Namitha New Look : అప్పుడు అలా... ఇప్పుడు ఇలా - స్లిమ్ అండ్ స్టైలిష్ లుక్‌లో టాలీవుడ్ హీరోయిన్
Namitha Slim Look : టాలీవుడ్ హీరోయిన్ నమిత గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. తాజాగా ఆమె ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియోను చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

Namitha New Look In Gym Gone Viral : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు తన అందం, నటనతో ఫుల్ ఫేమ్ సంపాదించుకున్న హీరోయిన్ నమిత. ముఖ్యంగా బాలయ్య సినిమాలో తన నటన, డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి పిల్లలు, ఫ్యామిలీ లైఫ్‌తో బిజీగా ఉన్నారు. అప్పట్లో బొద్దుగా ఉన్న నమిత... ప్రస్తుతం స్లిమ్‌గా మారారు.
గుర్తు పట్టలేనంతగా...
అప్పట్లో లావుగా బొద్దుగా ఉన్న హీరోయిన్ నమిత ప్రస్తుతం గుర్తు పట్టలేనంత సన్నగా మారిపోయారు. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ స్లిమ్‌గా ఉన్న వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. 'మీ మనస్సు దేన్ని నమ్ముతుందో... మీ శరీరం దాన్ని అనుసరిస్తుంది' అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు స్టైలిష్, సూపర్ లుక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా ఆమె నమితనేనా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
View this post on Instagram
హీరోయిన్ నమిత అప్పట్లో కన్నడ, తమిళం, హిందీ, తెలుగు భాషల్లో మూవీస్ చేశారు. సొంతం మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈమె... ఒక రాజు ఒక రాణి, ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి, బిల్లా, నాయకుడు, సింహా, మన్యంపులి సినిమాల్లో నటించి పాపులారిటీ సంపాదించుకున్నారు. బాలయ్య సింహా మూవీలో ఆమె లాస్ట్‌గా నటించారు. పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. కొన్నేళ్లుగా ఫ్యామిలీ లైఫ్‌లో బిజీగా ఉన్న నమిత... ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇస్తారో లేదో తెలియాల్సి ఉంది.
Also Read : Gedela Raju OTT : రెండు ఓటీటీల్లో రఘు కుంచె కొత్త మూవీ - పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Before You Go
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
ట్రెండింగ్ వార్తలు























