Hema Reaction : ఆ కొందరు డాష్‌లకు చెబుతున్నా... జాగ్రత్తగా ఉండండి - నెగిటివ్ కామెంట్స్‌పై హేమ స్ట్రాంగ్ వార్నింగ్
Actress Hema Reaction : తనపై నెగిటివ్ కామెంట్స్ చేసే వారిపై ప్రముఖ నటి హేమ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన పోస్టులకు కొందరు కావాలని ఫేక్ అకౌంట్స్ ద్వారా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారని అన్నారు.

Actress Hema Reaction On Negativity In Social Media : ప్రముఖ నటి హేమ సోషల్ మీడియా వేదికగా... తనపై వచ్చే నెగిటివ్ కామెంట్స్‌పై స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. డ్రగ్స్ కేసులో తనకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా... కొందరు పనిగట్టుకుని మరీ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ స్టా వేదికగా వీడియో రిలీజ్ చేశారు.
'లీగల్ యాక్షన్ తీసుకుంటా'
'మీ అందరికీ తెలుసు. హైకోర్టు నా మీద కేసు కొట్టేసింది. క్లీన్ చిట్ కూడా ఇచ్చింది. ఈ విషయాన్ని మీడియా, సోషల్ మీడియా ద్వారా ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను. దానికి ఎంత కష్టపడ్డానో మీ అందరికీ తెలుసు. ఈగల్ టీంలో శాంపిల్స్ కూడా నెగిటివ్ వచ్చింది. అది కూడా పోస్ట్ చేశాను. మీ అందరూ పార్టీలకు వెళ్లినట్లే నేను కూడా వెళ్లాను. అక్కడ ఏం జరిగిందో నాకు తెలీదని చెప్పాను. అయినా కొంతమంది డాష్‌లు రేవ్ పార్టీలకు వెళ్లట్లేదా? డ్రగ్స్ తీసుకోవట్లేదా? అంటూ ఫేక్ అకౌంట్స్ ద్వారా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు.
మరి వాళ్ల ప్రవర్తన ఎలాంటిది అని అనకూడదని నేను అనుకుంటున్నా. ఇంకోసారి నేను పెట్టిన వీడియోస్‌లో కానీ పోస్టుల్లో కానీ ఫోటోస్ కింద కానీ కామెంట్స్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకొక్కసారి ఇలా జరిగితే మాత్రం నేను లీగల్ యాక్షన్ తీసుకుంటాను. నా జోలికి రావొద్దు. డైరెక్ట్‌గా మీ ఇంటికొచ్చి కూర్చుంటాను. ఇది వార్నింగ్ అనుకుంటారా? రిక్వెస్ట్ అనుకుంటారా? నాకు సంబంధం లేదు.' అని చెప్పారు. రీసెంట్‌గా బెంగుళూరు రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారని ఆరోపణలు రాగా కోర్టు వాటిని కొట్టేసింది.
View this post on Instagram
Also Read : Ravi Teja : ఇరుముడి రిలీజ్ డేట్ - మాస్ మహారాజ్ హార్ట్ టచింగ్ ఎమోషనల్ స్టోరీ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?
Before You Go
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
ట్రెండింగ్ వార్తలు























