Balakrishna : టాలీవుడ్ సమస్యలపై జగన్‌ను కలవను - తేల్చేసిన బాలకృష్ణ !
సినీ రంగ సమస్యలపై తాను సీఎం జగన్‌ను కలవబోనని బాలకృష్ణ స్పష్టం చేశారు. తక్కువ సినిమా టిక్కెట్ రేట్లతోనే అఖండ ఘన విజయం సాధించిందన్నారు.
సినీ పరిశ్రమల సమస్యలపై ఏపీ సీఎం జగన్‌తో ( AP CM Jagan ) తాను సమావేశం కానని నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna ) స్పష్టం చేశారు. చిరంజీవి ( Chiranjeevi ) బృందం సీఎం జగన్‌ను కలవడానికి వెళ్లినప్పుడు తనను కూడా పిలిచారని కాను తాను రానని చెప్పానన్నారు. బాలకృష్ణ చైర్మన్‌గా ఉన్న బసవతారకం ఆస్పత్రిలో చైల్డ్ హుడ్ క్యాన్సర్ డే సందర్భంగా ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బందితో అన్ని విషయాలపై మాట్లాడారు. కొంత మంది సినిమా ఇండస్ట్రీ సమస్యలపై సీఎం జగన్ వద్ద జరిగిన సమావేశం గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ టిక్కెట్ రేట్ల ( Ticket Rates Issue ) విషయంలో తన అభిప్రాయం చెప్పారు.
పవన్ 'భీమ్లా నాయక్' వెనక్కి - ఈ నాలుగు సినిమాలూ ముందుకు
తాను సినిమా బడ్జెట్‌ను పెంచబోనని బాలకృష్ణ తెలిపారు. టిక్కెట్ రేట్లు తక్కువగా ఉన్నపుడు కూడా అఖండ ( Akhanda) సినిమా సక్సెస్ అయింది.. అదే ఒక ఉదాహరణ అని బాలకృష్ణ అన్నారు. ఏపీ ప్రభుత్వ ఆహ్వానం మేరకు చిరంజీవి సినీ ప్రముఖులను పలువుర్ని ఆహ్వానించారు. నాగార్జున , జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు వెళ్తారన్న ప్రచారం జరిగింది. కానీ చివరి క్షణంలో వారు ఆగిపోయారు. ఇప్పుడు బాలకృష్ణ తనను కూడా పిలిచినట్లుగాచెప్పారు. కానీ మోహన్ బాబుకు ( Mohan Babu ) మాత్రం ప్రభుత్వం ఆహ్వానం పంపినా అందలేదని మంచు విష్ణు చెబుతున్నారు.
డీజీపీ సవాంగ్ బదిలీకి నారా లోకేష్ కారణమా?
నందమూరి బాలకృష్ణ ఇటీవల ప లు సందర్బాల్లో అవసరం అయితే సీఎం జగన్‌ను కలుస్తానని ప్రకటించారు. అయితే అది సినిమా రంగ అంశాలపై కాదు. హిందూపురం జిల్లా ( Hindupuram ) కోసం. హిందూపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయమని బాలకృష్ణ డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం పుట్టపర్తి ( Puttaparty ) కేంద్రంగా ఏర్పాటు చేసింది. ఈ అంశంపై అవసరం అయితే తాను సీఎం జగన్‌ను కలుస్తానని ప్రకటించారు. సినిమా రంగ సమస్యల విషయంలో మాత్రం ఆయన జగన్‌ను కలిసేందుకు ఆసక్తిగా లేరు. ప్రస్తుతం టాలీవుడ్‌కు ఏపీలో మాత్రమే సమస్యలు ఉన్నాయి. అవన్నీ అక్కడ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సృష్టించినవని టాలీవుడ్‌లో ఎక్కువ మంది భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
మెగాస్టార్ టీం కంటే మంచు విష్ణుకే ఎక్కువ పవర్ ! జగన్‌తో భేటీలో ఇదే హైలెట్...