Brahmamudi February 20th: రాజ్ ని పెళ్లిచేసుకోవడం ఇష్టం లేదన్న స్వప్న- కావ్య ముందు బుక్కైన రాహుల్
దుగ్గిరాల కుటుంబానికి తన కూతుర్ని కోడల్ని చేయాలని కనకం ప్లాన్స్ వేస్తోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
రాజ్ కుటుంబం స్వప్నని పెళ్లి చూపులు చూసేందుకు వస్తారు. పిండి వంటలు స్వప్న చేసిందని చెప్పేసరికి రాజ్ వాటిని అందరితో బలవంతంగా తినిపిస్తాడు. చాలా బాగున్నాయ్ అని తెగ మెచ్చుకుంటాడు. రుద్రాణి వాటిని చూసి విచిత్రంగా ఫేస్ పెడుతుంది. కృష్ణమూర్తి స్వప్నకి కాల్ చేస్తాడు కానీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. కనకం భర్త దగ్గరకి వెళ్ళి ఏమైందని అడుగుతుంది. స్విచ్ ఆఫ్ అనేసరికి ఇక్కడ దాకా కష్టపడి తీసుకొస్తే ఇలా చేసిందే అని తలబాదుకుంటుంది. అక్క ఇక్కడే ఉండి ఉంటుంది వెళ్ళి తీసుకొస్తాను అని కావ్య తనని వెతికేందుకు వెళ్తుంది.
Also Read: 'ఆ తాళి తియ్యగలవా వసుధార'? ప్రశ్నల వర్షం కురిపించిన రిషి- కొడుకుని సమర్థించిన జగతి
రాహుల్ స్వప్నకి బిస్కెట్స్ వేస్తూ ఉంటాడు. ఇండియాలోనే కాదు ఫారిన్ లో కూడా ఆస్తులు ఉన్నాయి. కానీ మనసుకి నచ్చిన అమ్మాయి దొరకలేదు. మీలాంటి అమ్మాయి నాకు దొరకలేదు. ఒక వేళ మీలాంటి ఏంజెల్ నా ప్రపోజల్ కి ఒప్పుకుంటే గోవా లేదా వేరే ఐలాండ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసేవాడిని అని తనని మాటలతో ఇంప్రెస్ చేస్తాడు. ఫ్లైట్ లో రిసెప్షన్ ఏర్పాటు చేసే వాడిని అని చెప్తూ ఉంటాడు. కావ్య రోడ్డు మీద తిరుగుతూ స్వప్న కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంట్లో రాజ్ ఎంత గొడవ చేస్తున్నాడో ఏమో అని ఆలోచిస్తుంది. స్వప్న కోసం రాజ్ ఎదురుచూడటం చూసి అందరూ తనని ఆట పట్టిస్తుంటారు. మీనాక్షి వచ్చి తిక్కతిక్కగా మాట్లాడుతుంది. కృష్ణమూర్తి నిజం చెప్పేస్తానని అంటాడు.
రాజ్ కుటుంబం ముందుకు వచ్చి అమ్మాయి స్వప్న ఇంట్లో లేదని క్షమించమని అడుగుతాడు. మేం వస్తున్నామని తెలుసు కదా ఇంట్లో లేకపోవడం ఏంటని అపర్ణ అంటుంది. బ్యూటీ పార్లర్ కి వెళ్ళిందని కనకం చెప్తుంది. వెళ్లిపోదాం పద అని అపర్ణ సీరియస్ అవుతుంది. ఇంత సేపు ఉందని ఎందుకు అబద్దం చెప్పారని నిలదీస్తుంది. అందరం వస్తున్నామని తెలిసి కూడా అలా ఎలా వెళ్తుందని అరుస్తుంది. మీనాక్షి సర్ది చెప్తూ పెద్దమ్మాయి స్వప్నని కూడా అలాగే పెంచారని అంటుంది. ఆ మాటకి అందరూ షాక్ అవుతారు. పెద్ద కూతురా మీకు ఒక్కతే కూతురు అన్నారు కదా అసలు మీకు ఎంత మంది పిల్లలు అని అపర్ణ నిలదీస్తుంది. మీరు పొరపాటు పడ్డారు మాకు ముగ్గురు కూతుళ్ళు అని కృష్ణమూర్తి చెప్తాడు.
Also Read: గాయత్రి ప్లాన్ ఫెయిల్, కేఫ్ సేఫ్- కొత్త మలుపు తీసుకున్న 'గృహలక్ష్మి'
ఇప్పటికీ అదే మాట చెప్తున్నా నాకు ఒక్కతే కూతురు, మిగిలిన ఇద్దరినీ అమ్మాయిల్లా చూడను అబ్బాయిలాగా పెంచుతాను అని కనకం కవర్ చేస్తుంది. మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారని అపర్ణ అంటుంది. తను ఫారిన్ లో చదువుతూ ఉంటుందని రుద్రాణి కవర్ చేస్తుంది. మధ్యలో మీనాక్షి కౌంటర్లు వేస్తూ ఉంటుంది. అప్పు లండన్ లో చదువుతూ ఉంటుందని చెప్తుంది. వాళ్ళ మాటలు నమ్మిన రాజ్ అందరికీ సర్ది చెప్పి వెళ్ళకుండా ఆపుతాడు. ఎంత తెలివిగలదానివి కనకం నీకు తెలివితేటలు చాలానే ఉన్నాయని రుద్రాణి మనసులో అనుకుంటుంది. ఇప్పటి వరకు తనతో ఉంటే ఎంత బాగుందో చెప్పాను ఇప్పుడు రాజ్ తో ఉంటే ఎలా ఉంటుందో చెప్పాలని రాహుల్ ప్లాన్ వేస్తాడు.
రాజ్ తో లైఫ్ బోరింగ్ గా ఉంటుందని అంటాడు. రాజ్ తో పరిచయం కాకుండా ఉండి ఉంటే మన పరిచయం వేరేలాగా ఉంటుంది. నువ్వు ఆ మూడు ముక్కలు చెప్తే ఒప్పేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని స్వప్న మనసులో అనుకుంటుంది. పెళ్లి చూపుల మీద ఇంట్రెస్ట్ లేదని తనతో ఉండటం బాగుందని అంటుంది. సర్ ప్రైజ్ ప్లాన్ చేశానని చెప్పి రాహుల్ స్వప్న చెయ్యి అందుకుని తనని తీసుకుని వెళతాడు.