Bison Trailer Release Date: విక్రమ్ కొడుకు ధృవ్ తెలుగు డెబ్యూ... 'బైసన్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్!
Dhruv Vikram's Bison Telugu Update: 'చియాన్' విక్రమ్ తనయుడు ధృవ్ తెలుగు చిత్రసీమకు వస్తున్న సినిమా 'బైసన్'. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.

'చియాన్' విక్రమ్ (Chiyaan Vikram) తెలుగు ప్రేక్షకులకు సైతం తెలుసు. ఆయన తనయుడు ధృవ్ విక్రమ్ (Dhruv Vikram) తమిళ్ సినీ ఇండస్ట్రీకి బాగా తెలుసు. ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు. 'బైసన్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు.
అక్టోబర్ 13న 'బైసన్' ట్రైలర్ విడుదల!
Bison Telugu Trailer Release Date: ధృవ్ విక్రమ్ కథానాయకుడిగా నటించిన సినిమా 'బైసన్'. నీలం స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలపై ప్రముఖ దర్శకుడు పా రంజిత్ సమర్పణలో రూపొందుతోంది. ధనుష్ 'కర్ణన్', ఫహాద్ ఫాజిల్ - వడివేలు నటించిన 'మామన్నన్' ఫేమ్ మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు.
Also Read: సమరం కాదు... భ్రమరంగా వెన్నెల కిశోర్ - నవంబర్‌లో నవ్వుల ప్రాప్తిరస్తు
Bison Moie Telugu Release Date: అక్టోబర్ 24న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాలలో జగదంబే ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ బాలాజీ 'బైసన్' చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 13న... అంటే వచ్చే సోమవారం ట్రైలర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.
View this post on Instagram
జగదాంబే ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ బాలాజీ మాట్లాడుతూ... "ధృవ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ధృవ్ విక్రమ్ నటన తెలుగు ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ బేస్డ్ చిత్రమిది. నాకు తెలుగులో విడుదల చేసే అవకాశం ఇచ్చిన నీలం స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలకు థాంక్స్'' అని అన్నారు.
Also Read: లక్స్ పాపను పంపించేశారు... ఇమ్మూ చేతుల్లోనే పవర్ అంతా... పవర్ అస్త్రా రీతూ చౌదరి కోసమా?
Bison Movie Cast And Crew: ధృవ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'బైసన్' సినిమాలో పశుపతి, కలైయరసన్, రెజిషా విజయన్, హరికృష్ణన్, అళగమ్ పెరుమాళ్, అరువి మదన్ తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి దర్శకత్వం: మారి సెల్వరాజ్, నిర్మాతలు: సమీర్ నాయర్ - దీపక్ సెగల్ - పా రంజిత్ - అదితి ఆనంద్, తెలుగు విడుదల: జగదాంబే ఫిలిమ్స్ (నిర్మాత బాలాజీ), సంగీత దర్శకత్వం: నివాస్ కే ప్రసన్న, ఛాయాగ్రహణం: ఏజిల్ అరసు కే, కూర్పు: శక్తి తిరు, కళా దర్శకత్వం: కుమార్ గంగప్పన్.





















