అన్వేషించండి

Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం

Fish Prasadam distribution | మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది తరహాలోనే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. జూన్ 8న రాత్రి 9 గంటలకు ప్రారంభించనున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణలో జూన్ 8 రాత్రి చేప ప్రసాదం పంపిణీ మొదలు.
  • మంత్రి పొన్నం ప్రభాకర్ ఏర్పాట్లను సమీక్షించారు; భక్తుల విశ్వాసం అధికం.
  • భక్తులకు వసతి, భోజనం, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు.

Fish Medicine | హైదరాబాద్: చేప ప్రసాదం పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. జూన్ 8వ తేదీ రాత్రి చేప ప్రసాదం పంపినీ ప్రారంభించనున్నారు. 9వ తేదీన సైతం పంపిణీ కొనసాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి వాకిటి శ్రీహరి, అధికారులతో కలిసి చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లను సమగ్రంగా సమీక్షించినట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. వందల సంవత్సరాలుగా చేప ప్రసాదంపై ప్రజలకు అపారమైన విశ్వాసం ఉందని, ఈ క్రమంలో మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు వస్తారని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలు, శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.

జూన్ 8న రాత్రి 9 గంటలకు ప్రారంభం

సాధారణంగా ప్రతి ఏటా మృగశిర కార్తె ఉదయం పూట వస్తుందని, అయితే ఈసారి జూన్ 8వ తేదీ రాత్రి 9 గంటలకు మృగశిర కార్తె ప్రారంభం కానుందని మంత్రి తెలిపారు. ఈ మార్పును దృష్టిలో ఉంచుకుని, రాత్రి సమయంలో పంపిణీకి అవసరమైన ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జూన్ 9వ తేదీ రాత్రి వరకు నిరంతరాయంగా చేప ప్రసాదం పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందని పొన్నం ప్రభాకర్ వివరించారు. ఈ కార్యక్రమం కోసం అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, విధుల్లో ఎవరూ అప్రమత్తత వీడకూడదని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.

మృగశిర కార్తె సందర్భంగా వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వామ్యం అవుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వెలుపలి ప్రాంతాల నుండి వచ్చేవారికి వసతి, ఉచిత భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పంపిణీకి కావలసినన్ని చేప పిల్లలను ఇప్పటికే అందుబాటులో ఉంచామని, ట్రాఫిక్, తాగునీరు, పారిశుధ్యం వంటి ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారని మంత్రి స్పష్టం చేశారు.

Also Read: Revanth Reddy: హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా - దక్షిణాదికి బీజేపీ అన్యాయం - రేవంత్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో దాదాపు రెండు శతాబ్దాల నుంచి ఉబ్బస వ్యాధిగ్రస్తులకు బత్తిని ఫ్యామిలీ చేపప్రసాదం పంపిణీ చేస్తోంది. లక్షలాది మంది తరలివచ్చే అవకాశం ఉండటంతో లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉంటూ, పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. వచ్చే భక్తులకు క్యూ లైన్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు, మహిళలు, వృద్ధుల కోసం ప్రత్యేక క్యూ లైన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. సాధారణ ప్రజలకు త్వరితగతిన ప్రసాదం అందేలా చూసేందుకు ఈసారి వీఐపీ పాస్‌ల జారీని పరిమితం (లిమిట్) చేయాలని నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం సరిపడా తాగునీరు, తాత్కాలిక టాయిలెట్ల ఏర్పాటుతో పాటు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఉచిత భోజన సదుపాయాలు కల్పించేలా సర్వం సిద్ధం చేస్తున్నారు.

 

Frequently Asked Questions

చేప ప్రసాదం పంపిణీ ఎప్పుడు జరుగుతుంది?

చేప ప్రసాదం పంపిణీ జూన్ 8వ తేదీ రాత్రి 9 గంటలకు ప్రారంభమై జూన్ 9వ తేదీ రాత్రి వరకు కొనసాగుతుంది. ఇది మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా జరుగుతుంది.

చేప ప్రసాదం పంపిణీకి ఎవరు ఏర్పాట్లు చేస్తున్నారు, ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు?

తెలంగాణ ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల కోసం వసతి, ఉచిత భోజనం, తాగునీరు, పారిశుధ్యం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు.

ఈసారి చేప ప్రసాదం పంపిణీ రాత్రిపూట ఎందుకు ప్రారంభమవుతుంది?

సాధారణంగా ఉదయం వచ్చే మృగశిర కార్తె ఈసారి జూన్ 8న రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మార్పును దృష్టిలో ఉంచుకుని పంపిణీ రాత్రికి ఏర్పాటు చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Bonalu Traffic Diversions: బోనాల పండుగ.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపులు- ఈ రూట్లలో వెళ్తే జాగ్రత్త
బోనాల పండుగ.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపులు- ఈ రూట్లలో వెళ్తే జాగ్రత్త
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget