అన్వేషించండి

TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్

TDP Rajya Sabha Candidates | భాష్యం రామకృష్ణ, సానా సతీశ్, చింతకాయల విజయ్‌లను టీడీపీ తమ రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారు చేసింది. వీరు సోమవారం నామినేషన్ వేయనున్నారు.

TDP Finalizes Rajya Sabha Candidates | అమరావతి: తెలుగుదేశం పార్టీ (TDP) రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులుగా భాష్యం రామకృష్ణ, సానా సతీశ్‌, చింతకాయల విజయ్‌ల పేర్లను పార్టీ అధిష్ఠానం శనివారం నాడు ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. అభ్యర్థుల ఎంపికలో సోషల్ బ్యాలెన్స్, పార్టీ పట్ల అంకితభావం, యువతకు పెద్దపీట వేసేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ముగ్గురు అభ్యర్థులు సోమవారం (జూన్ 8న) తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు.

రాష్ట్రం నుండి ఖాళీ అవుతున్న మొత్తం 4 రాజ్యసభ స్థానాలకు గాను, కూటమి ఒప్పందంలో భాగంగా తెలుగుదేశం పార్టీ 3 స్థానాలను, జనసేన పార్టీ ఒక స్థానాన్ని తీసుకున్నాయి. ఇందులో జనసేన కోటాకు సంబంధించిన స్థానంలో ఆ పార్టీ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఇప్పటికే తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాలపై ఆరుగురు జనసేన ఎమ్మెల్యేలు, ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక బీజేపీ ఎమ్మెల్యే సంతకాలు చేసి ఇదివరకే తమ మద్దతును తెలిపారు.

జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్

ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కూటమి ఒప్పందంలో భాగంగా జనసేన పార్టీ తన అభ్యర్థిగా ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌ను బరిలోకి దింపింది. శనివారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేతుల మీదుగా ఆయన అధికారిక 'బి-ఫామ్' అందుకున్నారు. ఈ సందర్భంగా పెద్దల సభలో రాష్ట్ర ప్రయోజనాల కోసం లింగమనేని బలంగా గళం వినిపిస్తారని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: AP Mega DSC 2025 Controversy: మెగా డీఎస్సీపై ఏపీలో రాజకీయ యుద్ధం - వైసీపీ ఆరోపణలు, ప్రభుత్వం వివరణలు - ఎవరిది పైచేయి?

అనంతరం వెలగపూడిలోని శాసనసభ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వనితా రాణికి లింగమనేని రమేష్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, బీజేపీ ఎమ్మెల్యే ఎన్. ఈశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. లింగమనేని అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ నాదెండ్ల మనోహర్, బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్‌తో పాటు కూటమికి చెందిన పలువురు ప్రముఖ నేతలు ప్రతిపాదన సంతకాలు చేశారు. పారిశ్రామికవేత్త అయిన లింగమనేని ఎంపిక రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

 

తనపై నమ్మకంతో రాజ్యసభ అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన అభ్యర్థిత్వాన్ని బలపరిచిన మోదీ, చంద్రబాబులకు ధన్యవాదాలు చెబుతూ, ఏపీ ప్రయోజనాల కోసం నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. రమేష్ గారు అత్యంత సమర్థుడని, పవన్ కళ్యాణ్ సరైన వ్యక్తిని ఎంపిక చేయడం పార్టీ శ్రేణులందరికీ ఎంతో ఆనందాన్ని ఇస్తోందని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ప్రశంసించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Caste Certificate Download: మ‌న‌మిత్ర ద్వారా కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాలు.. మొబైల్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం
మ‌న‌మిత్ర ద్వారా కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాలు.. మొబైల్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
AP Cabinet Meeting: పదికి పైగా అజెండా అంశాలతో ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు
పదికి పైగా అజెండా అంశాలతో ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget