అన్వేషించండి

Peddi Vs Game Changer: పెద్ది వర్సెస్ గేమ్ ఛేంజర్... ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ మార్కెట్ పడిందా?

Peddi Vs Game Changer Pre Release Business: 'గేమ్ ఛేంజర్' ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా 'పెద్ది'. బిజినెస్ పరంగా ఏ సినిమాది అప్పర్ హ్యాండ్? చరణ్ మార్కెట్ ఎలా ఉంది? అనేది తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పెద్ది' సినిమాకు 218.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
  • గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అయినా, రామ్ చరణ్ మార్కెట్ పడిపోలేదు.
  • పెద్ది బడ్జెట్ 350 కోట్లు, గేమ్ ఛేంజర్ బడ్జెట్ 400-450 కోట్లు.

'పెద్ది' (Peddi Movie)లో రామ్ చరణ్ (Ram Charan) బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, మేకోవర్ గురించి దర్శకుడు బుచ్చిబాబు నుంచి నటులు జగపతి బాబు, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు వరకు... ప్రతి ఒక్కరూ గొప్పగా చెబుతున్నారు. సినిమాలో చివరి 50 నిమిషాలు హై ఇస్తుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ప్రేక్షకులలోనూ సినిమాపై అంచనాలు బావున్నాయి. మరి, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగింది? 'గేమ్ ఛేంజర్' ఫ్లాప్ ఎఫెక్ట్ పడిందా? రెండు సినిమాల్లో ఏది ఎక్కువ బిజినెస్ చేసింది? వంటి వివరాలు తెలుసుకోండి.

గేమ్ ఛేంజర్ వర్సెస్ పెద్ది...
బిజినెస్‌లో అప్పర్ హ్యాండ్ ఎవరిది?
'ఆర్ఆర్ఆర్', 'గేమ్ ఛేంజర్' తర్వాత రెండు వందల కోట్ల కంటే ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన రామ్ చరణ్ సినిమాగా 'పెద్ది' రికార్డు క్రియేట్ చేసింది. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ చూస్తే... 'పెద్ది' బిజినెస్ మీద 'గేమ్ ఛేంజర్ ' ఫ్లాప్ ఎఫెక్ట్ పడలేదని చెప్పాలి. 

'గేమ్ ఛేంజర్' వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 221 కోట్లు అయితే... 'పెద్ది' ప్రీ రిలీజ్ బిజినెస్ 218.50 కోట్లు. రెండిటి మధ్య డిఫరెన్స్ కేవలం రెండున్నర కోట్లు మాత్రమే. 'గేమ్ ఛేంజర్' ఫ్లాప్ వల్ల చరణ్ మార్కెట్ మరీ కిందకు ఏమీ పడలేదు. జస్ట్ రెండు కోట్లు తక్కువ వచ్చిందంతే. ఏ ఏరియా నుంచి ఎన్ని కోట్లు వచ్చింది? అనేది చూస్తే...

ఏరియా గేమ్ ఛేంజర్ (రూ. కోట్లలో) పెద్ది (రూ. కోట్లలో)
నైజాం (తెలంగాణ) 43.50 48
సీడెడ్ (రాయలసీమ) 23 24
ఉత్తరాంధ్ర (విశాఖ రీజియన్) 14.20 18
తూర్పు గోదావరి 10 10.20
పశ్చిమ గోదావరి 8.10 8.25
గుంటూరు 10.20 11.20
కృష్ణ 8.50 9.30
నెల్లూరు  4.50 6.30
ఏపీ & తెలంగాణ (టోటల్) 122 135.25
కర్ణాటక 14.50 17
తమిళనాడు 15 5.25
కేరళ  2 2
హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియా  42.50 25
ఓవర్సీస్ 25 34
వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్  221 218.50

'గేమ్ ఛేంజర్'తో కంపేర్ చేస్తే... తెలుగు రాష్ట్రాల్లో 'పెద్ది' ఎక్కువ బిజినెస్ చేసింది. అయితే... శంకర్ దర్శకుడు కావడంతో తమిళనాడులో 'గేమ్ ఛేంజర్' మంచి బిజినెస్ చేసింది. దాంతో ఓవరాల్ బిజినెస్ పరంగా 'పెద్ది' కాస్త వెనుకబడింది. 

Also Read: Peddi Twitter Review - అమెరికాలో 'పెద్ది' ఫస్ట్ షో ఎప్పుడు? రామ్ చరణ్ సినిమా ట్విట్టర్ రివ్యూస్, ప్రీమియర్స్ రిపోర్ట్ వచ్చేది ఎప్పుడంటే?

'గేమ్ ఛేంజర్' కంటే 'పెద్ది' బడ్జెట్ తక్కువ!
'పెద్ది' బడ్జెట్ 350 కోట్లు అని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు బుచ్చిబాబు సానా చెప్పారు. సో... అటు ఇటుగా 350 కోట్లు ఖర్చు చేసి ఉంటారని చెప్పవచ్చు. దీని కంటే ముందు రామ్ చరణ్ చేసిన సినిమా 'గేమ్ ఛేంజర్'. ఆ సినిమా నిర్మాత 'దిల్' రాజు తమకు నష్టాలు వచ్చాయని చెప్పారు. కానీ, సినిమాకు ఎంత ఖర్చు చేశారు? అనేది చెప్పలేదు. అయితే... 'గేమ్ ఛేంజర్'కు దర్శకుడు శంకర్ గట్టిగా ఖర్చు చేశారని తెలిసింది. సుమారు 400 నుంచి 450 కోట్ల వరకు ఖర్చు చేశారట. ఆ లెక్కన 'గేమ్ ఛేంజర్'తో కంపేర్ చేస్తే... 'పెద్ది' సేఫ్ ప్రాజెక్ట్. 

Also ReadUpcoming Telugu Movies In June 2026 - జూన్‌లో తెలుగు థియేట్రికల్ రిలీజెస్ లిస్ట్... రామ్ చరణ్ 'పెద్ది' to సమంత 'బంగారం', అఖిల్ 'లెనిన్'

'పెద్ది' నిర్మాతలకు ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా 218 కోట్లు వచ్చాయి. ఓటీటీ, ఆడియో, శాటిలైట్ డీల్స్ ద్వారా మరో వంద కోట్ల వరకు వచ్చి ఉంటాయని అంచనా. మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంటే... మిగతా డబ్బులు కూడా రికవరీ చేసే అవకాశం ఉంటుంది. క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ నుంచి వచ్చే మౌత్ టాక్ మీద 'పెద్ది' రిజల్ట్ డిపెండ్ అయ్యి ఉంది.

Also ReadUpcoming OTT Releases In June 2026 - జూన్‌లో ఓటీటీ లవర్స్‌కు పండగ... ధురంధర్ 2 to కేడీ, పేట్రియాట్... స్ట్రీమింగ్ అయ్యే టైటిల్స్‌ లిస్ట్

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
Jailer 2 OTT : జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget