RAPO22 Title Glimpse: రామ్ ఎవరి అభిమాని? ఆయన ఆంధ్ర కింగ్ ఎవరు? Ram Pothineni బర్త్‌డేకి టైటిల్‌తో పాటు గ్లింప్స్ రిలీజ్
Andhra King Thaluka Title Glimpse: మే 15న రామ్ పోతినేని పుట్టినరోజు. ఆరోజు ఆయన కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు. ఆంధ్ర కింగ్ ఎవరనేది ఆ రోజే తెలుస్తుంది. మీకు సినిమా టైటిల్ తెలుసుగా?

Ram Pothineni Birthday Special: ఉస్తాద్ రామ్ పోతినేని బర్త్ డే సెలబ్రేషన్స్ కొంత ఎర్లీగా మొదలు అయ్యాయి. ఈ నెల (మే) 15న ఆయన పుట్టినరోజు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన కొత్త సినిమా టైటిల్ అధికారికంగా అనౌన్స్ చేయడంతో పాటు గ్లింప్స్ కూడా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. సో... ఆంధ్ర కింగ్ ఎవరనేది తెలియడానికి ఇంకెన్నో రోజుల సమయం లేదు.
ఆంధ్ర కింగ్ ఎవరు?
ఎవరికి రామ్ అభిమాని?
RAPO22 Latest Update: రామ్ పోతినేని కథానాయకుడిగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ఓ సినిమా రూపొందుతోంది. హీరోగా రామ్ 22వ చిత్రమిది. అందుకని ఈ సినిమాను RAPO22 అని వ్యవహరిస్తున్నారు. అయితే... ఈ చిత్రానికి 'ఆంధ్ర కింగ్ తాలూకా' (Andhra King Thaluka) టైటిల్ ఖరారు చేసినట్లు ఫిలింనగర్ విశ్వసనీయ వర్గాల ద్వారా విషయం బయటకు వచ్చింది. ఆ టైటిల్ ఈనెల 15న రివీల్ చేయనున్నారు. టైటిల్ ఆల్రెడీ లీక్ అయినా సరే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమిటంటే... ఆంధ్ర కింగ్ ఎవరు? అనేది.
మూవీ ఇండస్ట్రీ నేపథ్యంలో 'ఆంధ్ర కింగ్ తాలూకా' రూపొందుతోందని సమాచారం. టైటిల్ గ్లింప్స్ రిలీజ్ డేట్ పోస్టర్ చూస్తే... ''విజిల్స్ రెడీ, కటౌట్స్ పెయింటెడ్, మిల్క్ బకెట్స్ లోడెడ్. వన్ ఫ్యాన్, వన్ షో, మిలియన్ ఎమోషన్స్'' అని క్యాప్షన్ ఇచ్చారు. కొత్త సినిమా రిలీజ్ టైంలో థియేటర్ల దగ్గర అభిమానులు కటౌట్లు కడుతూ తమ ఫేవరెట్ హీరోకి పాలాభిషేకాలు చేస్తూ ఈలలు వేయడం కామన్. మరి రామ్ ఎవరి అభిమాని? ఆయన ఆంధ్రా కింగ్ ఎవరు? అనేది 15వ తేదీన తెలుస్తుంది.
View this post on Instagram
సాగర్ పాత్రలో రామ్...
మహాలక్ష్మిగా భాగ్యశ్రీ బోర్సే!
'ఆంధ్ర కింగ్ తాలూకా'లో సాగర్ పాత్రలో రామ్ పోతినేని యాక్ట్ చేస్తున్నారు. ఆయన సరసన యంగ్ అండ్ క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె క్యారెక్టర్ పేరు మహాలక్ష్మి. మూవీ ఇండస్ట్రీ నేపథ్యంలో రూపొందుతున్న సినిమా అయినప్పటికీ... 'ఆంధ్ర కింగ్ తాలూకా'లో హీరో హీరోయిన్ల మధ్య ఒక అందమైన చక్కటి ప్రేమ కథ ఉందని తెలిసింది. ఇందులో రామ్ పోతినేని ఒక పాట రాయడం విశేషం. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' విజయం తర్వాత మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ ఎర్నేని, రవిశంకర్ వై నిర్మిస్తున్నారు. వివేక్ మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.





















