Anushka Shetty: సోషల్ మీడియాకు కాస్త బ్రేక్ - స్వీటీ అనుష్క పోస్ట్ వైరల్
Anushka: కొద్ది రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని స్వీటీ అనుష్క నిర్ణయించారు. ఈ మేరకు తన ఇన్ స్టా వేదికగా ఓ స్పెషల్ నోటి రాశారు. త్వరలోనే మరిన్ని మంచి కథలతో వస్తానన్నారు.

Anushka Decided To Take Small Break From Social Media: స్వీటీ అనుష్క కీలక నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలం పాటు సోషల్ మీడియాకు బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఇన్ స్టాలో తాజాగా ఓ నోట్ రాయగా వైరల్ అవుతోంది. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఆమె 'ఘాటి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.
స్వీటీ ఏం చెప్పారంటే?
కొవ్వొత్తి వెలుగులో నీలి రంగు కాంతి కాస్త దూరంగా కనిపించినట్లు సోషల్ మీడియా నుంచి కొంచెం దూరంగా ఉండబోతున్నట్లు చెప్పారు అనుష్క. 'ఎప్పుడూ స్క్రోలింగ్ చేసే లైఫ్‌కు దూరంగా... రియల్ లైఫ్‌కు దగ్గరగా ఉండాలని నిర్ణయించుకున్నా. త్వరలోనే మరిన్ని మంచి కథలతో మరింత ప్రేమతో మీ ముందుకొస్తా. ఎప్పటికీ అందరూ చిరునవ్వుతోనే ఉండండి. ప్రేమతో మీ అనుష్క శెట్టి.' అంటూ నోట్ రాసుకొచ్చారు.
View this post on Instagram
అనుష్క కొన్నేళ్లుగా మీడియాకు సైతం దూరంగా ఉన్నారు. మూవీ ప్రమోషన్స్‌లోనూ ఆమె అంతగా పాల్గొనలేదు. రీసెంట్‌గా వచ్చిన 'ఘాటి' మూవీలోనూ స్వీటీ పరోక్షంగానే పాల్గొన్నారు. మూవీ రిలీజ్‌కు ముందు అల్లు అర్జున్, రానాలతో ఫోన్లలో 'ఘాటి' మూవీ విశేషాలతో పాటు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి వరుసగా మూవీస్ చేస్తానంటూ రానాతో చెప్పారు. త్వరలోనే మంచి స్క్రిప్ట్స్‌తో అందరి ముందుకు వస్తానని అన్నారు. ఎన్నో అంచనాల మధ్య ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఘాటి' అనుకున్నంత సక్సెస్ కాలేదు. అయితే, అనుష్క నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తాజాగా సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని స్వీటీ నిర్ణయించుకున్నారు.





















