అన్వేషించండి

Raghava Lawrence : పాలిటిక్స్‌లోకి రాఘవ లారెన్స్ - విజయ్ టీవీకే పార్టీ తరఫున పోటీ?

Raghava Lawrence Reaction : తమిళనాడు రాజకీయాల్లో మరో స్టార్ ఎంట్రీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, డైరెక్టర్ రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీపై లేటెస్ట్ పోస్ట్ వైరల్ అవుతోంది.

Raghava Lawrence About His Political Entry : తమిళనాడు ఎన్నికల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరో కోలీవుడ్ స్టార్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా ఎన్నికల్లో టీవీకే పార్టీ ఘన విజయం సాధించి స్టార్ హీరో విజయ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం తనదైన పాలన మార్క్‌తో దూసుకెళ్తున్నారు. ఆయన పార్టీలో ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, డైరెక్టర్ రాఘవ లారెన్స్ జాయిన్ అవుతున్నారంటూ రెండు రోజులుగా ప్రచారం సాగుతోంది.

లారెన్స్ క్లారిటీ

ఈ రూమర్స్‌కు లారెన్స్ చెక్ పెట్టారు. సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. 'నేను తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని పలు మీడియా ప్లాట్ ఫామ్స్‌లో ప్రచారం జరుగుతోంది. నా మీడియా మిత్రులు కొందరు నాకు ఫోన్ చేసి దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ నన్ను కలవాలని అభ్యర్థిస్తున్నారు. ఈ ఊహాగానాలు పెరిగిపోయి నేను దీనిపై స్పందించాల్సిన అవసరం ఉందని భావించినందున, ఈ విషయాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నా.

నేను ప్రస్తుతం బెంజ్ సినిమా షూటింగ్‌లో ఉన్నాను. నా షెడ్యూల్ 10వ తేదీతో ముగుస్తుంది. మా అమ్మగారి ఆశీస్సులతో నా జీవితానికి సంబంధించి ఓ ముఖ్యమైన నిర్ణయం 11వ తేదీ గురువారం ఉదయం 9:30 గంటలకు అనౌన్స్ చేస్తాను.' అంటూ రాసుకొచ్చారు.

Also Read : Ravi Teja : ఇరుముడి రిలీజ్ డేట్ - మాస్ మహారాజ్ హార్ట్ టచింగ్ ఎమోషనల్ స్టోరీ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?

టీవీకే తరఫున పోటీ

ఏప్రిల్‌‌లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ పోటీ చేసి రెండు స్థానాల్లోనూ విజయం సాధించారు. పెరంబూర్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకుని తిరుచ్చి ఈస్ట్ వదులుకున్నారు. దీంతో ఇక్కడ త్వరలోనే బై ఎలక్షన్ జరగనుంది.

ఈ స్థానంలో లారెన్స్ టీవీకే తరఫు నుంచి పోటీ చేస్తారని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. దీనిపైనే ఈ నెల 11న ఆయన క్లారిటీ ఇవ్వనున్నారు. మరి ఆయన విజయ్ పార్టీలో చేరి పోటీలో నిలుస్తారా మరేదైనా ప్రకటన చేస్తారా? అనేది ఆసక్తిగా మారింది.

సామాజిక సేవలోనూ...

లారెన్స్ కేవలం నటనలోనే కాకుండా సామాజిక సేవలోనూ ఎప్పుడూ ముందుంటారు. తన తల్లి పేరు మీద అనాథలకు, వృద్ధులకు చేతనైన సాయం అందిస్తారు. అలాగే, మీడియాలో వచ్చిన కథనాలపైనా స్పందిస్తూ అవసరమైన వారికి తనకు తోచిన సాయం చేస్తుంటారు. ఆయన పొలిటికల్ ఎంట్రీ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read : Janhvi Kapoor: 'పెద్ది'కి జాన్వీ కపూర్ షాక్... ఫోనులు ఎత్తట్లేదు, రెస్పాన్స్ ఇవ్వట్లేదు

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
Embed widget