News
News
X

Brahmamudi February 17th: పెళ్లి చూపుల్లో కావ్యని చూసి షాకైన రాజ్ కుటుంబం- రాహుల్ చేయి అందుకున్న స్వప్న

దుగ్గిరాల కుటుంబానికి తన కూతుర్ని కోడల్ని చేయాలని కనకం ప్లాన్స్ వేస్తోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

స్వప్న ఎలాగైనా రాహుల్ పిలిచిన ఈవెంట్ కి వెళ్లాలని ప్లాన్ వేస్తుంది. ఎవరూ చూడకుండా సైలెంట్ గా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. భర్త కృష్ణమూర్తి సాదాసీదాగా ఉండటం చూసి సూట్ వేసుకోమని కనకం చెప్తుంది. నీ నాటకంలో పాత్రధారిగానే ఉంటాను సూత్రధారిగా ఉండనని సూట్ వేసుకొనని కృష్ణమూర్తి చెప్తాడు. స్వప్న రావడం చూసి రాహుల్ తెగ సంతోషపడిపోతాడు. ‘రాజ్ నీకు నచ్చిన అమ్మాయి నాకోసం వచ్చింది. నీకు బోలెడంత ఆస్తి ఉంది, స్వప్నకి నీకంటే ఎక్కువ ఆస్తి ఉంది అందుకే తనకి వల విసిరాను వలలో పడిందని’ రాహుల్ మనసులో అనుకుంటాడు. ఇద్దరు అమ్మాయిలను పంపించి స్వప్నని పొగడమని చెప్తాడు.

Also Read: విన్నీ మీద గెలిచిన యష్- భర్తని చూసి మురిసిపోయిన వేద

స్వప్నని కాసేపు మాటలతో మాయ చేస్తారు. ఈవెంట్ చీఫ్ గెస్ట్ తనే అని రాహుల్ ఎరేంజ్ చేసిన అమ్మాయిలు స్వప్నతో సెల్ఫీలు దిగుతూ హడావుడి చేస్తారు. అందంతా చూసి స్వప్న ఇలాంటివి కలలోనే కనిపించేవి కానీ ఇప్పుడు నిజం అయ్యాయి ఇదంతా లవర్ బాయ్ రాహుల్ వల్ల అని తెగ సంబరపడుతుంది. అటు కనకం అక్క మీనాక్షి ఇంటికి రాజ్ కుటుంబం వస్తుంది. అబద్ధంతో ఎన్ని రోజులు మోసం చేస్తావని మీనాక్షి దెప్పిపొడుస్తూ ఉంటుంది. మా చెల్లి ఇల్లు మీకోసం ఎదురుచూస్తుందని మీనాక్షీ అంటుంది. ఇల్లు కోటలాగా ఉంది, ఏమైనా తక్కువ అంచనా వేశానా అని రుద్రాణి మనసులో అనుకుంటుంది. రాజ్ స్వప్నని ఎప్పుడెప్పుడు చూద్దామా అని చూస్తూ ఉంటాడు.

రుద్రాణి కనకానికి మాటలు తగిలేలా మాట్లాడుతుంది. మా చెల్లి ఇల్లు మీకు స్వాగతం పలుకుటుందని మీనాక్షి అంటుంది. అదేంటి ప్రతిసారి చెల్లి ఇల్లు అంటున్నారని ధాన్యలక్ష్మి అడుగుతుంది. అదేమీ లేదని కవర్ చేస్తుంది. రుద్రాణి ఇల్లు చూసి వీళ్ళు నిజంగా రిచ్ నా అదే జరిగితే వదిన కోరుకున్నట్టు జరుగుతుంది, అలా జరగడానికి వీల్లేదని మనసులో అనుకుంటుంది. రాజ్ స్వప్న కోసం కళలు కాయలు కాచేలాగా ఎదురుచూస్తూ ఉంటాడు. వాళ్ళకి మర్యాదలు చేస్తూ కనకం తెగ హడావుడి చేస్తుంది. మీనాక్షి దుగ్గిరాల కుటుంబాన్ని పొగుడుతుంది. మధ్య మధ్యలో ఇది మా చెల్లి ఇల్లు అని మీనాక్షి అంటుంది కానీ అక్కడ గోడ మీద మాత్రం వల్ల ఆయనతో దిగిన ఫోటో ధాన్యలక్షి చూసి అడుగుతుంది. ఇప్పుడు అర్థం అయ్యింది ఇది కనకం అక్క ఇల్లు బాగానే మేనేజ్ చేస్తుందని అనుకుంటుంది. కనకం ఆ ఫోటో గురించి ఏదో చెప్పి కవర్ చేస్తుంది కానీ అపర్ణ నమ్మినట్టుగా మొహం పెడుతుంది. రుద్రాణి తనని కవర్ చేస్తూ ఉంటుంది.

Also Read: కేఫ్ కి ఫుడ్ ఇన్స్పెక్టర్స్, ప్లాన్ అమలుచేసిన చందు- నందు కేఫ్ మూతపడినట్టేనా?

మీ భర్త ఎక్కడ అని అని అపర్ణ కనకాన్ని అడుగుతుంది. అబద్ధాలు మాత్రం చెప్పను అని కృష్ణమూర్తి అంటాడు. అతన్ని తీసుకొచ్చి రాజ్ వాళ్ళకి పరిచయం చేస్తుంది. వాళ్ళు అడిగే ప్రశ్నలకు అబద్ధాలు చెప్తూ కనకం తెగ కవర్ చేస్తుంది. స్వప్న దగ్గరకి రాహుల్ వచ్చి కాసేపు తనకి బిస్కెట్స్ వేస్తూ ఉంటాడు. స్నాక్స్ తీసుకుని కావ్య మీనాక్షీ ఇంటికి వస్తుంది. తనని చూసి కనకం టెన్షన్ పడుతుంది. వెంటనే బయటకి వెళ్ళి కావ్యని వెనుక గుమ్మం నుంచి లోపలికి పంపించి సర్దేశి వెళ్లిపొమ్మని చెప్తుంది.  

Published at : 17 Feb 2023 09:22 AM (IST) Tags: manas Brahmamudi Serial Brahmamudi Serial Today Episode Brahmamudi Serial Written Update Brahmamudi Serial February 17th Episode

సంబంధిత కథనాలు

Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?

Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?

Anushka Sharma Fitness: అందాల అనుష్క అంత స్లిమ్ గా ఎలా ఉంటుందో తెలుసా? ఈ చిట్కాలు మీరు ట్రై చేస్తారా !

Anushka Sharma Fitness: అందాల అనుష్క అంత స్లిమ్ గా ఎలా ఉంటుందో తెలుసా? ఈ చిట్కాలు మీరు ట్రై చేస్తారా !

NTR 30 Update : ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ - షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ 

NTR 30 Update : ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ - షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ 

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Ghantadi Krishna - Risk Movie : 'రిస్క్' చేసిన ఘంటాడి కృష్ణ - పాన్ ఇండియా సినిమాతో దర్శక నిర్మాతగా

Ghantadi Krishna - Risk Movie : 'రిస్క్' చేసిన ఘంటాడి కృష్ణ - పాన్ ఇండియా సినిమాతో దర్శక నిర్మాతగా

టాప్ స్టోరీస్

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం