News
News
X

ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా ?

ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్‌ను గుర్తుపట్టగలరా? ఈమె ఆర్జీవీ సినిమాల్లో ఎక్కువ కనిపిస్తుంది. ఇంకా గుర్తుపట్టలేదా? ఎవరో చూడండి మరి.

FOLLOW US: 

ఈ ఫొటోలో ఉన్న అమ్మాయిని ఇంకా గుర్తుపట్టలేదా? ఆమె మరెవ్వరో కాదు. ఆర్జీవీ బ్యూటీ అప్సరా రాణి.  

టాలీవుడ్ బ్యూటీ అప్సర రాణి గురించి ఇప్పుడు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన గ్లామర్ తో కుర్రకారుని కట్టిపడేస్తుంది ఈ ముద్దుగుమ్మ. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నటించిన 'థ్రిల్లర్' సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది. అప్సర రాణి చిన్నప్పటి ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఈ ఫోటో కు అభిమానులు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. 

అప్సర అసలు పేరు అంకిత మహారాణ. ఈమె డెహ్రాడూన్ లో పుట్టి పెరిగింది. అప్సర రాణి ఇండస్ట్రీకి కొత్తేమి కాదు. అర్జీవితో సినిమాలు చేయక ముందు కూడా ఆమె కొన్ని సినిమాల్లో నటించింది. 2019 లో వచ్చిన '4 లెటర్స్', 2020 లో వచ్చిన 'ఉల్లాలా ఉల్లాలా' సినిమాల్లో కనిపించింది అప్సర. అయితే ఈ సినిమాలు పెద్దగా పాజిటివ్ టాక్ తెచ్చుకోలేకపోయాయి. దీంతో అప్సర కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. చాలా రోజులు ఇండస్ట్రీ కి దూరంగా ఉంది. దాదాపు సినిమాలకు దూరం అయిపోయింది. అనుకోకుండా ఓ సారి ఆర్జీవి కంట్లో పడిందీ భామ. అంతే దాంతో ఆమె లైఫ్ టర్నింగ్ తిరిగింది. అప్పటి దాకా నార్మల్ క్యారెక్టర్ లు చేసిన అప్సర బోల్డ్ గా నటించడం మొదలుపెట్టింది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'థ్రిల్లర్' లో బోల్డ్ గా కనిపించి అందరి దృష్టినీ ఆకట్టుకుంది. 

News Reels

తర్వాత చాలా కాలం రామ్ గోపాల్ వర్మ తో టచ్ లో ఉంది. వర్మతో పాటు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ వచ్చింది. తర్వాత మాస్ మహరాజ్ రవితేజ నటించిన 'క్రాక్' సినిమాలో 'బూమ్ బద్దల్ బూమ్ బద్దల్ ' అంటూ ఐటమ్ సాంగ్ తో కుర్రకారుని ఉర్రూతలూగించింది. ఈ పాటలో తన గ్లామర్, డాన్స్ తో అదరగొట్టింది. దీంతో ఆమెకు యూత్ లో మరింత క్రేజ్ పెరిగింది. ఆ సినిమా తర్వాత అప్సర కు వరుస అవకాశాలు వస్తున్నాయి. 2021 లో వచ్చిన 'డి కంపెనీ', 'సిటీమార్', 2022 లో వచ్చిన 'మా ఇష్టం' వంటి సినిమాల్లో కనిపించింది. 

 ప్రస్తుతం తన అందచందాలతో ఐటెం భామగా కొనసాగుతున్న అప్సర ఇప్పుడు మరోసారి సోలో హీరోయిన్ గా అదృష్టాన్ని పరీక్షించుకుంనేందుకు రెడీ అయింది. అప్సర లీడ్ రోల్ లో 'తలకోన' సినిమా రాబోతోంది. ఈ సినిమాలో అప్సర నటనలో మరో కోణాన్ని ఆవిష్కరించబోతోందని మేకర్స్ చెప్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పనులు జరుగుతున్నాయని టాక్. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమా ఉంటుందట. కెరీర్ ప్రారంభంలో సోలో హీరోయిన్ గా సినిమాలు చేసి వరుస ఫ్లాప్ ను చూసిన అప్సర మళ్ళీ సోలో హీరోయిన్ గా మరో సినిమా చేయడంతో ఈ సినిమాపై కొంత ఆసక్తి నెలకొంది. ఈ సినిమాతో అయినా అప్సరకు మంచి హిట్ అందుతుందో లేదో వేచి చూడాలి.

Also Read : 'ఆహ నా పెళ్ళంట' to 'గాడ్ ఫాదర్', 'సర్దార్' - ఓటీటీల్లో ఈ వారం సందడి

View this post on Instagram
 
A post shared by Apsara Rani (@apsararaniofficial_)

Published at : 14 Nov 2022 11:25 AM (IST) Tags: Apsara Rani Apsara Rani Photos Apsara Rani Movies

సంబంధిత కథనాలు

Ennenno Janmalabandham November 28th: కోర్టులో నేరం చేశానని ఒప్పుకున్న మాళవిక, షాకైన వేద - ఖుషి మీద అరిచిన ఆదిత్య

Ennenno Janmalabandham November 28th: కోర్టులో నేరం చేశానని ఒప్పుకున్న మాళవిక, షాకైన వేద - ఖుషి మీద అరిచిన ఆదిత్య

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!

ఓటీటీలోకి ‘లవ్ టుడే’ - స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే?

ఓటీటీలోకి ‘లవ్ టుడే’ - స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే?

మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై బాలకృష్ణ క్లారిటీ, డైరెక్టర్ ఆయనేనా?

మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై బాలకృష్ణ క్లారిటీ, డైరెక్టర్ ఆయనేనా?

టాప్ స్టోరీస్

Minister Botsa : కాళ్లు పట్టుకునైనా సమస్యలు పరిష్కరించుకునే నేర్పు ఉండాలి - మంత్రి బొత్స

Minister Botsa : కాళ్లు పట్టుకునైనా సమస్యలు పరిష్కరించుకునే నేర్పు ఉండాలి - మంత్రి బొత్స

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం: సీఎం కేసీఆర్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం:  సీఎం కేసీఆర్

Bandi Sanjay : పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Bandi Sanjay :  పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి