Mahesh Vs Vijay: మహేష్ బాబు రికార్డ్ బ్రేక్ చేసిన తమిళ స్టార్ విజయ్
సూపర్ స్టార్ మహేష్ బాబు క్రియేట్ చేసిన ఒక రికార్డును తమిళ స్టార్ హీరో విజయ్ బ్రేక్ చేశాడు. అదేంటి? ఏమైంది? అంటే...
సాంగ్ హిట్ అయ్యిందా? లేదా? అనేది చెప్పడానికి యూట్యూబ్‌లో వస్తున్న వ్యూస్, లైక్స్ చూసి మరీ చెబుతున్నారు. పాట విడుదలైన 24 గంటల్లో ఎన్ని వ్యూస్ వచ్చాయి? ఎన్ని లైక్స్ వచ్చాయి? అనే రికార్డులు మెయిన్ అయ్యాయి. ఈ సాంగ్ వ్యూస్ విషయంలో మహేష్ సాంగ్ రికార్డును విజయ్ సాంగ్ బ్రేక్ చేసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'సర్కారు వారి పాట'. ఇందులో 'కళావతి...' సాంగ్ ఫిబ్రవరి 13న విడుదలైంది. దీనికి 24 గంటల్లో 16 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 806కె లైక్స్ వచ్చాయి. సౌత్ ఇండియాలో 24 గంటల్లో ఎక్కువ మంది వీక్షించిన పాటగా రికార్డ్ క్రియేట్ చేసింది. కట్ చేస్తే... ఈ పాట విడుదలైన తర్వాతి రోజు విజయ్ సాంగ్ రిలీజ్ అయ్యింది.
తమిళ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా 'బీస్ట్'. ఇందులో 'అరబిక్ కుతు...' సాంగ్ ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న విడుదలైంది. ఈ పాటకు 24 గంటల్లో 18 మిలియన్ వ్యూస్, 2 మిలియన్ లైక్స్ వచ్చాయి. మహేష్ సాంగ్ రికార్డు క్రియేట్ చేసిన తర్వాతి రోజే దాన్ని బ్రేక్ చేసింది.
Also Read: 'అరబిక్ కుతు' సాంగ్ రాసిన హీరో, ఆ రెమ్యునరేషన్ తో ఏం చేశాడంటే?
విజయ్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ కావడం... అనిరుధ్ సంగీతం అందించడం... మరో హీరో శివ కార్తికేయన్ తమిళ లిరిక్స్ రాయడం... 'అరబిక్ కుతు' పాటకు ప్లస్ అయ్యాయి. తెలుగులో సినిమా విడుదల కానుండటంతో ఆ పాటను తెలుగు వాళ్ళు కూడా చాలా మంది చూశారు. 'కళావతి...' పాటకు తమన్ సంగీతం అందించగా... సిద్ శ్రీరామ్ పాడారు. పూర్తిగా తెలుగు క్లాసిక్ టచ్ తో సినిమా సాగింది.
Also Read: మంజులతో 'కార్తీక దీపం' నిరుపమ్ లిప్ లాక్! టీవీ షోలో ఇద్దరూ
View this post on Instagram