అన్వేషించండి

Atlee On AA22xA6: హాలీవుడ్ టెక్నీషియన్లకు సవాల్... అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే అట్లీ మాటలు

Allu Arjun Atlee Movie Updates: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. దీని గురించి నేషనల్ మీడియాతో అట్లీ చెప్పిన మాటలు ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చేలా ఉన్నాయ్.

పాన్ ఇండియా బ్లాక్ బస్టర్, నటుడిగా తనకు నేషనల్ అవార్డు తీసుకు వచ్చిన 'పుష్ప' ఫ్రాంచైజీ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎటువంటి రోల్ చేస్తాడు? అని ఆడియన్స్ అందరూ వెయిట్ చేశారు. అనూహ్యంగా తమిళ దర్శకుడు అట్లీతో సినిమా స్టార్ట్ చేశారు అల్లు అర్జున్. ఏకంగా లాస్ ఏంజిల్స్ వెళ్లి అక్కడ వీఎఫ్ఎక్స్ కంపెనీలతో, వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టులతో మాట్లాడారు. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ సినిమా ప్లాన్ చేసినట్టు అందరికీ అర్థమైంది. ఇప్పుడీ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. ఎలా ఉండబోతుంది? అనే అభిమానుల ఆలోచనలకు దర్శకుడు అట్లీ మాటలు ఫుల్ కిక్ ఇచ్చే విధంగా ఉన్నాయి. 

హాలీవుడ్ టెక్నీషియన్లకు సవాల్!
'పుష్ప' తర్వాత అల్లు అర్జున్ ట్రాన్స్ఫర్మేషన్, సినిమా గురించి నేషనల్ మీడియా ముందు దర్శకుడు అట్లీ కుమార్ మాట్లాడుతూ... ''కొన్ని రోజులు వెయిట్ చేయండి. మీకు మేం ఓ కొత్త ప్రపంచం చూపించడానికి వర్క్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మీరు చూడనిది మాత్రం చూపిస్తానని భరోసా ఇవ్వగలను. చాలా మంది హాలీవుడ్ టెక్నీషియన్లతో మేం వర్క్ చేస్తున్నాం. వాళ్ళు సైతం తమకు ఈ సినిమా ఛాలెంజింగ్‌గా ఉందని చెబుతున్నారు. అంటే మేం ఓ భారీ సినిమా చేస్తున్నామని అర్థం'' అని అన్నారు.

Also Read: చిరంజీవితో అటువంటి హాలీవుడ్ సినిమా చేయాలని... మేనల్లుడు సాయి దుర్గా తేజ్ కోరిక

సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఇండియన్ ఆడియన్స్ అందరికీ ఈ మూవీ స్కేల్ గురించి అర్థం అయ్యింది. సైన్స్ ఫిక్షన్ జానర్‌లో హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఓ కొత్త ప్రపంచం క్రియేట్ చేస్తున్నారని తెలిసింది. మరి సినిమా ఎలా ఉంటుందో?

అల్లు అర్జున్, అట్లీ సినిమాలో దీపికా పదుకోన్ నటిస్తున్న విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు. అయితే ఇతర హీరోయిన్స్ వివరాలను ఇంకా చెప్పలేదు. ఈ మూవీలో రష్మిక విలన్ టైపు రోల్ చేస్తున్నారని టాక్. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీనికి సాయి అభ్యంకర్ మ్యూజిక్ చేస్తున్నారు.

Also Readకాంట్రవర్షియల్ క్వశ్చన్‌పై ఫీమేల్ జర్నలిస్ట్‌కు కిరణ్ అబ్బవరం క్లాస్‌... తప్పు, మంచిది కాదు!

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget