Sai Durgha Tej: చిరంజీవితో అటువంటి హాలీవుడ్ సినిమా చేయాలని... మేనల్లుడు సాయి దుర్గా తేజ్ కోరిక
Sai Durgha Tej On Chiranjeevi: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో 'బ్రో'లో నటించారు సుప్రీమ్ స్టార్ సాయి దుర్గా తేజ్. మరి పెద్ద మావయ్య మెగాస్టార్ చిరంజీవితో నటిస్తే అవకాశం వస్తే... ఏం చెప్పారో తెలుసా?

మేనమామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో కలిసి 'బ్రో' సినిమా చేశారు సుప్రీం స్టార్ సాయి దుర్గా తేజ్ (Sai Durgha Tej). తన జీవితంలో ఎప్పటికీ అదొక అద్భుతమైన జ్ఞాపకం అని ఎప్పుడూ చెబుతుంటారు. మరి పెద్ద మామయ్య, మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఎప్పుడు నటిస్తారు? ఒకవేళ చిరుతో కలిసి నటించే అవకాశం వస్తే ఎటువంటి సినిమా చేయాలని అనుకుంటారు? వంటి ప్రశ్నలకు శనివారం హైదరాబాద్ సిటీలో జరిగిన ఆటో ఎక్స్పో 2025లో సాయి దుర్గా తేజ్ సమాధానం ఇచ్చారు.
చిరుతో అటువంటి హాలీవుడ్ సినిమా!
'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' ఫ్రాంచైజీ సినిమాలు చాలా మంది తెలుగు ప్రేక్షకులు చూసే ఉంటారు. అటువంటి కథతో చిరంజీవి గారితో తనకు సినిమా చేయాలని ఉందని సాయి దుర్గా తేజ్ చెప్పారు. తాను హీరోగా నటించిన సినిమాలలో 'రిపబ్లిక్' అంటే చాలా ఇష్టం అని అందులో క్లైమాక్స్ తనకు బాగా నచ్చిందని, అటువంటి కథలు మళ్ళీ వస్తే తప్పకుండా నటిస్తానని తెలిపారు.
Also Read: కాంట్రవర్షియల్ క్వశ్చన్‌పై ఫీమేల్ జర్నలిస్ట్‌కు కిరణ్ అబ్బవరం క్లాస్... తప్పు, మంచిది కాదు!
చిన్న మామయ్య పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ... ''నాకు పవన్ కళ్యాణ్ గారు గురువు లాంటి వారు. ప్రతి విషయంలో నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఇప్పటికీ ప్రోత్సహిస్తూ ఉన్నారు. యాక్టింగ్ నుంచి జిమ్నాస్టిక్స్, డాన్స్, కిక్ బాక్సింగ్ వరకు - ఇలా ప్రతి విషయంలోనూ నన్ను గైడ్ చేశారు. ప్రతి ఒక్కరికి కాలేజీలో ఒక ఫేవరెట్ టీచర్ ఉంటారు కదా. నా జీవితంలో అటువంటి టీచర్ పవన్ కళ్యాణ్ గారు. నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు'' అని తెలిపారు.
ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి!
బైక్ డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా దయచేసి హెల్మెట్ ధరించమని సాయి దుర్గా తేజ్ రిక్వెస్ట్ చేశారు. ఆయన జీవితంలో ఒక మేజర్ రోడ్ యాక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదం నుంచి బయట పడడానికి ముఖ్య కారణం హెల్మెట్ ధరించడం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా హెల్మెట్ ధరించాలని సాయి దుర్గా తేజ్ ప్రతి సందర్భంలో చెబుతున్నారు. తన గ్యారేజీలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, మహేంద్ర థార్ కార్ అంటే తనకు చాలా ఇష్టమని ఆయన తెలిపారు. తనకు 1968 మోడల్ షెల్ఫీ జీటీ మష్టంగ్ మోడల్ కారు అంటే మరింత ఇష్టం అన్నారు. తనకు అది డ్రీమ్ కారు అని కచ్చితంగా ఎప్పటికైనా కొంటానని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం సాయి దుర్గా తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే... 'సంబరాల యేటిగట్టు' రూపొందుతోంది. ఆ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. 'సంబరాల యేటిగట్టు'ను పాన్ ఇండియా రిలీజ్ చేయనున్నారు. ఆ చిత్రాన్ని 'హనుమాన్' నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు.
Also Read: విక్రమ్ కొడుకు ధృవ్ తెలుగు డెబ్యూ... 'బైసన్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్!





















