By: ABP Desam | Updated at : 09 Feb 2023 11:05 AM (IST)
Edited By: Soundarya
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
దుగ్గిరాల కుటుంబాన్ని స్వప్న తన మాటలతో ఇంప్రెస్ చేస్తుంది. దీంతో రాజ్ తల్లి స్వప్నని తన తల్లిదండ్రులని తీసుకుని ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది. అటు రాహుల్ స్వప్నని తన వైపుకి తిప్పుకునే పనిలో ఉంటాడు. తాము ఎంత కోటీశ్వరులమో రాజ్ కి బిజినెస్ గురించి అంతా నేర్పించింది తనే అని డబ్బా కొట్టుకుంటూ ఉంటాడు. స్వప్నని కారులో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని ఎక్కించుకుంటాడు. తను వస్తే తాము కోటీశ్వరులం కాదని పేదవాళ్ళని తెలిసిపోతుందని రోడ్డు మీద కనిపించిన ఒక పెద్ద ఇంటిని చూపించి అదే తమ ఇల్లని చెప్పి తప్పించుకుంటుంది. ఇక రోజు ఎపిసోడ్ ప్రోమోలో ఏం ఉందంటే..
రాజ్ స్వప్నకి కాల్ చేస్తాడు. స్వప్న మొహానికి ఫేషియల్ చేసుకుంటా చేతులు బాగోలేవని ఫోన్ లిఫ్ట్ చెయ్యమని చెప్తుంది. దీంతో కావ్య రాజ్ పేరు చూడకుండానే కాల్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. ఆ గొంతు విని రాజ్ ఆశ్చర్యపోతాడు. ఇప్పటికే కావ్య స్వప్నని అక్క అని పిలవడం రాజ్ చూశాడు. ఇప్పుడు తన గొంతు గుర్తు పట్టేసి కావ్య ఎవరని అడుగుతాడో లేదో చూడాలి. అటు స్వప్న కుటుంబం ఎలాంటిదో తెలుసుకోకుండా పెళ్లి ఖాయం చేసే ప్రసక్తే లేదని రాజ్ తల్లి ఖరాఖండీగా చెప్పేస్తుంది.
Also Read: 'ఏవయ్యో పెనిమిటీ' అని రిషిని పిలిచిన వసు- మిస్టర్ ఇగో మాములోడు కాదు పొగరుని ఆట ఆడించేస్తున్నాడు
మంగళవారం నాటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
గుడిలో రాజ్, కావ్య గొడవ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ ప్రపంచంలో ఇంత మంది ఉండగా ఎందుకు ప్రతిసారి నువ్వు నాకు ఎదురుపడుతున్నావని రాజ్ కావ్యని తిడతాడు. ఇక గుడిలో పూజారి వచ్చి మొదటిరోజు ఆఫీసుకి వెళ్తూ గొడవపడటం ఎందుకని సర్ది చెప్పి ఇద్దరినీ పంపించేస్తాడు. తర్వాత రాజ్ ఆఫీసుకి వెళ్ళగా తనకి అందరూ ఘన స్వాగతం పలుకుతారు. ఇక మేనేజర్ తో ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అది చాలా ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ అని ఎలాగైనా సొంతం చేసుకోవాలని మేనేజర్ మూర్తికి చెప్తాడు. కానీ మూర్తి రాహుల్ తో చేతులు కలిపి ఆ ప్రాజెక్ట్ రాకుండా చేస్తాడు. మూర్తి మోసం చేసిన విషయం రాజ్ కనిపెట్టి తనకి పనిష్మెంట్ ఇస్తాడు. కంపెనీలో మేనేజర్ ఉద్యోగం తీసేసి స్వీపర్ పోస్ట్ లో పడేస్తాడు.
Also Read: తులసిని ఆకాశానికెత్తేసిన మాజీ మొగుడు- కుటుంబం ప్రేమ చూసి కన్నీళ్ళు పెట్టుకున్న నందు
స్వప్న ఇంటికి వచ్చి దుగ్గిరాల కుటుంబానికి కోడల్ని కాబోతున్నా అని సంబరంగా చెప్తుంది. సంబంధం మాట్లాడటానికి రెడీ అవమని కనకం భర్త కృష్ణమూర్తికి చెప్తుంది. కానీ తాను మాత్రం మనసుకి ఖరీదైన రంగు వేసుకుని రాలేనని తేల్చి చెప్పేస్తాడు. దీంతో స్వప్న పెళ్లికి మరొక అడ్డంకి వచ్చి పడింది. మరి కావ్య వచ్చి తండ్రికి నచ్చజెప్పి పంపిస్తుందో లేదంటే కనకం ఏం ప్లాన్ వేస్తుందో చూడాలి. అటు రుద్రాణి కూడా పేద ఇంటి అమ్మాయి ఈ ఇంటి కోడలు అయితే తన ఆట ఆడొచ్చని ప్లాన్ వేసి స్వప్నని ఎలాగైనా రాజ్ కి ఇచ్చి పెళ్లి చేయాలని ఆలోచిస్తుంది.
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!
ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి
రామ్ చరణ్ సినిమా కోసం 'RRR' ఫార్ములాను ఫాలో అవుతున్న బుచ్చిబాబు!
వివాదంలో ‘2018’ మూవీ - జూన్ 7 నుంచి థియేటర్స్ బంద్, ఎందుకంటే..
YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్
Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!
WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?
Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు, తెలంగాణలో వేడి కాస్త తక్కువే - ఐఎండీ