By: ABP Desam | Updated at : 20 Feb 2023 08:38 AM (IST)
Edited By: Soundarya
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
తులసి దేవుడి ముందు కూర్చుని పూజ చేస్తుంది. ఇంట్లో వాళ్ళు కేఫ్ గురించి ఎటువంటి ఆందోళన చెందవద్దని చెప్తున్నా కూడా తన మనసులో ఏదో భయంగా ఉందని తులసి అంటుంది. కేఫ్ గురించి ఎవరు బ్యాడ్ గా చెప్పలేదు కదా ఎందుకు భయం అని నందు అంటాడు. పండగ రోజు ఇలా దిగాలుగా ఉండటం ఏమి బాగోలేదని అంటాడు. ఇంట్లో అందరినీ వెళ్ళి పడుకోమని, తను జాగారం చేస్తానని చెప్తుంది. పొద్దుటి నుంచి ఏమి తీసుకోలేదు కదా కనీసం ఈ కాఫీ అయిన తాగు అని నందు ఇవ్వబోతుంటే వద్దని చెప్తుంది. కాఫీ పక్కన పెట్టడంతో అదేంటని అడుగుతుంది. నువ్వు కేఫ్ కోసం దీక్షలో ఉన్నావ్ నేను నీ కోసం ఉన్నానని అంటాడు. నందు నిద్ర ఆపుకోలేక తిప్పలు పడుతూ ఉంటాడు. అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ నిద్రపోతే తులసి మాత్రం నిష్టగా పూజ చేస్తూ జాగారం చేస్తుంది.
Also Read: విన్నీకి పెళ్లిచూపులు ఏర్పాటు చేసిన యష్- విషమంగా వేద ఆరోగ్యం
కేఫ్ విషయంలో రిపోర్ట్ అటు ఇటుగా వచ్చిన నిన్ను ఏమి అనుకోమని నందు అంటాడు. మొదటి నుంచి కేఫ్ బాధ్యత తీసుకుంది నేను దానికి సంబంధించి మంచి చెడు అంతా చూసుకుంది నేనే కదా. లాస్య చెప్పిన మాటల్లో నిజం ఉందని తులసి అంటుంది. కేఫ్ పెట్టమని నువ్వు ఇచ్చిన సలహా విని తప్పు చేశానేమో, ఆ సలహా విని పెట్టకపోతే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అని నందు అంటాడు. అందరూ కంగారుగా రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. లాస్య వచ్చి ఏంటి అంతా దిగాలుగా ఉన్నారు అనుకున్నది అంతా జరిగిపోయిందా అని సంబరంగా మాట్లాడుతుంది. ఆ మాట విని అందరూ లాస్యని ఒక్కొక్క మాట అంటారు. అప్పుడే రిపోర్ట్ గురించి మెయిల్ వస్తుంది. ప్రేమ్ కేఫ్ గురించి పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని చెప్పేసరికి తులసి ఉబ్బితబ్బిబ్బయిపోతుంది.
ఏ మంచి జరిగినా అది తులసి వల్లే అంటారు, ఇంట్లో అందరికీ తులసి ఏదో చేతబడి చేసిందని లాస్య అనేసరికి నందు తన మీదకి చెయ్యి ఎత్తుతాడు. తులసిని వెనకేసుకొస్తూ నందు లాస్యకి కాస్త గడ్డి పెడతాడు. రిపోర్ట్ పాజిటివ్ గా రావాలని టెన్షన్ పడుతూ రాత్రంతా జాగారం చేసి పూజ చేసింది తులసి, కానీ నువ్వు ముసుగుతన్ని నిద్రపోయావు అర్థం అయ్యిందా మీ ఇద్దరి మధ్య తేడా ఏంటో అని నందు కోపంగా అంటాడు. తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు గాయత్రి రగిలిపోతూ ఉంటుంది. చందుకి ఫోన్ చేస్తుంది. నమ్మకద్రోహి అని తిడుతుంది. నమ్మకద్రోహి అని ముద్ర పడకూడదని మనసు మార్చుకున్నా అని చందు చెప్తాడు. నా డబ్బులు తీసుకుని ఎందుకు ఇలా చేశావ్ అని గాయత్రి అడుగుతుంది.
Also Read: నిజం చెప్పేసిన కృష్ణమూర్తి- కనకం మీద అనుమానపడిన రాజ్ తల్లి
చందు కేఫ్ లో డల్ కూర్చుని ఉంటే తులసి వచ్చి ఏమైందని అడుగుతుంది. అమ్మకి బాగోలేదని చెప్తాడు. అడగకుండానే తులసి ట్రీట్మెంట్ కి డబ్బులు ఇచ్చి హాస్పిటల్ కి వెళ్ళమని చెప్తుంది. నేను చెప్పేది నిజమో అబద్దమో తెలుసుకోకుండా డబ్బులు చేతులు పెట్టింది, మా అమ్మని కాపాడింది తులసి మేడమ్ అని చందు చెప్తాడు. దేవతలాంటి తులసి మేడమ్ కి వెన్నుపోటు పొడవటం తప్పని మనసు చెప్పింది పాడైపోయిన బర్గర్ పెట్టినా తర్వాత మనసు మార్చుకుని మంచి బర్గర్ ఇన్స్పెక్టర్ కి ఇచ్చానని చెప్తాడు. అభి తమకి వీసా వచ్చిందని టికెట్స్ కూడా వచ్చాయని చెప్తాడు. కొద్ది రోజులు ఉండవచ్చు కదా అని తులసి అంటుంది. ఈ విషయంలో ఏమి మాట్లాడలేనని అంతా అభి ఇష్టమేనని అంకిత చెప్తుంది. నందు సంతోషంగా కేఫ్ లో పని చేసుకుంటే ఈ మధ్య తులసితో క్లోజ్ గా ఉంటున్నావ్ అందుకేనా ఈ సంతోషం అని లాస్య అడుగుతుంది.
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Robert Downey Jr: ఆ హీరో నమిలేసిన చూయింగ్ గమ్ రూ. 45 లక్షలా? ఏం చేసుకుంటారు నాయనా?
Balagam Censored Dialogue: సెన్సార్‌కు ముందు, సెన్సార్ తర్వాత - ‘బలగం’లోని ఆ డైలాగ్ లీక్ చేసిన ప్రియదర్శి
Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?
Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత
Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి
Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్