By: ABP Desam | Updated at : 02 Oct 2023 08:53 PM (IST)
Photo Credit : Payal Ghosh/Instagram
బాలీవుడ్ హీరోయిన్ పాయల్ ఘోష్ మరోసారి బాలీవుడ్ ఇండస్ట్రీ ఫై సంచలన వ్యాఖ్యలు చేసింది. 'బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చుంటే నా దుస్తులు కూడా తొలగించే వాళ్ళని, వాళ్లకు టాలెంట్ తో పనిలేదు.. దుస్తులు తీసేసి అమ్మాయిల అందాలు చూపిస్తే చాలు' అంటూ బాలీవుడ్ పై విరుచుకు పడింది. ఈ మధ్యకాలంలో పాయల్ ఘోష్ సోషల్ మీడియాలో పలు వివాదాలతో వార్తల్లో నిలుస్తుంది. గతంలో చాలా సార్లు బాలీవుడ్ ఇండస్ట్రీపై, ఫిలిం మేకర్స్ పై సంచలన ఆరోపణలు చేసి హాట్ టాపిక్ గా మారిన ఈ ముద్దుగుమ్మ హిందీ తో పాటు తెలుగు, కన్నడ భాషల్లో సినిమాలు చేసి ఎక్కడా నిలదొక్కుకోలేకపోయింది.
ముఖ్యంగా బాలీవుడ్ లో కమిట్మెంట్ పేరుతో లైంగిక దోపిడీలపై సంచలన ఆరోపణలు చేయడంతో ఏకంగా ఇండస్ట్రీకే దూరమైంది. ఆ వివాదం తర్వాత మళ్లీ పాయల్ బాలీవుడ్లో కనిపించింది లేదు. మళ్లీ చాలా రోజుల తర్వాత తాజాగా మరోసారి బాలీవుడ్ పై తనదైన శైలిలో విరుచుకు పడింది. ట్విట్టర్ వేదికగా బాలీవుడ్ ఇండస్ట్రీపై పాయల్ చేసిన ట్వీట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి." దేవుడి దయవల్ల సౌత్ సినిమాల ద్వారా పరిశ్రమంలోకి వచ్చాను. అలా కాకుండా ముందే బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి ఉంటే నా దుస్తులు కూడా తొలగించేవారు. అలా చేసి నా పేరు మీద వ్యాపారం చేసుకునేవారు. వాళ్లకి టాలెంట్ తో పనిలేదు. దుస్తులు తీసేసి అమ్మాయిల అందాలు చూపిస్తే చాలు" అని తన ట్వీట్లో పేర్కొంది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Thank god, I got launched in South Film Industry, if I would have got launched in #Bollywood they would have removed my clothes to present me, cos they use female bodies more than their creativity 😔
— Payal Ghoshॐ (@iampayalghosh) October 1, 2023
బాలీవుడ్ సినీ ప్రతిష్టని మరింత దిగజార్చేలా పాయల్ ఘోష్ తాజాగా చేసిన ఈ ట్వీట్స్ పై ఇండస్ట్రీ తరఫున ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి. నిజానికి బాలీవుడ్లో కమిట్మెంట్ వ్యవహారం ఎలా ఉంటుందో దానిపై ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ సంచలన ఆరోపణలు చేశారు. కంగనా రనౌత్ లాంటి స్టార్ హీరోయిన్ కూడా బాలీవుడ్ పై ఎప్పటికప్పుడు తనదైన శైలిలో విరుచుకుపడుతుంటుంది. ఓసారి పాయల్ ఘోష్ విషయంలో కూడా కంగనా తన మద్దతు ప్రకటించింది. గతంలోనూ పాయల్ చేసిన ఆరోపణల విషయంలో చాలామంది ఫిలిం మేకర్స్ మౌనంగానే ఉన్నారు. కొంతమంది ఖండించే ప్రయత్నం చేసినా వాటిని పాయల్ తిప్పి కొట్టింది.
టాలీవుడ్ లో మంచు మనోజ్ హీరోగా నటించిన 'ప్రయాణం' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన పాయల్ ఘోష్ ఆ తర్వాత సౌత్ లో అడపా దడపా సినిమాల్లో కనిపించి మెప్పించింది. ఎన్టీఆర్ నటించిన 'ఊసరవెల్లి' సినిమాలో తమన్నాకు ఫ్రెండ్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఆ తర్వాత మళ్లీ తెలుగులో పెద్దగా కనిపించలేదు. చివరగా 'మిస్టర్ రాస్కెల్' అనే సినిమాలో నటించింది. ఈమధ్య మాత్రం సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అవుతోంది.
గతంలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడంటూ చెప్పిన పాయల్ అతని నుంచి తనకు ప్రాణహాని ఉందని సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఆ ఆరోపణ నిజమా? అబద్దమా అనేది తెలియదు కానీ సమయం వచ్చినప్పుడల్లా బాలీవుడ్ పై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తోంది. బాలీవుడ్లో సినిమా ఒప్పుకోవాలంటే కచ్చితంగా కమిట్మెంట్ ఇవ్వాలని, తాను అలా ఇచ్చి ఉంటే ఈపాటికి బాలీవుడ్ లో 30 సినిమాలు చేసేదాన్ని అని గతంలో పాయల్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు ఎంతలా హాట్ టాపిక్ అయ్యాయో తెలిసిందే.
Also Read : 'అదుర్స్' రీ రిలీజ్ డేట్ ఫిక్స్ - మరోసారి థియేటర్స్‌లో భట్టు, చారిల సందడి, ఎప్పుడంటే?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Aishwarya Abhishek Bachchan: అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకోనున్నారా? అమితాబ్ బచ్చన్ పోస్ట్‌కు అర్థం ఏమిటీ?
Tripti Dimri: నా తల్లిదండ్రులు అలా అన్నారు - ‘యానిమల్’లోని ఇంటిమేట్ సీన్స్‌కు పేరెంట్స్ రియాక్షన్ బయటపెట్టిన తృప్తి
Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య
Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!
Devil Movie: ‘డెవిల్’ కోసం కళ్యాణ్‌రామ్‌కు 90 స్పెషల్ కాస్ట్యూమ్స్ - ఇటలీ నుంచి తెప్పిన మోహైర్ ఊల్‌తో!
Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం
MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!
మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరిన లోకేష్ పాదయాత్ర- 20న భోగాపురంలో ముగింపు సభ
Jharkhand CM: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు - ఆరోసారి సమన్లు పంపిన అధికారులు
/body>