేర్కొన్నారు.
ఈ వివాదంపై డింపుల్ హయతి అభిప్రాయం ఏమిటి?
హీరోయిన్లను కాకుండా, పాత్రలను రాసే విధానం, వ్యవస్థను, దర్శక రచయితలు-నిర్మాతలను నిందించాలని డింపుల్ హయతి అన్నారు. పాత్రలు సరిగ్గా లేకపోతే బాధ్యత వారిదేనని చెప్పారు.
ట్రెండింగ్ వార్తలు






















