Manchu Meet Jagan : మెగాస్టార్ టీం కంటే మంచు విష్ణుకే ఎక్కువ పవర్ ! జగన్‌తో భేటీలో ఇదే హైలెట్...

సీఎం జగన్‌తో మంచు విష్ణు భేటీ అయ్యారు. ఆయనకు మెగాస్టార్ టీం కంటే ఎక్కువ ప్రయారిటీ సీఎం క్యాంప్ ఆఫీసులో లభించడం హాట్ టాపిక్ అవుతోంది.

FOLLOW US: 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని "మా" అధ్యక్షుడు మంచు విష్ణు ( Manchu Vishnu ) కలిశారు. ఆయన ఏ కారణంతో కలిశారో స్పష్టత లేదు. జగన్ (CM Jagan Family ) కుటుంబానికి మంచు విష్ణు బంధువు. అయితే ఇప్పుడు మంచు విష్ణు సతీ సమేతంగా రాలేదు. ఒక్కరే వచ్చారు. అందు వల్ల ఆయన టాలీవుడ్ ( Tollywood ) అంశాలపై చర్చించడానికి వచ్చారని భావిస్తున్నారు. టాలీవుడ్‌ సమస్యలపై ఇటీవల చిరంజీవి నేతృత్వంలోని బృందం జగన్ నివాసానికి వచ్చి చర్చలు జరిపింది. ఆ భేటీకి మోహన్ బాబుకు ( Mohan Babu ) ఆహ్వానం అందలేదు . అలాగే "మా" అధ్యక్షుడైన మంచు విష్ణుకూ ఆహ్వానం అందలేదు. ఆ తర్వాత రోజు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని  హైదరాబాద్‌లోని మోహన్ బాబు ఇంట్లో సమావేశం కావడంతో ఆ భేటీకి వివరణ ఇచ్చారన్న ప్రచారం జరిగింది. 

తర్వాత పేర్ని నాని ( Perni Nani ) ఆ వ్యాఖ్యలను ఖండించారు. అది కాఫీ మీటింగ్ అన్నారు. మొదట టాలీవుడ్ సమస్యలపై చర్చలు జరిపామని ట్వీట్ చేసిన విష్ణు ఆ తర్వాత ట్వీట్ డిలీట్ చేశారు. మూడు రోజుల వ్యవధిలోనే విష్ణు ఈ సారి నేరుగా సీఎం జగన్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. "మా" అధ్యక్షుడిగా ( MAA President) టాలీవుడ్ సమస్యలపై తన అభిప్రాయం చెప్పడానికి సీఎం జగన్ సమయం ఇచ్చారని భావిస్తున్నారు.  అయితే సినీ ప్రముఖులు వచ్చినప్పుడు వారితో వ్యవహరించిన విధానం.. ఇప్పుడు మంచు విష్ణుకు లభించిన గౌరవం హాట్ టాపిక్ అవుతోంది. చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్ లాంటి సూపర్ స్టార్లు వచ్చినప్పటికీ వారి వాహనాలను ఇంటి గేటు  బయట నిలిపివేసి సెక్యూరిటీ చెకింగ్ గెట్ వే ద్వారా అందర్నీ లోపలికి పంపారు. అయితే మంచు విష్ణుకు మాత్రం నేరుగా లోపలికి యాక్సెస్ అయ్యారు. 

ఆయన కారులో నేరుగా సీఎం జగన్ ఇంటి వరకూ వెళ్లిపోయారు. ఈ రెండు దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీఎం జగన్ కావాలని  టాలీవుడ్ స్టార్లను పిలిచి అవమానించారని జరుగుతున్న ప్రచారానికి  మంచు విష్ణుకు లభించిన ప్రాధాన్యతతో మరింత బలం చేకూరినట్లయింది. అయితే మంచు విష్ణు కుటుంబసభ్యుడని .. కుటుంబసభ్యులకు జగన్ ఇంటి వరకూ పర్మిషన్ ఉంటుందని కొంత మంది గుర్తు చేస్తున్నారు. కారణం ఏదైనప్పటికీ... టాలీవుడ్ ప్రముఖులతో సీఎం చర్చలు.. ఆ తదనంతర పరిణామాలు  హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి. 

Published at : 15 Feb 2022 01:28 PM (IST) Tags: Tollywood jagan Manchu Vishnu Vishnu meets AP CM Jagan

సంబంధిత కథనాలు

Tirumala News : తిరుమలకు పోటెత్తిన  భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!

Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

TDP Mahanadu 2022 : టీడీపీ మహానాడుకు భారీ స్పందన, అటు చంద్రబాబు ఇటు బాలయ్య ప్రసంగాలతో దద్దరిల్లిన స్టేజ్

TDP Mahanadu 2022 :  టీడీపీ మహానాడుకు భారీ స్పందన, అటు చంద్రబాబు ఇటు బాలయ్య ప్రసంగాలతో దద్దరిల్లిన స్టేజ్

Mahanadu 2022 : జిల్లా విభజనను పునః సమీక్షిస్తా, బుల్లెట్లా దూసుకెళ్తా- మహానాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Mahanadu 2022 :  జిల్లా విభజనను పునః సమీక్షిస్తా, బుల్లెట్లా దూసుకెళ్తా- మహానాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Mahanadu Chandrababu : నేను వస్తా.. దోచినదంతా కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !

Mahanadu Chandrababu :  నేను వస్తా.. దోచినదంతా  కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !

టాప్ స్టోరీస్

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

3 Years of YSR Congress Party Rule : జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !

3 Years of YSR Congress Party Rule :   జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !

TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి

TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి