అన్వేషించండి

Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం

వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉన్నాడనే నెపంతో, అలాగే రూ.2 కోట్ల భారీ బీమా సొమ్మును కాజేయాలనే దురాశతో ఓ భార్యే సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భార్య, వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తితో కలిసి భర్త హత్య చేయించారు.
  • రూ.2 కోట్ల బీమా సొమ్ము కోసమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు.
  • ప్రమాదంగా చిత్రీకరించేందుకు మద్యం తాగించి, సుత్తితో కొట్టి హత్య చేశారు.
  • భార్య, సహ నిందితులు అరెస్టు, ఒకరు పరారీలో ఉన్నట్లు వెల్లడి.

వివాహేతర సంబంధం కొనసాగించడం, రూ.2 కోట్ల బీమా సొమ్ము కోసం భార్యే సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన ఘటన మంచిర్యాల జిల్లాలో కలకలం రేపింది. మంచిర్యాల డీసీపీ భాస్కర్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడి పేటకు చెందిన సాయిని కుమార్ (45) తన మోటార్ సైకిల్ పై ఈ నెల 22న మంచిర్యాల వైపు వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానికులు 108లో కరీంనగర్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.

ప్రమాదంపై అనుమానం ఉండటంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే సాయిని కుమార్ భార్య భారతికి గుడిపేటకు చెందిన లగిశెట్టి సురేందర్ కు వివాహేతర సంబంధం ఉంది. తమ మధ్య ఉన్న బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని అతడిని హత్య చేయాలని ఇద్దరు భావించారు. 2025 జనవరి నుంచే భర్త పేరిట ఎల్.ఐ.సీ,తో పాటు పలు బీమా సంస్థలలో ప్రీమియంలు చెల్లిస్తూ వస్తుంది. కుమార్ రోడ్డు ప్రమాదంలో చనిపోతే సుమారు రూ.2 కోట్ల వరకు వస్తుందని వారి అంచనా. కుమార్ గుడిపేటకు చెందిన రామ్ మల్లేశ్ వద్ద రూ.60వేలు అప్పుగా తీసుకొని చెల్లించకపోవడంతో ఇంటికి వెళ్లి గొడవ చేసేవాడు. ఈ క్రమంలో మల్లేష్ కుమార్ భార్య భారతితో పరిచయం ఏర్పడింది.


Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం

తన భర్తను హత్య చేస్తే రూ. 10లక్షల సుపారీ ఇస్తానని గత నెలలో రూ.2లక్షలు మల్లేష్ కు భారతి, సురేందర్ చెల్లించారు. తాను ఒక్కడే ఈ హత్య చేయలేనని మంచిర్యాలలోని ఎల్.ఐ.సీ కాలనీకి చెందిన శ్రీరామ్ తో జతకూడాడు. పథకం ప్రకారం ఈ నెల 22న ముల్కల్ల గ్రామ శివారులో రామ్ మల్లేశ్, శ్రీరామ్ లు, కుమార్ కు అతిగా మద్యం తాగించి ఇనుప సుత్తితో తలపై బలంగా కొట్టి గాయపరిచారు. అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు కుమార్ తో పాటు అతడి మోటార్ సైకిల్ ను రోడ్డు పక్కన పడేసి పరారయ్యారు.
Also Read: Rains Alert: మరో 24 గంటలపాటు వర్షాలు.. ఎండల నుంచి ఉపశమనం- 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్


Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం

అయితే తన కుమారుడి మృతిపై రామ్ మల్లేష్ పై అనుమానం ఉన్నట్లు కుమార్ తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. భారతి వ్యవహారశైలి.. సురేందర్ కు ఆమెకు ఉన్న వివాహేతర సంబంధం పోలీసుల అనుమానాలను బలపరచాయి. మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ పర్యవేక్షణలో మంచిర్యాల గ్రామీణ సీఐ రవీందర్ లు క్షేత్రస్థాయిలో కేసు దర్యాప్తు చేసి రోడ్డు ప్రమాదాన్ని హత్యగా ఛేదించారు. నిందితుల నుంచి ప్రీమియంకు సంబంధించిన పత్రాలతో పాటు రూ.25వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులైన భారతి, సురేందర్, శ్రీరామ్ లను అరెస్టు చేసి రిమాండుకు తరలించామని డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు. అయితే ఈ కేసులో ఉన్న రామ్ మల్లేశ్ పరారీలో ఉన్నాడని,  త్వరలోనే అతడిని పట్టుకుంటామన్నారు.

Frequently Asked Questions

భర్త హత్య వెనుక అసలు కారణం ఏమిటి?

భర్త భార్యకు వివాహేతర సంబంధం ఉంది. ఈ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని, భర్త చనిపోతే వచ్చే బీమా డబ్బు కోసం హత్య చేయించారు.

భార్య భర్త కోసం ఎంత బీమా సొమ్ము తీసుకుంది?

భార్య తన భర్త పేరున బీమా కంపెనీలలో ప్రీమియంలు చెల్లిస్తూ వచ్చింది. భర్త ప్రమాదంలో చనిపోతే సుమారు రూ.2 కోట్ల వరకు బీమా సొమ్ము వస్తుందని వారి అంచనా.

ఈ హత్య కేసులో ఎంతమంది నిందితులు ఉన్నారు?

ఈ హత్య కేసులో భార్య భారతి, ఆమె వివాహేతర సంబంధం ఉన్న సురేందర్, శ్రీరామ్ లను అరెస్టు చేశారు. రామ్ మల్లేశ్ పరారీలో ఉన్నాడు.

హత్యను ఎలా జరిగింది?

పథకం ప్రకారం, నిందితులు కుమార్ కు అతిగా మద్యం తాగించి, ఇనుప సుత్తితో తలపై బలంగా కొట్టి చంపారు. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu Naidu Singapore Visit: ఏపీలో పెట్టుబడులకు పెట్టుబడులకు మోదీ ఎకో సిస్టం భరోసా - సింగపూర్ ఇన్వెస్టర్లకు చంద్రబాబు పిలుపు
ఏపీలో పెట్టుబడులకు పెట్టుబడులకు మోదీ ఎకో సిస్టం భరోసా - సింగపూర్ ఇన్వెస్టర్లకు చంద్రబాబు పిలుపు
Razor OTT : ఓటీటీలోకి రవిబాబు డార్క్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి రవిబాబు డార్క్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Abhijeet Dipke Attacked in Jaipur: కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్‌పై జైపూర్‌లో ఎటాక్ - భయపెట్టాలనే చేశారా?
కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్‌పై జైపూర్‌లో ఎటాక్ - భయపెట్టాలనే చేశారా?
Kavitha Singareni Visit: సింగరేణిలో కవిత బొగ్గుబాయి యాత్ర.. రూ. 50 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
సింగరేణిలో కవిత బొగ్గుబాయి యాత్ర.. రూ. 50 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
Advertisement

వీడియోలు

Arshdeep Angry Gill For Gurbaz Wicket | రివ్యూతీసుకోకపోవడంతో గుర్బాజ్ సెంచరీ
Gurnoor Brar Debut vs Afghanistan | ఇంటర్నేషనల్ క్రికెట్‌లో గుర్నూర్ సంచలన డెబ్యూ
IND vs AFG 1st ODI Highlights | అఫ్గాన్‌పై టీమిండియా ఘన విజయం
Shubman Gill Slip Catch vs Afghanistan | రోహిత్ రనౌట్‌పై గిల్ షాకింగ్ కామెంట్స్
Rohit Sharma Breaks 37-Year-Old Record | 39 ఏళ్ల వయసులో హిట్ మ్యాన్ అరుదైన రికార్డు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Singapore Visit: ఏపీలో పెట్టుబడులకు పెట్టుబడులకు మోదీ ఎకో సిస్టం భరోసా - సింగపూర్ ఇన్వెస్టర్లకు చంద్రబాబు పిలుపు
ఏపీలో పెట్టుబడులకు పెట్టుబడులకు మోదీ ఎకో సిస్టం భరోసా - సింగపూర్ ఇన్వెస్టర్లకు చంద్రబాబు పిలుపు
Razor OTT : ఓటీటీలోకి రవిబాబు డార్క్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి రవిబాబు డార్క్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Abhijeet Dipke Attacked in Jaipur: కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్‌పై జైపూర్‌లో ఎటాక్ - భయపెట్టాలనే చేశారా?
కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్‌పై జైపూర్‌లో ఎటాక్ - భయపెట్టాలనే చేశారా?
Kavitha Singareni Visit: సింగరేణిలో కవిత బొగ్గుబాయి యాత్ర.. రూ. 50 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
సింగరేణిలో కవిత బొగ్గుబాయి యాత్ర.. రూ. 50 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
British Kashmiris Protest outside UK parliament: ఆక్రమిత కశ్మీర్‌లో పాక్ బలగాల దారుణాలు - యూకే పార్లమెంట్ ఎదుట కశ్మీరీల నిరసన
ఆక్రమిత కశ్మీర్‌లో పాక్ బలగాల దారుణాలు - యూకే పార్లమెంట్ ఎదుట కశ్మీరీల నిరసన
Robbery In Circar Express: బాపట్ల వద్ద సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. పారిపోతున్న దొంగలపై రైల్వే పోలీసుల కాల్పులు
బాపట్ల వద్ద సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. దొంగలపై రైల్వే పోలీసుల కాల్పులు
Chandrababu Naidu Importance In NDA: ఎన్డీఏకు తృణమూల్ చీలిక వర్గం మద్దతు - చంద్రబాబు కింగ్ మేకర్ పోస్టు పోయిందా?
ఎన్డీఏకు తృణమూల్ చీలిక వర్గం మద్దతు - చంద్రబాబు కింగ్ మేకర్ పోస్టు పోయిందా?
Delimitation Bill 2026: ప్రధాని ఆర్థిక సలహా మండలి చేసిన డీలిమిటేషన్ సిఫార్సులతో కలకలం - దక్షిణాది రాష్ట్రాలు ఆమోదిస్తాయా?
ప్రధాని ఆర్థిక సలహా మండలి చేసిన డీలిమిటేషన్ సిఫార్సులతో కలకలం - దక్షిణాది రాష్ట్రాలు ఆమోదిస్తాయా?
Embed widget