By: ABP Desam | Updated at : 21 Sep 2023 05:34 PM (IST)
Photo Credit : Trisha/Instagram
చెన్నై బ్యూటీ త్రిష పెళ్లికి సంబంధించి ఓ వార్త గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఓ నిర్మాత తో త్రిష పెళ్లి జరగబోతుందని ఆ వార్త సారాంశం. అయితే తాజాగా న్యూస్ పై ట్విట్టర్ వేదికగా త్రిష పరోక్షంగా రెస్పాండ్ అవుతూ ఇలాంటి వార్తలను సృష్టిస్తున్న వారికి ఓ రకంగా వార్నింగ్ ఇచ్చారు. సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సుమారు 21 ఏళ్ళు అవుతున్నా త్రిష మాత్రం ఇప్పటికీ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. నేటికీ తరగని అందంతో మెరిసిపోతున్న ఈ చెన్నై సోయగం ఇటీవల 'పొన్నియన్ సెల్వన్' సినిమాలో కుందమై అనే పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
40 ఏళ్లు దాటాక కూడా హీరోయిన్గా ఇంకా సత్తా చాటుతూనే ఉంది. ప్రస్తుతం తమిళ, మలయాళ భాషలతో కలుపుకొని త్రిష చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. వాటిల్లో కోలీవుడ్ మోస్ట్ అవైటెడ్ లోకేష్ కనకరాజు తలపతి విజయ్ 'లియో' సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఓ పక్క తన సినీ కెరియర్ పీక్ స్టేజ్ లో ఉండగానే పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్చల్ చేస్తున్నాయి. గతంలో ఓ వ్యాపారవేత్తతో త్రిష ఎంగేజ్మెంట్ జరిగి ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయింది. మళ్లీ ఇన్నాళ్లకు త్రిష పెళ్లి వార్తలు కోలీవుడ్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే త్రిష ఓ మలయాళ నిర్మాతను పెళ్లి చేసుకోబోతుందనే ప్రచారం ఊపందుకుంది.
గతంలో ఆ నిర్మాత చేసిన ఓ సినిమాలో త్రిష నటించిందని, ఆ సమయంలోనే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, త్వరలోనే అతనితో త్రిష ఏడడుగులు వేయబోతుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అంతేకాదు వీళ్ళ పెళ్లి ఈ ఏడాదే జరగబోతుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజాగా త్రిష ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు తన ట్విట్టర్ వేదికగా త్రిష స్పందిస్తూ.. "డియర్, మీరు.. మీ బృందం ఎవరో మీకు తెలుసు.. ప్రశాంతంగా ఉండండి అలాగే పుకార్లు ఆపండి" అని చెబుతూనే చివరికి 'చీర్స్' అని ట్విట్ చేసింది. ఈ ట్వీట్ చూసిన ఆమె ఫ్యాన్స్ ఒక రకంగా త్రిష ఇలాంటి పుకార్లు సృష్టించిన వారికి వార్నింగ్ ఇచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
DEAR “YOU KNOW WHO YOU ARE AND YOUR TEAM”,
“KEEP CALM AND STOP RUMOURING”
CHEERS!— Trish (@trishtrashers) September 21, 2023
ఎందుకంటే త్రిష చెప్పిన దాని ప్రకారం ఎవరు అలాంటి పుకార్లు సృష్టిస్తున్నారో తనకు తెలుసని, అందుకే వాళ్లకు తగిలేలా వార్నింగ్ ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం త్రిష చేసిన ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక త్రిష హీరోయిన్ గా నటిస్తున్న సినిమాల్లో 'లియో' దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దళపతి విజయ్ తో చాలా సంవత్సరాల తర్వాత త్రిష నటిస్తుండడంతో వీరిద్దరి జోడిని వెండితెరపై చూసేందుకు ఫ్యాన్స్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదల కానుంది.
Also Read : నితిన్ 'తమ్ముడు'లో బెంగళూరు బ్యూటీ - 'కాంతార' భామ కాకుండా మరో అమ్మాయి!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Gutka Advertisements: బాలీవుడ్ స్టార్స్‌కు అలహాబాద్ హైకోర్టు షాక్, గుట్కా కేసులో ముగ్గురికి నోటీసులు
Tripti Dimri - Sara Ali Khan: 'యానిమల్'లో సూపర్ ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ హీరో కూతురు? - అసలు నిజం ఏమిటంటే?
Rashmika Mandanna: అభిమానితో వీడియో కాల్ మాట్లాడిన రష్మిక - 'యానిమల్'లో నటనకు బిగ్ బి ప్రశంసలు
Vidyut Jamwal: హిమాలయాల్లో నగ్నంగా తిరుగుతున్న స్టార్ హీరో - ప్రతి ఏడాదీ 10 రోజులు ఇలా న్యూడ్‌గా
Roshan Kanakala:సుమ, రాజీవ్ కనకాల విడాకులపై కుమారుడు రోషన్ కామెంట్స్ - ఓపెన్‌గా చెప్పేసిన యంగ్ హీరో
Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం
Andhra News: ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ - 'మిగ్ జాం' తుపాను బాధితులను ఆదుకోవాలని వినతి
Telangana Power Politics : తెలంగాణలో విద్యుత్ అప్పుల రాజకీయాలు - సంక్షోభాన్ని కేసీఆర్ సర్కార్ దాచి పెట్టిందా?
ఛత్తీస్‌గఢ్ సీఎం అభ్యర్థిపై త్వరలోనే క్లారిటీ,తుది నిర్ణయం తీసుకోనున్న హైకమాండ్!
/body>