అన్వేషించండి

Adilabad Crime News: పార్క్ చేసిన వాహనాలను క్షణాల్లో మాయం చేసే ముఠా అరెస్టు! ఛేజ్ చేసి పట్టుకున్న ఆదిలాబాద్ పోలీసులు!

Adilabad Crime News: పార్క్ చేసిన వాహనాలను విడిభాగాలుగా మార్చి క్షణాల్లో మాయం చేసే ముఠా ఆదిలాబాద్ పోలీసులకు చిక్కింది. తప్పించుకోబోయిన వారిని ఛేజ్ చేసి పట్టుకున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అంతర్రాష్ట్ర భారీ వాహనాల చోరీ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు.
  • లారీ డ్రైవర్లను బెదిరించి, వాహనాలను ఎత్తుకెళ్లే ముఠా సభ్యులు అరెస్ట్.
  • సాంకేతిక పరిజ్ఞానంతో హైవేలపై భారీ వాహనాలు దొంగిలిస్తున్న ముఠా సభ్యులు పట్టిక.
  • దొంగిలించిన వాహనాలను విడిభాగాలుగా విడగొట్టి అమ్ముతున్నారని వెల్లడించిన పోలీసులు.

Adilabad Crime News: హైవేలపై ప్రయాణించే లారీ డ్రైవర్లు, క్లీనర్లకు కునుకులేకుండా చేస్తున్న ఒక భారీ అంతర్రాష్ట్ర ముఠా ఆగడాలను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అడ్డుకున్నారు. పక్కా ప్లానింగ్‌తో అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో భారీ వాణిజ్య వాహనాలను మాయం చేస్తున్న ఈ ముఠా నెట్‌వర్క్ హర్యానా నుంచి మహారాష్ట్ర వరకు విస్తరించి ఉంది. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్ నేతృత్వంలో పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌లో ముగ్గురు కీలక నిందితులు చిక్కారు. 

అర్థరాత్రి పోలీసుల ఛేజింగ్

మావల బైపాస్ రోడ్డు వద్ద పోలీసులు సాధారణంగా వాహన తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో తెల్లటి టయోటా ఎటియోస్ కారు అనుమానాస్పదంగా కనిపించింది. పోలీసులను చూడగానే ఆ కారులో ఉన్న వారు పరారయ్యేందుకు ప్రయత్నించారు. అయితే అప్రమత్తమైన పోలీస్ బృందం వారిని వెంబడించి ముగ్గురును అదుపులోకితీసుకున్నారు. వారిని విచారిస్తే దేశవ్యాప్తంగా సాగుతున్న భారీ వాహనాల చోరీల వెనుక ఉన్న అసలు రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. 

అరెస్టు అయిన నిందితులు అంతరాష్ట్ర నేరాల్లో ఆరితేరిన వారు. హర్యానాకు చెందిన సలీం వృత్తిరీత్యా ట్రక్ డ్రైవర్. హైవేలపై వాహనాల కదలికలపై ఇతనికి పూర్తి అవగాహన ఉంది. రెండో వ్యక్తి నఫీస్ ఖాన్. హర్యానాలోని మేవాత్ జిల్లాకు చెందిన ఇతను కూడా ట్రక్ డ్రైవరే. భారీ వాహనాలను సులువుగా నడపడంలో దిట్ట. ఇంతియాజ్ మూడోవాడు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాకు చెందిన మెకానికక్. వాహనాల లాక్ సిస్టమ్‌ను వైరింగ్‌ను నిమిాల్లో ఛేదించడం ఇతని స్పెషాలిటీ. వీరితోపాటు మరో ఏడుగురు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు వారిపై కేసులు పెట్టారు. 

మోడస్ ఆపరేండీ ఎలా ఉందంటే?

తమ వద్ద ఉన్న టయోటా కారులో వివిధ రాష్ట్రాల హైవేలపై తిరుగుతూ పెట్రోల్ బంకులు, లేదా నిర్మానుష్య ప్రాంతాల్లో పార్క్ చేసిన ఐషర్, టిప్పర్ వంటి భారీ వాహనాలను లక్ష్యంగా చేసుకుంటారు. మెకానిక్ సహాయంతో వాహనం తలుపు గ్లాస్ పగులగొట్టి స్టీరింగ్ లాంగ్ విరగ్గొడతారు. ఇగ్నిషన్ వైరింగ్‌ను కట్ చేసి డైరెక్ట్‌ కనెక్షన్‌ ద్వారా వాహనాన్ని స్టార్ట్ చేస్తారు. దొంగలించిన వాహనాన్ని వెంటనే మహారాష్ట్ర లేదా గుజరాత్‌ రాష్ట్రాలకు తరలిస్తారు. 

దొంగలించిన వాహనాన్ని కేవలం గంటల వ్యవధిలోనే విడిభాగాలుగా విడగొట్టేస్తారు. ఆ భాగాలను విడివిడిగా అమ్మేస్తారు. ఆనవాళ్లు దొరక్కుండా చేస్తారు. నిందితుల నుంచి ప్రస్తుతం టయోటా కారుతోపాటు మూడు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. 

Frequently Asked Questions

లారీ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకున్న ముఠాను ఎవరు పట్టుకున్నారు?

ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ఒక భారీ అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠా హైవేలపై ప్రయాణించే లారీ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకునేది.

పట్టుబడిన ముఠా సభ్యులు ఎవరు మరియు వారి నైపుణ్యాలు ఏమిటి?

హర్యానాకు చెందిన సలీం, నఫీస్ ఖాన్ ట్రక్ డ్రైవర్లు. రాజస్థాన్ కు చెందిన మెకానిక్ ఇంతియాజ్ వాహనాల లాక్ సిస్టమ్, వైరింగ్ నిపుణుడు.

ఈ ముఠా భారీ వాహనాలను ఎలా దొంగిలించేది?

వారు కారులో తిరుగుతూ, నిర్మానుష్య ప్రాంతాల్లో పార్క్ చేసిన భారీ వాహనాలను లక్ష్యంగా చేసుకునేవారు. మెకానిక్ సహాయంతో వాహనాన్ని తెరిచి, వైరింగ్ కట్ చేసి స్టార్ట్ చేసేవారు.

దొంగిలించిన వాహనాలను ఈ ముఠా ఏం చేసేది?

దొంగిలించిన వాహనాలను గంటల వ్యవధిలోనే విడిభాగాలుగా విడగొట్టి, ఆనవాళ్లు దొరక్కుండా విడివిడిగా అమ్మేసేవారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget