Brahmamudi February 18th: నిజం చెప్పేసిన కృష్ణమూర్తి- కనకం మీద అనుమానపడిన రాజ్ తల్లి
తన కూతుర్ని దుగ్గిరాల కుటుంబానికి కోడల్ని చేయాలని కనకం ఆశపడుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
స్వరాజ్ గ్రూప్ నుంచి కొత్త జ్యూయలరీ డిజైన్ ని రాహుల్ లాంఛ్ చేస్తాడు. ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే తను కోరుకుంటున్న జీవితం సొంతం అవుతుందని, అదే రాజ్ ని పెళ్లి చేసుకుంటే ఇంట్లో కూర్చుని కుంకుడు కాయలు కొట్టుకోవాలని స్వప్న మనసులో అనుకుంటుంది. కావ్య పరిస్థితి తలుచుకుని మీనాక్షి బాధపడుతుంది. తనని చూస్తే పెళ్లి కొడుక్కి అసలు పడదు అందుకే అమ్మ తిప్పలు పడుతుందని వెళ్లిపోతానని కావ్య అంటుంది. స్వప్న కోసం అపర్ణ కుటుంబం మొత్తం ఎదురుచూస్తూ ఉంటుంది. రాజ్ ఈవెంట్ స్టార్ట్ అయ్యిందో లేదో కనుక్కుందామని రాజ్ బయటకి వచ్చి ఫోన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే కావ్య కూడా వెనుక డోర్ నుంచి బయటకి వెళ్తుంది. ఇద్దరూ చూసుకోకుండా ఢీ కొంటారు. నువ్వు ఎందుకు వచ్చావ్ ఇక్కడికి అని రాజ్ అరుస్తాడు.
Also Read: తులసి వల్లే కెఫ్ మూతపడుతుందని అవమానించిన లాస్య- సంబరంలో గాయత్రి
కావ్య దొరికిపోయిందని కనకం టెన్షన్ పడుతుంది. రాజ్ అరుపులు విని అందరూ బయటకి వస్తారు. కావ్య కావాలని తన వెంట పడుతుందని తిడతాడు. నువ్వు గొడవపడటానికి మావాడే దొరికాడ అని అపర్ణ కావ్యని నిలదీస్తుంది. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావ్ ఎందుకు స్పై చేస్తున్నావ్ అని రాజ్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. మిస్టర్ డిఫెక్ట్ ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా కాస్త విను నేను వేరే పని మీద వచ్చానని అంటుంది. ఈ అమ్మాయి మీకు తెలుసా అని రాజ్ కనకాన్ని అడుగుతాడు. తెలియదని చెప్తారు. తను మిస్టర్ మూర్తిగారి కోసం వచ్చానని చెప్తుంది. కృష్ణమూర్తి తెలుసని చెప్తాడు. వాళ్ళ కంపెనీలో హ్యాండిక్రాఫ్ట్ సప్లై చేస్తూ ఉంటానని, కాస్త డబ్బు అవసరం ఉండి వచ్చాను అందర్నీ చూసి వెళ్లిపోతున్నా అని కావ్య అంటుంది. దయచేసి తనని ఏమి అనొద్దని కృషమూర్తి రాజ్ కి చెప్తాడు.
కావ్యని ఇంట్లోకి తీసుకెళ్తారు. కన్నకూతురిని పరాయి వాళ్ళ ముందు పరాయిదాన్ని చేశావని కృష్ణమూర్తి అసలు నువ్వు తల్లివేనా అని తిడతాడు. దయచేసి గొడవ చేయవద్దని కనకం బతిమలాడుతుంది. కావ్య తండ్రికి నచ్చజెప్పి స్వప్నని తీసుకెళ్లమని చెప్తుంది. గదిలోకి వచ్చి చూసేసరికి స్వప్న ఉండదు దీంతో కనకం టెన్షన్ గా కావ్య దగ్గరకి పరుగులు తీస్తుంది. రాహుల్ స్వప్న దగ్గరకి వచ్చి సోరి చెప్తాడు. ఇంట్లో వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని మా ఇంట్లో వాళ్ళు ఇన్సల్ట్ చేస్తున్నారు, మీ ఇంటికి వచ్చి పెళ్లి చూపులు అంటున్నారు అని తనకి సోప్ వేస్తూ ఉంటాడు. తన మాటలకు స్వప్న పొంగిపోతుంది. మీలాంటి అందమైన అమ్మాయి ఎదురుపడితే మోకాళ్ళ మీద కూర్చుని డైమండ్ రింగ్ ఇచ్చి లైఫ్ లాంగ్ హజ్బెండ్ గా ఉంటానని అడుగుతానని రాహుల్ స్వప్నతో అంటాడు.
Also Read: పెళ్లి చూపుల్లో కావ్యని చూసి షాకైన రాజ్ కుటుంబం- రాహుల్ చేయి అందుకున్న స్వప్న
స్వప్న ఇంట్లో లేదని చెప్పేసరికి మీనాక్షి గట్టిగా అరుస్తుంది. తర్వాత కాసేపు అర్థం కానీ జీవిత సత్యాలు ఏవో చెప్పి అందరికీ తలనొప్పి పుట్టిస్తుంది. రాజ్ తొంగి తొంగి చూడటం చూసి కాస్త ఆగరా అని సైగ చేస్తుంది. స్వప్న వస్తున్నట్టు ఊహించుకుని నోరు తెరుచుకుని మరీ చూస్తాడు. రేఖ రాజ్ లో ఊహల్లో నుంచి బయటకి తీసుకొస్తుంది. అమ్మాయి ఎక్కడ అని అపర్ణ అడుగుతుంది. వస్తుంది ఈ లోపు స్నాక్స్ తీసుకొండని కనకం అంటుంది. కావ్య స్నాక్స్ తీసుకొచ్చి అందరికీ ఇస్తుంది. ఈ కళావతి ఎంట్రీ ఏంటని తిట్టుకుంటారు. స్నాక్స్ అన్నీ స్వప్ననే చేసిందని కనకం అనేసరికి రాజ్ వాటిని సంతోషంగా తీసుకుంటాడు. అవన్నీ స్వప్న చేసిందని రాజ్ వాటిని తెగ మెచ్చుకుంటూ తింటాడు. చేసిన చేతులు వేరు అయినా ఇచ్చిన చేతులు తనకి నచ్చలేదని అపర్ణ అంటుంది.