Kiran Abbavaram - Pradeep Ranganathan: కాంట్రవర్షియల్ క్వశ్చన్‌పై ఫీమేల్ జర్నలిస్ట్‌కు కిరణ్ అబ్బవరం క్లాస్... తప్పు, మంచిది కాదు!
Controversial Question Pradeep Ranganathan: 'మీరు హీరో మెటీరియల్ కాదు' అని ప్రదీప్ రంగనాథన్‌ను 'డ్యూడ్' ప్రెస్‌మీట్‌లో జర్నలిస్ట్ అడిగిన వివాదంపై 'కే ర్యాంప్' ప్రెస్‌మీట్‌లో కిరణ్ అబ్బవరం స్పందించారు.

ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) తమిళియన్. అయితే ఆయన హీరోగా నటించిన 'లవ్ టుడే', 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' సినిమాలు తెలుగులోనూ సక్సెస్ సాధించాయి. భారీ వసూళ్లు అందుకున్నాయి. ప్రదీప్ రంగనాథన్ హీరోగా టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటైనటువంటి మైత్రీ మూవీ మేకర్స్ 'డ్యూడ్' ప్రొడ్యూస్ చేసింది. ఆ మూవీ ప్రెస్‌మీట్‌లో 'మీరు హీరో మెటీరియల్ కాదు' అని ఒక ఫిమేల్ జర్నలిస్ట్ ప్రశ్నించారు. ప్రదీప్ పక్కన ఉన్న శరత్ కుమార్ ఆవిడ మాటలను ఖండించారు. అందరూ హీరో మెటీరియలే అని చెప్పారు. ఇప్పుడు ఆ ఇష్యూ మీద కిరణ్ అబ్బవరం స్పందించారు.
కించపరిచే ప్రశ్నలు వద్దు - కిరణ్ అబ్బవరం
'హీరో మెటీరియల్ కాదు' అని ప్రదీప్ రంగనాథన్‌ను ప్రశ్నించిన ఫిమేల్ జర్నలిస్ట్, తాజాగా జరిగిన 'కే ర్యాంప్' ప్రెస్‌మీట్‌లో కిరణ్ అబ్బవరం దగ్గర ఇంచు మించు అటువంటి ప్రశ్న అడిగే ప్రయత్నం చేశారు. తనకు ఎవరినీ డీగ్రేడ్ చేసే ఉద్దేశం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. హీరోగా కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చారనేది తన ఉద్దేశం అన్నట్టు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు సదరు మహిళా విలేకరి.
Also Read: సమరం కాదు... భ్రమరంగా వెన్నెల కిశోర్ - నవంబర్‌లో నవ్వుల ప్రాప్తిరస్తు
''నన్ను అడగండి అమ్మా... పర్వాలేదు. కానీ ఒక్క స్టేట్ నుంచి హీరో వచ్చినప్పుడు అటువంటి కించపరిచే ప్రశ్నలు అడగొద్దు. మంచిది కాదు. తప్పుగా అనుకోవద్దు. మీరు నన్ను ఒక మాట అన్నా పడతాను. మనం మనం ఒకటి. పక్క స్టేట్ నుంచి ఒక హీరో వచ్చినప్పుడు మీ లుక్స్ ఇలా ఉన్నాయి ఏంటి? అని కించపరచడం నాకే బాధగా అనిపించింది'' అని కిరణ్ అబ్బవరం సూటిగా, స్పష్టంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
Also Read: లక్స్ పాపను పంపించేశారు... ఇమ్మూ చేతుల్లోనే పవర్ అంతా... పవర్ అస్త్రా రీతూ చౌదరి కోసమా?
It's not right to ask degrading questions when an actor from another state visits here, says #KiranAbbavaram.
— Movies4u Official (@Movies4u_Officl) October 11, 2025
The lady journalist began arguing with him, claiming that her question was misunderstood and not inappropriate. pic.twitter.com/ofjOMyBeaq
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన 'కే ర్యాంప్' అక్టోబర్ 18న థియేటర్లలో విడుదల కానుంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన 'డ్యూడ్' అక్టోబర్ 17న రిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రదీప్ రంగనాథన్ సినిమాలకు లభించిన థియేటర్లు తమిళనాడులో తన సినిమాలకు లభించలేదని కిరణ్ అబ్బవరం చెప్పారు. ఆ అంశం సైతం చర్చకు దారి తీసింది. ఆయన చెప్పిన మాటలు నిజమేనని ఆఫ్ ది రికార్డు డిస్ట్రిబ్యూషన్ వర్గాలు చెబుతున్నాయి.





















