Ashwini Dutt: అమితాబ్ బచ్చన్ చేసిన పనికి ఆశ్చర్యపోయా - నిర్మాత అశ్వినీ దత్ ఎమోషనల్ పోస్ట్
Ashwini Dutt on Amitabh: కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అమితాబ్ నిర్మాత అశ్వినీ దత్ పాదాలకు నమస్కరించిన దృశ్యం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. తాజాగా దీనిపై అశ్వినీ దత్ స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు.
Producer Ashwini Dutt Emotional Post on Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ చేసిన పనికి తాను ఆశ్చర్యపోయానన్నారు నిర్మాత అశ్వినీ దత్. 'కల్కి 2898 AD' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమం అనంతరం బాలీవుడ్ బిగ్‌బి అభితాబ్ బచ్చన్ నిర్మాత అశ్వినీ దత్ (Kalki Producer) కాళ్లు మొక్కిన సంగతి తెలిసిందే. అంతేకాదు అశ్విని దత్ కూడా బిగ్‌బి కాళ్లకు నమస్కరించారు. ఈ సంఘటన అక్కడున్న వారినే కాదు ఈవెంట్‌ని లైవ్‌లో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ కార్యక్రమంలో ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించారు.
అనంతరం ఒకరికా కాళ్లకు ఒకరు నమస్కరించారు. నిజానికి ఇలాంటి సంఘటన ఎలాంటి ఏ ఈవెంట్‌లోనూ చూసి ఉండరు. అయితే తాజాగా అమితాబ్ తన కాళ్లను తాకడంపై నిర్మాత అశ్వినీ దత్ స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. నిన్న జరిగిన కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ తనకు ఎన్నో మధురానుభూతులను ఇచ్చిందన్నారు. "కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్నడు ఊహించనిది జరిగింది. ఈవెంట్‌లో అమితాబ్ చేసిన పనికి ఆశ్చర్యపోయా. ఆయన నా కాళ్లను తాకగానే అయోమయానికి గురయ్యా. ఆ వెంటనే నేను ఆయన కాళ్లను తాకే ప్రయత్నం చేశాను. ఇందంతా యాదృశ్చికంగా జరిగిపోయింది. ఆయన ఎంతో ప్రేమతో ఆప్యాయంగా నాకు ఇచ్చిన ఈ గౌరవం వెలకట్టలేనిది.
Falling short of words @SrBachchan sir 🙏 pic.twitter.com/UpzkTcvRIg
— Chalasani Aswini Dutt (@AshwiniDuttCh) June 20, 2024
ఆయన అందించిన ఈ గౌరవాన్ని నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. జీవితంలో కొన్ని క్షణాలు ఎంతో అపురూపమైనవి. అలాంటి మధుర జ్ఞాపకాలను ఈ ఈవెంట్ నాకు అందించించింది. ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో ఆయన వ్యక్తిత్వం, గుర్తింపు హిమలయాల కంటే పెద్దవి. ఎంతో మనస్పూర్తిగా అమితాబ్ జీ నాకు ఇచ్చిన ఈ గౌరవానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్న. అమితాబ్ జి.. ఇండియన్ సినిమా యోధుడు, ఓ లెజెండ్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం ఉన్న ఆయనకు నా సెల్యూట్" అంటూ ఆయన పోస్ట్ చేశారు.
కాగా జూన్ 19న కల్కి ప్రీరిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ముంబైలో జరిగిన ఈ వేడుకకు ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె మూవీ నిర్మాత అశ్వినీ దత్ ఆయన కూతుళ్లు పాల్గొన్నారు. ఇక ఈవెంట్ అనంతరం నిర్మాత అశ్వినీ దత్ స్టేజ్‌పై మాట్లాడుతూ.. ఇలాంటి వినయపూర్వకమైన వ్యక్తిని తన కెరీర్‌లో ఎన్నడూ చూడలేదని బిగ్‌బిని కొనియాడారు. ఆ తర్వాత అమితాబ్ మాట్లాడుతూ.. భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కిస్తూ నిర్మాతగా యాభై ఏళ్లుగా రాణిస్తున్నారంటూ అశ్వినీ దత్ గురించి బాలీవుడ్ మీడియాకు గొప్పగా చెప్పారు. ఆయన మాట్లాడుతూనే అశ్వినీ దత్ పాదాలను తాకారు.
Also Read: నా భర్త నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటే నేను దురదృష్టవంతురాలిని ఎలా అవుతాను - రేణు దేశాయ్