Bheemla Nayak Postponed: పవన్ 'భీమ్లా నాయక్' వెనక్కి - ఈ నాలుగు సినిమాలూ ముందుకు
ఫిబ్రవరి 25న 'భీమ్లా నాయక్' విడుదల కావడం లేదని టాలీవుడ్ టాక్. అందుకే, నాలుగు సినిమాలు ముందుకు వస్తున్నాయి.
ఫిబ్రవరి 25న థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఏవి? వెనక్కి వెళ్లిన సినిమా ఏది? అనే విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా 'భీమ్లా నాయక్' ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రావడం లేదు (Pawan Kalyan, Bheemla Nayak Postponed). అలాగని, చిత్రబృందం అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. మరి, విడుదల వాయిదా పడిందని ఎలా చెబుతారు? అంటే... 'గని' మూవీ యూనిట్ ఫిబ్రవరి 25 (Ghani On Feb 25)న తమ సినిమాను విడుదల చేస్తున్నట్టు ఈ రోజు ప్రకటించింది కాబట్టి!
'భీమ్లా నాయక్' బృందం రెండు విడుదల తేదీలు ప్రకటించింది. అందులో ఫిబ్రవరి 25 ఒకటి అయితే... ఏప్రిల్ 1 మరొకటి! 'భీమ్లా నాయక్' తర్వాత 'గని' యూనిట్ కూడా రెండు విడుదల తేదీలు ప్రకటించింది. అందులో ఫిబ్రవరి 25 ఒకటి అయితే... మార్చి 4 మరొకటి. ఒకవేళ 25న బాబాయ్ సినిమా వస్తే... వారం వెనక్కి వెళ్లాలని అబ్బాయ్ వరుణ్ తేజ్ అండ్ టీమ్ అనుకుంది. పవన్ కళ్యాణ్ అండ్ 'భీమ్లా నాయక్' టీమ్‌తో మాట్లాడిన తర్వాత 'గని' యూనిట్ ఫిబ్రవరి 25న వస్తున్నట్టు అనౌన్స్ చేసినట్టు సమాచారం. ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్లకు 'భీమ్లా నాయక్' రావడం లేదనే సమాచారం వెళ్ళడంతో 'గని'తో పాటు 'ఆడవాళ్ళు మీకు జోహార్లు', 'సెబాస్టియన్ పీసీ 524' యూనిట్స్ ప్రచారం మీద దృష్టి పెట్టాయి.
శర్వానంద్, రష్మిక (Rashmika Mandanna) జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'. ఫిబ్రవరి 25 (Aadavallu Meeku Joharlu On Feb 25th) విడుదల అని డేట్ వేసినా... 'భీమ్లా నాయక్' వస్తే వెనక్కి వెళ్ళాలనే ఆలోచనలో దర్శక - నిర్మాతలు, హీరో ఉన్నారు. ఎప్పుడైతే పవన్ సినిమా రావడం లేదనేది తెలిసిందో? అప్పటి నుంచి ప్రచారం ముమ్మరం చేశారు. సోమవారం సినిమాలో సాంగ్ 'ఓ మై ఆద్య...' సాంగ్ రిలీజ్ చేయడమే కాదు... షూటింగ్ కంప్లీట్ అయినట్టు తెలిపారు. మంగళవారం ప్రధాన తారాగణం అందరితో మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు.
Also Read: 'ఎల్లమ్మా' - పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్'లో కొత్త పాట! పాడింది ఎవరో తెలుసా?
'భీమ్లా నాయక్' రావడం లేదని తెలియడంతో యువ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కూడా పబ్లిసిటీ స్టార్ట్ చేశారు. ఆయన హీరోగా నటించిన 'సెబాస్టియన్' సినిమా ఫిబ్రవరి 25న (Sebastian PC 524 On Feb 25th) విడుదల కానుంది. ఆ సినిమా విడుదల తేదీ ప్రకటించినప్పుడు... 'పవన్ కల్యాణ్ సినిమాకు పోటీగా వస్తున్నారా?' అని ప్రశ్నిస్తే, 'ఒకవేళ పవన్ సినిమా వస్తే నా సినిమా వాయిదా వేసి, ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళతాను' అని చెప్పారు కిరణ్ అబ్బవరం. 'భీమ్లా నాయక్' వెనక్కి వెళ్లడంతో మరో మూడు సినిమాలు బాక్సాఫీస్ బరిలో ఉన్నప్పటికీ... రావడానికి రెడీ అవుతున్నారు.
Also Read: 'భీమ్లా నాయక్' రిలీజ్ ఎప్పుడు? జగన్ గారిని అడగాలంటున్న నిర్మాత నాగవంశీ
ప్రస్తుతానికి ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రావడానికి మూడు తెలుగు సినిమాలు రెడీగా ఉన్నాయి. ఒకటి 'గని', రెండు 'ఆడవాళ్ళు మీకు జోహార్లు', మూడు 'సెబాస్టియన్ పీసీ 524'. వీటితో పాటు వస్తున్న మరో సినిమా 'గంగూబాయి కతియావాడి'. ఇందులో ఆలియా భట్ (Alia Bhatt) ప్రధాన పాత్రలో నటించడంతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా సినిమాపై ఆసక్తి ఏర్పడింది. 'ఆర్ఆర్ఆర్'లో ఆలియా నటించడం, ఎన్టీఆర్ - కొరటాల శివ సినిమాలో కథానాయికగా ఆమె ఎంపిక అయ్యే అవకాశాలు ఎక్కువ ఉండటంతో 'గంగూబాయి...' (Gangubai Kathiawadi Telugu Release)పై ప్రేక్షకులు ఓ కన్నేశారు. ఈ సినిమాను తెలుగులో కూడా డబ్బింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ తెలుగు ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ నాలుగు కాకుండా మరో రెండు మూడు చిన్న సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' వస్తే తెలుగు సినిమాలన్నీ వాయిదా పడేవి. అదీ సంగతి!
అజిత్ 'వలిమై' కూడా ఫిబ్రవరి 24న వస్తోంది. అందులో తెలుగు హీరో కార్తికేయ విలన్ రోల్ చేశారు. తెలుగులో అజిత్ సినిమాలకు మార్కెట్ తక్కువ. 'గ్యాంబ్లర్' తర్వాత ఆ స్థాయిలో విజయాలు సాధించిన సినిమాలు లేవని చెప్పాలి. అయినా 'వలిమై' మీద కాస్త అంచనాలు ఉన్నాయి.
Also Read: మహేష్ బాబు రికార్డ్ బ్రేక్ చేసిన తమిళ స్టార్ విజయ్