అన్వేషించండి

Actress Prema: సౌందర్య భౌతిక కాయాన్నితల లేకుండా చూసి చలించిపోయాను: నటి ప్రేమ

సౌందర్య వృత్తి విషయంలో ఎంతో నిబద్దతగా ఉంటుందని చెప్పింది ప్రేమ. షూటింగ్ సమయంలో పని పట్ల అంకిత భావంతో ఉండేదని, ప్రతి చిన్న పనిని శ్రద్దగా చేసేదని ప్రేమ తెలిపింది.

సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఏటా ఎంతో మంది నటీనటులు వస్తుంటారు. అయితే అందులో కొంత మంది మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేస్తారు. అలాంటి వారితో దివంగత నటి సౌందర్య ఒకరు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన అందం, అభినయంతో కొట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది సౌందర్య. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో పదుల సంఖ్యలో సినిమాల్లో నటించింది. దాదాపు పదేళ్లు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అంతేకాదు పలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించింది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే అనుకోని ప్రమాదంలో మరణించింది సౌందర్య. ఇటీవల సౌందర్య స్నేహితురాలు, నటి ప్రేమ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్బంగా సౌందర్యతో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది ప్రేమ. 

సౌందర్య వృత్తి విషయంలో ఎంతో నిబద్దతగా ఉంటుందని చెప్పింది ప్రేమ. షూటింగ్ సమయంలో పని పట్ల అంకిత భావంతో ఉండేదని, ప్రతి చిన్న పనిని శ్రద్దగా చేసేదని చెప్పింది. మామూలుగా సౌందర్య చాలా తక్కువగా మాట్లాడుతుందని, కానీ తనతో బాగా కలసిపోయిందని చెప్పింది. ఇద్దరూ మంచి స్నేహితులము అయ్యామని, తాను హైదరాబాద్ లో పంచవటి గెస్ట్ హౌస్ లో ఉండేదని, తాను కూడా సౌందర్య ఇంటికి వెళ్లి కాసేపు మాట్లాడుకుని వచ్చేవాళ్లమని చెప్పింది. షూటింగ్ సమయంలో కూడా తాను అందరితో మంచిగా మాట్లాడుతూ ఉండేదని, శ్రీరామ నవమి వస్తే సెట్ లో అందరికీ పానకం తాగించేదని గుర్తు చేసుకుంది. హెల్త్ విషయంలో కూడా సౌందర్య చాలా కేరింగ్ గా ఉంటుందని చెప్పింది. భోజనం కూడా చాలా మితంగా తినేదని, తనను చూసే తాను పప్పు, నెయ్యి కలిపి తినడం అలవాటు చేసుకున్నానని చెప్పింది. సౌందర్య నటన కూడా చాలా హోమ్లీగా ఉండేదని, కళ్లతోనే వేయి భావాలను పలికించగల నటి సౌందర్య అని చెప్పింది. 

2004లో ఓ రాజకీయ పార్టీ ఎన్నికల ప్రచారం కోసం సౌందర్య హెలికాప్టర్ లో ఆంధ్రప్రదేశ్ బయలు దేరింది. మార్గ మధ్యలో హెలికాప్టర్ లో సాంకేతిక లోపాలు తలెత్తి అది కుప్పకూలిపోవడంతో సౌందర్య దుర్మరణం చెందింది. ఈ ప్రమాదంలో ఆమె సోదరుడు, నిర్మాత అమర్ నాధ్ కూడా మరణించాడు. సౌందర్య మరణ వార్త విని తాను తట్టుకోలేకపోయానని చెప్పింది ప్రేమ. ఆరోజు సౌందర్య ఇంటికి వెళ్లానని, అపుడు సౌందర్య పార్థివ దేహాన్ని ఒక బాక్స్ లో పెట్టారని అందులో మొండెం ఒకటే ఉంది. తల లేదని చెప్పింది. అది చూసి తాను చలించిపోయానని చెప్పింది. అందంతా చూసి ఆర్టిస్ట్ ల జీవితం ఇంతేనా అని బాధకలిగిందని చెప్పింది. తనకు ఇప్పటికీ సౌందర్య ఫేస్ అలానే గుర్తిండి పోయిందని, సౌందర్య అంత అందమైన అమ్మాయి అని అంది. ఆ రోజు జరిగిందంతా చెప్తుంటే సౌందర్యతో తనకున్న జ్ఞానపకాలు అన్నీ గుర్తొస్తున్నాయని కన్నీటిపర్యంతమైంది. ప్రస్తుం నటి ప్రేమ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read Also: నన్ను నమ్ముకుని ఓ అమ్మాయి ఎదురుచూస్తోంది, కాదంటే బతికుండి వేస్ట్ - మౌనికతో పెళ్లిపై మంచు మనోజ్ ఎమోషనల్ కామెంట్స్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Beggars: ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Gukesh:  గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
Royal Enfield Bikes: త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
Embed widget