Anasuya: నేను అల్లు అర్జున్ గురించి అలా అనలేదు: అనసూయ
Anchor Anasuya: అనసూయ భరద్వాజ్ తన ట్విట్టర్ వేదికగా 'పుష్ప' మూవీ గురించి తాను చేసిన వ్యాఖ్యలను ఎవరో తారుమారు చేశారంటూ పేర్కొంది.
![Anasuya: నేను అల్లు అర్జున్ గురించి అలా అనలేదు: అనసూయ Anasuya Reacts On Her Alleged Comments On Allu Arjun! Anasuya: నేను అల్లు అర్జున్ గురించి అలా అనలేదు: అనసూయ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/08/54ad1bde762815fe4f231b324baa87441699451316208753_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Anasuya Bharadwaj: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన 'పుష్ప : ది రైజ్' మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద సక్సెస్ ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఆడియన్స్ ని కూడా ఈ సినిమా ఓ ఊపు ఊపేసింది. బన్నీ ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అంతేకాదు ఈ సినిమాలో బన్నీ నటనకి ఏకంగా నేషనల్ అవార్డు సైతం వచ్చింది. ఇక సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన శ్రీవల్లి పాత్రలో అద్భుతంగా నటించింది. అలాగే కమెడియన్ సునీల్, అనసూయ భరద్వాజ్ నెగటివ్ రోల్స్ తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అనసూయ ఈ సినిమాలో దాక్షాయిని పాత్రలో గెటప్ తో పాటు యాక్టింగ్ తోను అదరగొట్టింది.
Pushpa 'పుష్ప: ది రైజ్'లో తన పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో లేడీ విలన్ గా మెప్పించింది. ఇదిలా ఉంటే 'పుష్ప: ది రైజ్' కి ఇస్ సీక్వెల్ గా 'పుష్ప: ది రూల్' రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 'పుష్ప: ది రూల్' శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ‘పుష్ప’ సీక్వెల్‌కు సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది. అలాగే ‘పుష్ప’లో నటించిన యాక్టర్స్ కొన్ని ఇంటర్వ్యూల్లో సీక్వెల్ పై అప్డేట్స్ ఇస్తూ అంచనాలను రెట్టింపు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే 'పుష్ప' లో నటించిన అనసూయ భరద్వాజ్ ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా 'పుష్ప 2' గురించి ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పుష్ప గురించి, అల్లు అర్జున్ గురించి అనసూయ షాకింగ్ కామెంట్స్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
Not true.. I never said it like this.. this is a manipulated statement. https://t.co/NUkZlXbeTi
— Anasuya Bharadwaj (@anusuyakhasba) November 7, 2023
"అల్లు అర్జున్ 'పుష్ప-1' ఫీడ్ బ్యాక్ మొత్తం తీసుకున్నారు. ప్రతి విషయానికి ఆయన స్పందించకపోవచ్చు. కానీ సామాజిక మాధ్యమాల్లో వచ్చే కామెంట్స్ ని చూస్తారు. ముఖ్యంగా డాన్స్ మూమెంట్స్ పై వచ్చిన కామెంట్స్ ను పరిగణలోకి తీసుకొని 'పుష్ప 2'లో వాటిపై మరింత దృష్టి పెట్టనున్నారు. కేవలం డాన్స్ మాత్రమే కాదు తొలి భాగంలో లోపాలను కూడా గుర్తించి అలాంటివి రెండో భాగంలో రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నా పాత్ర విషయంలోనూ ఆయనకు ఫిర్యాదు వచ్చింది. ముఖ్యంగా నాతోపాటు ఫహాద్ పజిల్, సునీల్, బ్రహ్మాజీ పాత్రల మధ్య ఎక్కువ సన్నివేశాలుంటాయి. పుష్ప: ది రైజ్' కి మించి పుష్ప: ది రూల్' ఉంటుంది" అని అనసూయ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడినట్లు న్యూస్ వైరల్ అయింది.
దీంతో ఈ న్యూస్ పై అనసూయ తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. "అందులో ఎలాంటి నిజం లేదు. నేను అసలు అలా చెప్పలేదు. నా వ్యాఖ్యలను ఎవరో తారుమారు చేశారు" అంటూ రాస్కొచ్చింది. దీంతో అనసూయ చేసిన ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక 'పుష్ప 2' విషయానికొస్తే.. ఇటీవల వరుణ్ తేజ్ పెళ్లికి హాజరై తిరిగి హైదరాబాద్ వచ్చిన అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప 2' షూటింగ్లో పాల్గొనేందుకు రెడీ అయ్యారు. అందుకు సంబంధించి ఇప్పటికే మూవీ టీం ఏర్పాట్లను పూర్తి చేసింది. తాజా షెడ్యూల్ లో ఓ పాటతో పాటు ఫైట్ కొంత టాకీ పార్ట్ ను పూర్తి చేయనున్నట్లు సమాచారం.
Also Read : 'దమ్ మసాలా' ఒరిజినల్ సాంగ్ కాదా? హిందీ పాటను తమన్ ఎత్తేశాడా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)