(Source: ECI/ABP News/ABP Majha)
Brahmamudi February 4th: రాజ్ కి నిజం చెప్పమన్న కావ్య- స్వప్న మీద కన్నేసిన రాహుల్
దుగ్గిరాల కుటుంబానికి తన కూతుర్ని కోడలిగా పంపించాలని కనకం ప్రయత్నాలు చేస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
స్వప్న డాన్స్ చేస్తూ ఉంటే కాలు కింద నిప్పు రవ్వ చూసి కావ్య పరుగున వచ్చి తన చేయి అడ్డం పెడుతుంది. దీంతో స్వప్న పడిపోతుంటే రాజ్ వచ్చి తనని పట్టుకుంటాడు. కావ్య వల్లే ఇలా అయ్యిందని రాజ్ తనని నోటికొచ్చినట్టు తిడతాడు. కనకం వచ్చి స్వప్న కాలు బెణికినట్టు నటించమని సైగ చేయడంతో తను కాలినొప్పిగా ఉందని డ్రామా మొదలెడుతుంది. రాజ్ స్వప్నని తన గదిలోకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. రాజ్ తన కూతురు అందానికి పడిపోయాడని కనకం తెగ సంబరపడుతుంది. మన కుటుంబం పరువు పోకుండా కాపాడినందుకు గాను తనకి గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నట్టు రాజ్ తన తాతయ్యతో చెప్తాడు. అందుకు ఆయన సరే అంటాడు. ఇక రోజు ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో లో ఏముందంటే..
తమ కుటుంబ పరిస్థితి గురించి చెప్పకుండా ఎందుకు ఉన్నావని కనకాన్ని తన భర్త నిలదీస్తాడు. 'ఆ అబ్బాయి ఇష్టపడే దాకా కష్టపడ్డావ్, రేపు పెళ్లి మాటలు వస్తే వాళ్ళ నౌకర్ల స్థాయి మనది అని తెలిస్తే ఆ తర్వాత వాళ్ళ దృష్టిలో నీ పరిస్థితి ఏంటి? నీ కూతురి పరిస్థితి ఏంట'ని ప్రశ్నిస్తాడు. నిజం తెలిసిన రోజు ఈ పెళ్లి పీటల మీదే ఆగిపోవచ్చు అప్పుడు అక్క పరిస్థితి ఏంటో ఆలోచించమని కావ్య కూడా తల్లికి నచ్చజెప్పడానికి చూస్తుంది.
శుక్రవారం నాటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే ....
డాన్స్ వేస్తూ కాలు బెణికినట్టు కలరింగ్ ఇస్తుంది స్వప్న. అదంతా నిజమేననుకుని రాజ్ హడావుడి చేస్తూ తన కాలికి మందు రాస్తాడు. డాక్టర్ ని పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. సాంస్కృతిక కార్యక్రమంలో డాన్స్ చేసే అమ్మాయి కాలుకి దెబ్బ తగలడం వల్ల స్వప్న తన స్థానంలో డాన్స్ చేసిందని రాజ్ తన తాతయ్యకు చెప్పి మెచ్చుకుంటాడు. మన గౌరవం కాపాడినందుకుగాను తనకి ఏదైనా బహుమతి ఇవ్వాలని అనుకుంటున్నట్టు చెప్తాడు. ఇక స్వప్న మళ్ళీ రాజ్ ని కలవడం కోసం తన చెవి కమ్మ కావాలని అక్కడ వదిలేస్తుంది. రాజ్ స్వప్నకి డైమండ్ నెక్లెస్ బహుమతిగా తన మెడలో వేస్తాడు. అది చూసి కనకం తెగ సంబరపడుతుంది. స్వప్న వెళ్ళిపోయిన తర్వాత గదిలోకి వచ్చిన రాజ్ అక్కడ ఉన్న స్వప్న చెవి కమ్మ చూస్తూ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఇదేనేమో ఎంతో అందంగా ఉంది తను అని కాసేపు పొగుడుతాడు. మరోవైపు రాజ్ ఇష్టపడిన అమ్మాయిని ఎలాగైనా తనకి దూరం చేయాలని రాహుల్ ప్లాన్ వేస్తాడు.
Also Read: రామతో కన్నీళ్లు పెట్టించిన అఖిల్- వంట రాక తిప్పలు పడుతున్న మలయాళం
ఇక కనకం కూతుర్లని తీసుకుని హడావుడిగా ఆటో ఎక్కు వెళ్ళడం రుద్రాణి కంట పడుతుంది. కారు బంగ్లా ఉన్నాయని చెప్పిన ఆస్తి షేర్ ఆటోలో వెళ్తుందా? ఈ తోలుబొమ్మలాట ఇకనుంచి నేను ఆడిస్తాను అని రుద్రాణి కుట్ర చేసేందుకు రెడీ అయిపోతుంది. ఇంటికి చేరుకున్న స్వప్న తనకి గిఫ్ట్ గా వచ్చిన డైమండ్ నెక్లెస్ అందరికి చూపిస్తుంది . ఆ నెక్లెస్ అప్పు తీసి ఇది కావ్య అక్కకి బాగుంటుందేమో అని తన మెడలో పెడుతుండగా స్వప్న విసురున దాన్ని లాగేసుకుంటుంది. నెక్లెస్ తగిలి కావ్య చేతి గాయం మంటగా అనిపించడంతో ఏమైందని తండ్రి అడుగుతాడు. అప్పుడు అప్పు జరిగిన గొడవ అంతా చెప్తుంది. దానికి కొనసాగింపే ఈ ప్రోమో.
Also Read: నందు కేఫ్‌కి సామ్రాట్ సాయం- విడాకులిస్తానంటూ అంకితని బెదిరించిన అభి