అన్వేషించండి

Ram Charan Vs NTR: రామ్ చరణ్ vs ఎన్టీఆర్... 'ఆర్ఆర్ఆర్' తర్వాత బిజినెస్‌లో అప్పర్ హ్యాండ్ ఎవరిది?

Peddi Vs Devara Pre Release Business: ఎన్టీఆర్, రామ్ చరణ్... ఇద్దరి కెరీర్‌లో 'ఆర్ఆర్ఆర్' బిగ్గెస్ట్ హిట్. ఆ తర్వాత ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగింది? మార్కెట్టులో అప్పర్ హ్యాండ్ ఎవరిది? తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హిట్స్ పరంగా ఎన్టీఆర్, బిజినెస్ పరంగా చరణ్ ముందున్నారు.

ఇండియన్ సినిమాను గ్లోబల్ స్టేజికి తీసుకు వెళ్లిన ఘనత రాజమౌళి 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాది. అందులోని 'నాటు నాటు...' పాటకు ఆస్కార్ వచ్చింది. ఆ పాటలో స్టెప్పులు వేసినది ఎన్టీఆర్, రామ్ చరణ్. వాళ్ళిద్దరి కెరీర్‌లో 'ఆర్ఆర్ఆర్' బిగ్గెస్ట్ హిట్. ఆ తర్వాత ఇద్దరి సినిమాలకు ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగింది? మార్కెట్టులో ఎవరిది అప్పర్ హ్యాండ్? అనేది తెలుసుకోండి. 

దేవర వర్సెస్ పెద్ది... రెండిటి మధ్య పోటీ!
Peddi vs Devara Pre Release Business Comparison: 'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్ మూడు సినిమాలు చేశారు. అందులో 'ఆచార్య'ను అభిమానులు, ప్రేక్షకులు చాలా మంది కన్సిడర్ చేయడం లేదు. ఆ సినిమాలో చిరంజీవి హీరో. రామ్ చరణ్ ప్రత్యేక పాత్ర చేశారు. సోలో హీరోగా అయితే... 'గేమ్ ఛేంజర్', 'పెద్ది' చేశారు.

'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ రెండు సినిమాలు చేశారు. అందులో ఒకటి 'దేవర'. మరొకటి... 'వార్ 2'. ఇది ఆయన బాలీవుడ్ డెబ్యూ. అందులో హృతిక్ రోషన్ కూడా ఉన్నారు. ఆ సినిమాను అసలు తెలుగులో సరిగా ప్రమోట్ చేయలేదు. బాలీవుడ్ సినిమాగా చూశారు తెలుగు ప్రేక్షకులు కూడా. ఎన్టీఆర్, రామ్ చరణ్... 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఇద్దరి సినిమాల బిజినెస్ ఎలా ఉంది? థియేట్రికల్ రైట్స్ ద్వారా ఏ ఏరియా నుంచి ఎన్ని కోట్లు వచ్చాయి? అనేది చూస్తే...

Also Read: Peddi Vs Game Changer Pre Release Business - పెద్ది వర్సెస్ గేమ్ ఛేంజర్... ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ మార్కెట్ పడిందా?

సినిమా  గేమ్ ఛేంజర్ (కోట్లలో) దేవర (కోట్లలో) వార్ 2 (కోట్లలో) పెద్ది (కోట్లలో)
ఏపీ, తెలంగాణలో 122  112.55 90.50 135.25
హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియా (కేరళ, తమిళనాడు, కర్ణాటక) 74 43 193.50 49.25 
టోటల్ ఇండియాలో 196 155.50 284 184.50
ఓవర్సీస్ (విదేశాల్లో) 25 27 56 34
వరల్డ్ వైడ్ బిజినెస్ 221 182.25 340 218.50

Also Read: Coolie vs War 2 Pre Release Business - కూలీ vs వార్ 2... బిజినెస్‌లో ఎవరిది అప్పర్ హ్యాండ్? మార్కెట్టులో ఎవరి సినిమా క్రేజ్ ఎక్కువ?

'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్, చరణ్ సినిమాల్లో హయ్యస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా 'వార్ 2'. అందుకు చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ముఖ్యంగా హిందీలో ఆ సినిమా బిజినెస్ ఎక్కువ జరిగింది. తెలుగు రాష్ట్రాలు, రెస్టాఫ్ ఇండియా పక్కన పెడితే... హిందీ బెల్ట్‌లో 175 కోట్ల బిజినెస్ చేసింది. 'వార్' హిట్ తర్వాత రావడం, యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ మూవీ కావడం కూడా అందుకు ఓ కారణం. అయితే... ఆ సినిమా బాక్సాఫీస్ బరిలో ఫ్లాప్ అయ్యింది. 'దేవర'కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయి.

'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్ ఖాతాలో హిట్ లేదు. 'ఆచార్య', 'గేమ్ ఛేంజర్' సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. దాంతో 'పెద్ది'తో హిట్ అందుకోవాల్సిన అవసరం రామ్ చరణ్ మీద ఉంది. ఆయన లాస్ట్ రెండు సినిమాలు ఫ్లాప్ అయినా 'పెద్ది' బిజినెస్ మీద ఎఫెక్ట్ ఏమీ పడలేదు. కానీ, ఈ సినిమాతో ఆయన భారీ హిట్ అందుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. ప్రస్తుతానికి ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా అప్పర్ హ్యాండ్ రామ్ చరణ్ (Ram Charan)ది అయినప్పటికీ... హిట్స్ పరంగా ఎన్టీఆర్ (NTR)ది అప్పర్ హ్యాండ్. 'దేవర' కలెక్షన్లను 'పెద్ది' బీట్ చేస్తుందో? లేదో? వెయిట్ అండ్ సి. 

Also Read: Dragon Glimpse Decoded - ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్‌లో హిడెన్ డీటెయిల్స్... ప్రశాంత్ నీల్ సీక్రెట్ క్లూస్ గమనించారా?

టాప్ హెడ్ లైన్స్

Ranabaali Twitter Review - రణబాలి ట్విట్టర్ రివ్యూ: విజయ్ - రష్మిక సినిమా ఫ్లాపా? నెగిటివ్ ట్వీట్లు... సోషల్ మీడియాలో టాకేంటి?
రణబాలి ట్విట్టర్ రివ్యూ: విజయ్ - రష్మిక సినిమా ఫ్లాపా? నెగిటివ్ ట్వీట్లు... సోషల్ మీడియాలో టాకేంటి?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ హారర్ థ్రిల్లర్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ హారర్ థ్రిల్లర్ డోంట్ మిస్
Sunil : పవర్ ఫుల్ లాయర్‌గా సునీల్ - డ్యూ డేట్ మూవీలో క్రేజీ రోల్...
పవర్ ఫుల్ లాయర్‌గా సునీల్ - డ్యూ డేట్ మూవీలో క్రేజీ రోల్...
Karikaala Movie: పూజతో సందీప్ కిషన్ 'కరికాల' ప్రారంభం... ముగ్గురు హీరోయిన్లు, రెండు భాగాలు - రిలీజ్ ఎప్పుడంటే?
పూజతో సందీప్ కిషన్ 'కరికాల' ప్రారంభం... ముగ్గురు హీరోయిన్లు, రెండు భాగాలు - రిలీజ్ ఎప్పుడంటే?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget