అన్వేషించండి

Janhvi Kapoor: 'పెద్ది'కి జాన్వీ కపూర్ షాక్... ఫోనులు ఎత్తట్లేదు, రెస్పాన్స్ ఇవ్వట్లేదు

Janhvi Kapoor Peddi Controversy: రామ్ చరణ్, 'పెద్ది' టీం అందరికీ హీరోయిన్ జాన్వీ కపూర్ షాక్ ఇచ్చారని తెలిసింది. హైదరాబాద్ నుంచి ఎవరు ఫోన్స్ చేసినా లిఫ్ట్ చేయడం లేదట.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • జాన్వీ కపూర్ 'పెద్ది'పై పెట్టుకున్న ఆశలు నిరాశగా మారాయి.
  • ఆమె పాత్ర చిత్రీకరణ, పైట సన్నివేశాలపై విమర్శలు వచ్చాయి.
  • ఈ అసంతృప్తితో జాన్వీ, ఆమె బృందం స్పందించడం లేదు.
  • దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణ చెప్పినా, ప్రచార అవకాశం కోల్పోయింది.

'పెద్ది' మీద రామ్ చరణ్, మెగా అభిమానులు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో ఎవరికీ తెలియలేదు కానీ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) మాత్రం చాలా ఆశలు పెట్టుకున్నారని తెలిసింది. విజయవాడలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 'పెద్ది'లో ఎక్కువ సేపు తనను చూస్తారని చెప్పారు. ఎన్టీఆర్ 'దేవర'లో ఆమె స్క్రీన్ టైమ్ తక్కువ. ఆ సినిమా విషయంలో కాస్త అసంతృప్తి చెంది ఉండవచ్చని, ఈసారి ఎక్కువ స్క్రీన్ స్పేస్‌తో పాటు మంచి సీన్స్ ఉన్నాయి కనుక ఆ విధంగా మాట్లాడి ఉండవచ్చని ప్రేక్షకులు భావించారు. 'పెద్ది' విడుదలైన తర్వాత జాన్వీపై 'దేవర' కంటే ఎక్కువ ట్రోలింగ్ జరిగింది.

జాన్వీ కపూర్ అంటే అంతేనా!?
సన్నివేశం ఏదైనా పైట తీసేయడమేనా!?
'దేవర'లోని కొన్ని సన్నివేశాల్లో జాన్వీ కపూర్ లంగా ఓణీ కడతారు. కానీ పైట ఉండదు. స్నానం చేసే సన్నివేశం కూడా ఉంటుంది. ఆ తర్వాత హిందీలో 'పరమ సుందరి' అని మరొక సినిమా చేశారు. అందులోని ఓ పాటలో చీర పైట తీసే సీన్ ఉంటుంది. అందులో పాత్రపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు 'పెద్ది'లోనూ చాలా సన్నివేశాల్లో పైట తీసి విసిరేసే సన్నివేశాలు ఉన్నాయి. 

Janhvi Kapoor: 'పెద్ది'కి జాన్వీ కపూర్ షాక్... ఫోనులు ఎత్తట్లేదు, రెస్పాన్స్ ఇవ్వట్లేదు
జాన్వీ కపూర్ అంటే ఒంటి మీద చీర కొంగు గానీ, పైట గానీ ఉండదా? ప్రతి సినిమాలో సన్నివేశం ఏదైనా పైట తీసేయడమేనా? అని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. 'దేవర' కంటే ఎక్కువ ఆమెపై ట్రోలింగ్ జరిగింది. జాన్వీ కపూర్ మీద మాత్రమే కాదు... 'పెద్ది' లాంటి పెద్ద సినిమాలో హీరోయిన్ రోల్ ఆ విధంగా చూపించడం అంటే మహిళలను అగౌరవపరచడమే అని కొందరు మండి పడ్డారు. సోషల్ మీడియాలో అటువంటి పోస్టులకు జాన్వీ కపూర్ లైక్ కొట్టారు. ఆ తర్వాత 'పెద్ది' విషయంలో ఆవిడ అసంతృప్తితో ఉన్నారని అర్థమైంది. అంతే కాదు... 'పెద్ది' విడుదల తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో సినిమా గురించి ఒక్కటంటే ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. అంతే కాదు... 'పెద్ది' టీంకు ఆవిడ గట్టి షాక్ ఇచ్చిందట.

'పెద్ది' ఫోన్స్ అస్సలు ఎత్తడం లేదు...
జాన్వీతో పాటు టీం నుంచి నో రెస్పాన్స్!
'పెద్ది' విడుదలైన తర్వాత జాన్వీ కపూర్ (Peddi Controversy)ను కాంటాక్ట్ కావడానికి సినిమా యూనిట్ చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయని తెలిసింది. విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం... 'పెద్ది' టీం నుంచి ఎవరు ఫోన్ చేసినా జాన్వీ కపూర్ లిఫ్ట్ చేయడం లేదట. తన కోపాన్ని ఆ విధంగా 'పెద్ది' బృందానికి తెలిసేలా చేసిందట. హిందీ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు సైతం ఆమె అసంతృప్తిని తెలిసేలా చేశాయి.

Also ReadPeddi Vs Game Changer - పెద్ది వర్సెస్ గేమ్ ఛేంజర్... ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ మార్కెట్ పడిందా?

జాన్వీ కపూర్ మాత్రమే కాదు... ఆమె టీం కూడా 'పెద్ది' దర్శక నిర్మాతల ఫోన్స్ లిఫ్ట్ చేయడం మానేశారట. షూటింగ్ అంటే హీరోయిన్ వెంట మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ డ్రెస్సర్, స్టైలిస్ట్, పర్సనల్ అసిస్టెంట్ అంటూ మినిమమ్ నలుగురు ఉంటారు. వాళ్ళ నంబర్స్ అన్నీ అసిస్టెంట్ డైరెక్టర్లు, ప్రొడక్షన్ టీమ్ దగ్గర ఉంటాయి. వాళ్ళు ఫోన్స్ చేసినా జాన్వీ కపూర్ అండ్ టీమ్ అవాయిడ్ చేస్తున్నారట. ఒక్కరి ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని తెలిసింది. దాంతో 'పెద్ది' టీంకి గట్టిగా షాక్ తగిలింది. రామ్ చరణ్ ఇన్వాల్వ్ అయ్యి ఏమైనా చేస్తే తప్ప ఇష్యూ సెటిల్ అయ్యేలా కనిపించడం లేదు.

Also ReadRam Charan Vs NTR - రామ్ చరణ్ vs ఎన్టీఆర్... 'ఆర్ఆర్ఆర్' తర్వాత బిజినెస్‌లో అప్పర్ హ్యాండ్ ఎవరిది?

'పెద్ది' విడుదల రోజున తిరుమల వెళ్లి ఏడు కొండల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. కొండ మీద కూడా 'పెద్ది' గురించి మాట్లాడలేదు జాన్వీ. ఇప్పుడు టీమ్ ఫోన్స్ లిఫ్ట్ చేయడం లేదు. జాన్వీ రోల్ మీద వచ్చిన విమర్శల పట్ల బుచ్చిబాబు సానా సారీ చెప్పడం వెనుక కారణం అదేనని తెలిసింది. సినిమా విడుదలకు ముందు జాన్వీ కపూర్ బాడీ పార్ట్స్ చూపించే సన్నివేశాలపై ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక టీమ్ మెంబర్స్ కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారట. అంతలా చూపించడం అవసరం లేదని, కట్ చేయమని చెబితే దర్శకుడు బుచ్చిబాబు సానా వినలేదని టాలీవుడ్ ఖబర్. తర్వాత సారీ చెప్పారు. అప్పటికి జరగాల్సిన నష్టం జరిగింది. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేసినా హిందీలో కొద్దో గొప్పో లాభం చేకూరేది. ఆ కొద్దిపాటి అవకాశం జాన్వీ కపూర్ కోపంతో చేజారింది. జాన్వీని 'పెద్ది' ఎలా కూల్ చేస్తారో చూడాలి.

Also ReadPeddi Vs Bollywood Movie - పెద్దితో బాక్సాఫీస్ క్లాష్... రిలీజ్ డే బాలీవుడ్ సినిమా టికెట్ రేట్స్‌పై డిస్కౌంట్ ఆఫర్

Frequently Asked Questions

జాన్వీ కపూర్ 'పెద్ది' సినిమాపై అసంతృప్తిగా ఉన్నారని ఎలా తెలిసింది?

తన పాత్రపై వచ్చిన విమర్శల పోస్టులకు ఆమె లైక్ కొట్టారు. సినిమా విడుదల తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. ఆమె టీం కూడా 'పెద్ది' టీం ఫోన్స్ ఎత్తడం లేదు.

'పెద్ది' విడుదల తర్వాత జాన్వీ కపూర్ పై ట్రోలింగ్ ఎందుకు జరిగింది?

సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ఆమె పైట తీసేసిన విధానంపై విమర్శలు వచ్చాయి. మహిళలను అగౌరవపరచడమే అని కొందరు మండిపడ్డారు.

'పెద్ది' సినిమా విడుదల తర్వాత దర్శకుడు బుచ్చిబాబు సానా ఎలా స్పందించారు?

జాన్వీ కపూర్ పాత్రపై వచ్చిన విమర్శల పట్ల దర్శకుడు బుచ్చిబాబు సానా క్షమాపణ చెప్పారు. సినిమా విడుదలకు ముందే కొంతమంది టీమ్ మెంబర్స్ మార్పులు సూచించినా ఆయన వినలేదని తెలిసింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Jana Nayakudu OTT: జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Embed widget