అన్వేషించండి

B.Tech Student Missing: హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి

BTech Student Missing in Hyderabad | బీటెక్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థి గత కొన్ని రోజులుగా కనిపించడం లేదు. బిడ్డ ఆచూకీ తెలియడం లేదని తల్లి బాధపడుతున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి అంకం రాహుల్ అదృశ్యమయ్యాడు.
  • మే 25 నుండి ఆచూకీ లేదు; కాచిగూడలో చివరిసారి కనిపించాడు.
  • కుటుంబం తీవ్ర ఆందోళనలో; సమాచారం కోసం అందరినీ అభ్యర్థిస్తున్నారు.

Hyderabad Crime News | హైదరాబాద్: నగరంలో చదువుకుంటున్న ఒక బీటెక్ విద్యార్థి అకస్మాత్తుగా అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. తన కొడుకు ఏమయ్యాడో, అతడి ఆచూకీ తెలియక కన్నతల్లి తల్లడిల్లిపోతున్నారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే 8074856067, 6300799651 నెంబర్లలో సమాచారం ఇవ్వాలని కోరారు.

అసలేం జరిగిందంటే..
 ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న అంకం రాహుల్ అనే విద్యార్థి మే 25న అదృశ్యమయ్యాడు. గత 10 రోజుల నుండి అతడి ఆచూకీ లభించడం లేదు. మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో ఈఈఈ ఫైనల్ చదువుతున్న విద్యార్థి హైదరాబాద్‌లోని తన హాస్టల్ నుండి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో, అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు అన్ని చోట్లా గాలిస్తున్నారు. రోజులు గడుస్తున్నా కొడుకు జాడ లభించకపోవడంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. చివరగా కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో కనిపించాడని, ఆ తరువాత నుంచి ఆచూకీ లేదని సమాచారం. ఓ యువతితో గొడవ జరిగిన తరువాత నుంచి రాహుల్ కనిపించడం లేదని తెలుస్తోంది.

రాహుల్ స్వగ్రామం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని ఐలాపూర్ గ్రామం. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వెళ్లిన తమ బిడ్డ ఇలా అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడనే వార్త తెలియడంతో ఐలాపూర్ గ్రామంలో, అతని కుటుంబంలో తీవ్ర ఆందోళన నెలకొంది. కాగా, దర్యాప్తులో భాగంగా రాహుల్ చివరిసారిగా హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్‌లో కనిపించినట్లు సమాచారం అందింది. ఆ తర్వాత అతను ఎటు వెళ్లాడనే దానిపై స్పష్టత లేకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది.

Also Read: Telangana Youth Shot Dead: అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు

ఎదిగిన కొడుకు, త్వరలో జాబ్ చేసి కుటుంబానికి ఆసరగా మారతాడనుకున్న సమయంలో అదృశ్యం కావడంతో అంకం రాహుల్ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ‘నా కొడుకు రాహుల్ ఎక్కడైనా కనిపిస్తే దయచేసి మాకు ఫోన్ చేసి చెప్పండి. వాడు లేకపోతే మేము బతకలేము. రాహుల్ వివరాలను వీలైనంత వరకు సోషల్ మీడియాలో షేర్ చేయాలని, అతను క్షేమంగా ఇల్లు చేరడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని’ ఆమె చేతులు జోడించి అందరినీ కోరారు. ఈ బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ రాహుల్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే స్థానిక పోలీసు అధికారులకు లేదా కుటుంబ సభ్యులకు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.

 

Frequently Asked Questions

ఎవరు అదృశ్యమయ్యారు?

హైదరాబాద్‌లోని మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో ఈఈఈ ఫైనల్ చదువుతున్న అంకం రాహుల్ అనే బీటెక్ విద్యార్థి అదృశ్యమయ్యాడు.

రాహుల్ ఎప్పుడు అదృశ్యమయ్యాడు?

అంకం రాహుల్ మే 25న తన హాస్టల్ నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. గత 10 రోజుల నుండి అతని ఆచూకీ లభించడం లేదు.

రాహుల్ చివరిసారిగా ఎక్కడ కనిపించాడు?

రాహుల్ చివరిసారిగా హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో కనిపించినట్లు సమాచారం. ఆ తర్వాత అతని ఆచూకీ లేదు.

రాహుల్ ఆచూకీ తెలిస్తే ఎవరికి తెలియజేయాలి?

రాహుల్ గురించి ఏదైనా సమాచారం తెలిస్తే 8074856067, 6300799651 నెంబర్లలో లేదా స్థానిక పోలీసు అధికారులకు తెలియజేయవచ్చు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget