Vikram: తమిళ స్టార్ హీరో విక్రమ్‌కు కరోనా పాజిటివ్.. ఇప్పుడు ఎలా ఉందంటే?
చియాన్ విక్రమ్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన మేనేజర్ తెలిపారు.

తమిళ స్టార్ హీరో విక్రమ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మధ్యే కమల్ హాసన్, బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ , యాక్షన్ కింగ్ అర్జున్‌లకు కూడా కరోనా సోకింది. రెండు రోజులుగా హై ఫీవర్ తో భాదపడుతున్న విక్రమ్ కోవిడ్ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే ఇది సాధారణ కరోనానేనా.. ఒమిక్రాన్ వేరియంటా అన్న సంగతి తెలియరాలేదు. దీని కోసం టెస్ట్ రిపోర్టులను జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపినట్లు సమాచారం.
విక్రమ్‌కు కరోనా సోకిన విషయాన్ని ఆయన మేనేజర్ సూర్యనారాయణ తెలిపారు. అయితే ప్రస్తుతం విక్రమ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నాయి. విక్రమ్ త్వరగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులు ట్వీట్లు వేశారు.
విక్రమ్ ప్రస్తుతం `మహాన్` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన కుమారుడు ధృవ్ విక్రమ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. కానీ ఈ సినిమా ఓటీటీలో విడుదల అవుతుందని టాక్ వినిపిస్తుంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో నిర్మించింది. మణిరత్నం రూపొందిస్తున్న పాన్ ఇండియన్ ప్రాజెక్టు `పొన్నియిన్‌సెల్వన్`లో కూడా విక్రమ్ నటిస్తున్నారు. `కోబ్రా` సినిమా కూడా పెండింగ్‌లో ఉంది.
"#ChiyaanVikram has very mild Covid, and nothing to worry"
— Kaushik LM (@LMKMovieManiac) December 16, 2021
Get well soon #Vikram sir 👍👍
Also Read: ‘బిగ్ బాస్’ విజేత ఎవరు? ఇలా ఓటేసి విన్నర్‌ను మీరే నిర్ణయించండి
Also Read: అందాల రాక్షసి మనసూ అందమైనదే... బర్త్‌డే రోజు అనాథలతో!
Also Read: మగాళ్లది వంకరబుద్ధి... సమంత పాటకు సపోర్ట్‌గా మహిళా మండలి
Also Read: తండ్రికి అనసూయ ప్రామిస్.. సోషల్ మీడియాలో హార్ట్ టచింగ్ పోస్ట్
Also Read: మరో క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మన్స్‌కు రెడీ అయిన సౌజన్యా శ్రీనివాస్... త్రివిక్రమ్ వైఫ్Also Read: ఏడాది ఆఖరి రోజున... సమరానికి సిద్ధమంటున్న అర్జునుడు!
Also Read: ఇటు సునీల్... అటు హెబ్బా... విలన్‌గా అతడు!
Also Read: 'సంచారి'... 'రాధే శ్యామ్' నుంచి మరో వీడియో సాంగ్ వచ్చేసింది!
Also Read: 'లైగర్' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రౌడీ బాయ్! ప్రభాస్ సినిమా వెనుక...
Also Read: మరో కపూర్‌కు కరోనా...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి





















