Aha: ప్లే స్టోర్‌లోకి తిరిగొచ్చిన ‘ఆహా’ - ఒక్కరోజులో సమస్యకు పరిష్కారం
Aha App: పాలసీలను ఉల్లంఘించిన కారణంగా తెలుగు ఎక్స్‌క్లూజిక్ ఓటీటీ యాప్ అయిన ఆహాను ప్లే స్టోర్ నుండి తొలగించింది గూగుల్. దీంతో అలర్ట్ అయిన టీమ్ సమస్యను వెంటనే పరిష్కరించారు.
Aha App Is Back In Play Store: పాలసీలను ఉల్లంఘించాయి అనే కారణంతో కొన్ని ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ఇతర యాప్స్‌ను కూడా ప్లే స్టోర్ నుండి తొలగించింది గూగుల్. అందులో ‘ఆహా’ కూడా ఒకటి. తెలుగు ప్రేక్షకుల కోసం ఎక్స్‌క్లూజివ్‌గా సినిమాలను, షోలను అందిస్తూ వారిని అలరించేది ఆహా. కానీ ఆహాపై గూగుల్ ప్లే స్టోర్ వేటు పడడం అందరినీ షాక్‌కు గురిచేసింది. దీనిపై అల్లు అరవింద్ స్పందించకపోయినా.. తమ యాప్స్‌ను ప్లే స్టోర్ నుండి కోల్పోయిన ఇతర యాప్ ఓనర్లు మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ప్లే స్టోర్.. వెంటనే కొన్ని యాప్స్‌ను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చింది.
విశ్రాంతి లేకుండా కష్టపడ్డారు..
ప్లే స్టోర్ తాజాగా తొలగించిన యాప్స్‌లో షాదీ. కామ్, ఇన్ఫో ఎడ్జ్‌కు సంబంధించిన నౌక్రీ, 99 ఎకర్స్, నౌక్రీ గల్ఫ్ లాంటివి కూడా ఉన్నాయి. అయితే వీటిని తిరిగి యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది గూగుల్. తమ యాప్ ప్లే స్టోర్‌లోకి తిరిగొచ్చిన విషయాన్ని ఇన్ఫో ఎడ్జ్ కో ఫౌండర్ అయిన సంజీవ్ బిక్చంద్నానీ ట్విటర్ ద్వారా బయటపెట్టారు. ‘ఇన్ఫో ఎడ్జ్‌కు సంబంధించిన ఎన్నో యాప్స్.. మళ్లీ ప్లే స్టోర్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. దీనికోసం ఇన్ఫో ఎడ్జ్ టీమ్ ఎంతో కష్టపడింది. రాత్రంతా విశ్రాంతి లేకుండా పనిచేసింది. కష్టంలో చురుగ్గా స్పందించింది’ అంటూ తన టీమ్‌ను ప్రశంసల్లో ముంచేశారు సంజీవ్. వీటితో పాటు ఆహా కూడా తిరిగి ప్లే స్టోర్‌లోకి అందుబాటులోకి వచ్చినట్టు తెలుస్తోంది.
పాలసీలను మార్చి..
తాజాగా గూగుల్.. తమ పాలసీలను మార్చింది. ఆ పాలసీలను అనుగుణంగా పనిచేయని ఇండియన్ యాప్స్‌ను ప్లే స్టోర్ నుండి తొలగించాలని గూగుల్ నిర్ణయించుకుంది. అలా గూగుల్ వేసిన వేటులో ఆహాతో పాటు అల్టా బాలాజీ, భారత్ మ్యాట్రిమోనీ, నౌక్రీ, 99 ఎకర్స్, కూకూ ఎఫ్ఎమ్, స్టేజ్ ఓటీటీ, క్వాక్ క్వాక్ వంటి యాప్స్ ప్లే స్టోర్ నుండి తొలగిపోయాయి. దీనిపై ఆయా యాప్స్ ఓనర్లు ఫైర్ అయ్యారు. కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇలా యాప్స్‌ను తొలగించడం కరెక్ట్ కాదని వాదించారు. అయితే పాలసీలకు తగినట్టుగా యాప్స్‌ను మారిస్తే.. మళ్లీ ప్లే స్టోర్‌లో స్థానం దక్కుతుందని గూగుల్ ప్రకటించింది. దీంతో యాప్స్ అన్నీ అలర్ట్ అయ్యాయి.
అలర్ట్ అయిన ఆహా..
తెలుగు ప్రేక్షకుల్లో ఆహా యాప్ అనేది చాలా ఫేమస్ కావడంతో గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ షాక్‌కు గురిచేసింది. ప్రస్తుతం కేవలం తెలుగు సినిమాలను, షోలను మాత్రమే అందిస్తూ అలరిస్తున్న ఓటీటీ ఆహా మాత్రమే కావడం విశేషం. అందుకే ఎంటర్‌టైన్మెంట్ లవర్స్ అంతా ప్లే స్టోర్‌లో ఆహా కనిపించడం లేదని గుర్తించేలోపే టీమ్ అంతా అలర్ట్ అయ్యి పాలసీలకు తగినట్టుగా దీనిని మార్చి మళ్లీ ప్లే స్టోర్‌లో ప్రత్యక్షమయ్యేలా చేసింది. దీంతో మూవీ లవర్స్ సంతోషిస్తున్నారు. ఆహా యాప్ ప్రారంభించిన కొన్నిరోజుల్లోనే అప్పటికీ నెంబర్ 1 స్థానం కోసం పోటీపడుతున్న అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ లాంటి ప్లాట్‌ఫార్మ్స్‌కు గట్టి పోటీ ఇచ్చింది.
Also Read: సినిమా కేక పుట్టిస్తుంది, అందులో డౌట్ లేదు - ‘భీమా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గోపీచంద్