Adipurush: ‘ఆదిపురుష్’ ఎఫెక్ట్ - సెన్సార్ బోర్డ్ పై మండిపడిన హైకోర్ట్!
‘ఆదిపురుష్’ సినిమాను బ్యాన్ చేయాలంటూ కోర్టులో చాలా పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ పిటిషన్లపై అలహాబాద్ హైకోర్ట్ విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డ్ పై మండిపడింది కోర్ట్.
Adipurush: ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆదిపురుష్’ సినిమా జూన్ 16 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచే ఈ సినిమా ప్రజాదరణ పొందడంలో విఫలం అయింది. రామాయణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా రామాయణానికి విరుద్దంగా ఉందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. సినిమాను బ్యాన్ చేయాలంటూ కొన్ని చోట్ల నిరసనలు కూడా చేశారు. ముఖ్యంగా మూవీలో డైలాగ్స్ పై ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. అలాగే సోషల్ మీడియాలో నెటిజన్స్ సినిమా గ్రాఫిక్స్ వర్క్స్ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేశారు. సినిమాను బ్యాన్ చేయాలంటూ కొంతమంది కోర్టులో ఫిటిషన్ లను దాఖలు చేశారు కూడా. అయితే ఆ పిటిషన్ లపై అలహాబాద్ హైకోర్ట్ విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం ‘ఆదిపురుష్’ మేకర్స్, సెన్సార్ బోర్డ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
సెన్సార్ తీరుపై మండిపడిన హైకోర్ట్..
‘ఆదిపురుష్’ సినిమాలో ఉన్న డైలాగ్ లు అసలైన రామయాణంలో పాత్రలను అవమాన పరిచేవిధంగా ఉన్నాయని, ఈ సినిమాను నిషేధించాలని హైకోర్ట్ లు పిటిషన్ లు వేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అలహాబాద్ హైకోర్టు ఈ పిటిషన్లపై విచారణ జరిపింది. ఈ సందర్భంగా సినిమా దర్శకనిర్మాతలు, సెన్సాన్ బోర్డ్ పై మండిపడింది. సినిమాలోని సంభాషణల విషయంలో సెన్సార్ బోర్డ్ తీరును తప్పుబట్టింది ధర్మాసనం. ఈ సంభాషణలు ఎలా సమర్థించారని, ఇలాంటి వాటితో భవిష్యత్ తరాలకు ఏం చెబుదామనుకుంటున్నారు అని ప్రశ్నించింది. విచారణకు దర్శకనిర్మాతలు హాజరు కాకపోవడం పట్ల మండిపడింది ధర్మాసనం.
అయితే మూవీలోని అభ్యంతరకరమైన సంభాషణలు తొలగించామని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. దీనిపై కోర్ట్ స్పందస్తూ.. డైలాగ్స్ ఒక్కటే కాదని, సన్నివేశాలు కూడా ఏం చేస్తారనేదానిపై సూచనలు తీసుకోవాలని చెప్పింది. తర్వాత తాము చేయాలనుకున్నది తప్పకుండా చేస్తామని, అలా కాకుండా మూవీ స్క్రీనింగ్ నిలిచిపోతే ప్రేక్షకుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఉపశమనం లభిస్తుందని వ్యాఖ్యానించింది కోర్ట్. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
‘ఆదిపురుష్’పై ఆది నుంచీ విమర్శలు..
‘ఆదిపురుష్’ సినిమా విడుదల అయిన దగ్గర నుంచీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. గ్రాఫిక్స్ పరంగా సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ ప్రభావం మూవీ పై అంతగా పడకపోయినా మూవీలోని పాత్రల వేషధారణ, సంభాషణల పట్ల పూర్తి వ్యతిరేకత వచ్చింది. డైరెక్టర్ ఓం రౌత్ ఆధునిక రామాయణాన్ని తనకు ఇష్టం వచ్చిన రీతిలో తెరకెక్కించడం, హనుమంతుడి పాత్ర చేత మాస్ డైలాగ్ లు చెప్పించడం, లంకేష్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ ని చూపించిన తీరుపై అనేక విమర్శలు వచ్చాయి. కొన్ని హిందూ సంఘాలు ఈ మూవీను బ్యాన్ చేయాలంటూ నిరసనలు చేశారు. కొంతమంది కోర్టులో పిటిషన్లు వేశారు. ఆల్ ఇండియన్ ఫిల్మ్ వర్కర్స్ అసోసియేషన్ వారు మూవీను బ్యాన్ చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకు సైతం లేఖ రాశారు. ఇలా ఈ మూవీపై అన్ని వైపుల నుంచీ విమర్శలు వెల్లువెత్తాయి. మరి ఇప్పుడు ఈ కోర్టు కేసుల్లో ఎలాంటి తీర్పులిస్తారు అనేది చూడాలి.
Also Read: ‘వ్యూహం’ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్ పాత్రల లుక్స్ రివీల్ చేసిన రామ్ గోపాల్ వర్మ!