అన్వేషించండి

Telangana Youth Shot Dead: అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు

US Gunfire | అమెరికాలోని నార్త్ ఫిలడెల్ఫియాలో తెలంగాణకు చెందిన ఉద్యోగి కుంచ అన్షుల్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. పిజ్జా డెలివరీ చేస్తుండగా, కాల్పులు జరిపారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అమెరికాలో తెలుగు యువకుడు కుంచ అన్షుల్ దారుణ హత్య.
  • పిజ్జా డెలివరీ చేస్తుండగా గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో మృతి.
  • హత్యకు గల కారణాలు తెలియరాలేదు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
  • అన్షుల్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించాలని కుటుంబం విజ్ఞప్తి.

హైదరాబాద్: అమెరికాలో మరో తెలుగు యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. పార్ట్ టైమ్ ఉద్యోగంలో భాగంగా పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్లిన సమయంలో గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన కుంచ శ్రీనివాస్, నీలిమ దంపతుల కుమారుడు కుంచ అన్షుల్ (28) ఉద్యోగం నిమిత్తం 2023లో అమెరికాకు వెళ్లాడు. ప్రస్తుతం ఆయన నార్త్ ఫిలడెల్ఫియాలో ఉంటున్న అన్షఉల్ కేడబ్ల్యూసీ (KWC) అనే సంస్థలో జాబ్ చేస్తున్నాడు. ఖర్చులకు పనికొస్తుందని, అదనపు ఆదాయం కోసం వీకెండ్స్ పిజ్జా డెలివరీ బాయ్‌గా  పనిచేస్తున్నాడు.

ఇంట్లోకి వెళ్లగానే కాల్పులు
శుక్రవారం రాత్రి ఎడ్‌గ్లీ స్ట్రీట్‌లోని రేమండ్ రోజెస్ హోమ్స్ వద్ద ఉన్న ఓ ఇంటి నుండి మూడు పిజ్జాల కోసం ఆర్డర్ వచ్చింది. అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 12:30 గంటలకు కుంచ అన్షుల్ ఆ ఆర్డర్ డెలివరీ చేయడానికి వెళ్లాడు. తన వాహనం దిగి ఇంటి ప్రాంగణంలోకి అడుగుపెట్టిన కొద్దిసేపటికే, మాస్కులు ధరించిన కొందరు దుండగులు అన్షుల్‌పై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. తల వెనుక భాగంలో బుల్లెట్ తగిలి తీవ్ర రక్తస్రావంతో అన్షుల్ అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. ఆ దారిలో వెళ్లే కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Also Read: US Iran War Latest News: ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి

ఈ దారుణ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. హత్య జరిగిన స్థలంలో మూడు బుల్లెట్ షెల్స్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని స్థానిక అమెరికా పోలీసులు తెలిపారు. ఈ విషాద వార్త తెలియడంతో గుండ్లపోచంపల్లిలోని అన్షుల్ నివాసంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తన సోదరుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తీసుకువచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి సహాయం చేయాలని మృతుడి సోదరి  మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. 

అమెరికాలో ఉన్నత భవిష్యత్తు కోసం వెళ్లిన తెలుగు యువకులు వరుస ప్రమాదాలు, హింసాత్మక ఘటనల్లో ప్రాణాలు కోల్పోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జరిగిన కొన్ని విచారకరమైన ఘటనలు ఇలా ఉన్నాయి. 

కనెక్టికట్ రోడ్డు ప్రమాదం: తెలంగాణకు చెందిన ఇద్దరు తెలుగు విద్యార్థులు కనెక్టికట్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని వేగంగా వచ్చిన మరొక ట్రక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు విద్యార్థినులు ప్రాణాలు కోల్పోయారు.

Also Read: Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు

టెక్సాస్ సరస్సులో మునిగి మృతి: ఖమ్మం జిల్లాకు చెందిన ఒక ఐటీ ఉద్యోగి వీకెండ్ సెలవుల్లో టెక్సాస్‌లోని ఒక సరస్సులో బోటింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మరణించారు.

షికాగోలో కాల్పుల కలకలం: చదువు ముగించుకుని అక్కడే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న మరో తెలుగు యువకుడు షికాగోలో జరిగిన ఒక దోపిడీ ముఠా జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

Frequently Asked Questions

అమెరికాలో హత్యకు గురైన తెలుగు యువకుడు ఎవరు?

అతను కుంచ అన్షుల్ (28), మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, గుండ్లపోచంపల్లికి చెందినవాడు. 2023లో ఉద్యోగం నిమిత్తం అమెరికాకు వెళ్ళాడు.

అన్షుల్ ఎలా హత్యకు గురయ్యాడు?

పిజ్జా డెలివరీకి వెళ్లినప్పుడు, మాస్కులు ధరించిన దుండగులు కాల్పులు జరిపారు. తల వెనుక భాగంలో బుల్లెట్ తగిలి అక్కడికక్కడే మరణించాడు.

ఈ హత్యకు గల కారణాలు ఏమైనా తెలిసాయా?

ఈ దారుణ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు సంఘటనా స్థలంలో మూడు బుల్లెట్ షెల్స్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

మృతుడి కుటుంబ సభ్యుల విజ్ఞప్తి ఏమిటి?

అన్షుల్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తీసుకువచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని అతని సోదరి కోరారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Embed widget