Ennenno Janmalabandham February 17th: విన్నీ మీద గెలిచిన యష్- భర్తని చూసి మురిసిపోయిన వేద
యష్, వేద మధ్యలోకి విన్నీ రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
విన్నీ జంగందేవర వేషం వేసుకుని వేద వాళ్ళ ఇంటికి వస్తాడు. ఖుషి అతని విన్నీ అని గుర్తు పట్టి తలకి ఉన్న పాగా తీసేస్తుంది. అందరూ విన్నీని చూసి నవ్వుతారు. అందరినీ బోల్తా కొట్టించి కానీ నువ్వు ఎలా గుర్తుపట్టావ్ అని విన్నీ అంటాడు. అమ్మ పేరు పిలిచినప్పుడుల్లా వేదు అన్నావ్, అమ్మని అలా పిలిచేది నువ్వు ఒక్కడివి మాత్రమే అని ఖుషి అంటుంది. విన్నీ వచ్చిన తర్వాత పండగకు కొత్త కళ వచ్చిందని ఇంట్లో వాళ్ళందరూ తనని మెచ్చుకోవడం చూసి యష్ తల పట్టుకుంటాడు. దిక్కుమాలిన జోకు ఒకటి వేస్తే అందరూ పడి పడి నవ్వుతారు. విన్నీని చూసేసరికి మన మిస్టర్ యారగెంట్ కి చిరాకు వచ్చేస్తుంది.
Also Read: కనకం అక్క ఇంట్లో పెళ్లి చూపులు- రాహుల్ కోసం వెళ్ళిపోయిన స్వప్న
ఎవడు వీడు ఎక్కడ నుంచి వచ్చాడు, ఇప్పటి వరకు ఫెస్ట్ మూడ్ లో ఎంత హ్యాపీగా ఉన్నానో వాడు వచ్చిన తర్వాత అంత మటాష్ అని యష్ తిట్టుకుంటూ ఉండగా వేద వచ్చి బయటకి రమ్మని పిలుస్తుంది. ఎందుకు మూడ్ ఆఫ్ అయ్యారని అడుగుతుంది. కానీ యష్ తిక్క తిక్కగా మాట్లాడతాడు. కాసేపు ఇద్దరూ మాటల్లాంటి పోట్లాడుకుంటారు. నీ మాట నేను ఎందుకు వినాలని యష్ అడుగుతాడు. మీరు వేరే వాళ్ళకి కూడా నన్ను పరిచయం చేసేటప్పుడు వేదస్విని నా భార్య అని పరిచయం చేస్తారు కదా ఇప్పుడు కూడా అంతే విన్నీ నా అతిథి అంటే మన అతిథి తనని గౌరవించాల్సిన బాధ్యత ఇద్దరిది అని వేద చెప్పేసి వెళ్ళిపోతుంది. నేను ఎంత కోపంలో ఉన్నా నీ ప్రేమతో ఇట్టే మార్చేస్తావ్ అందుకే నువ్వు నాకు నచ్చుతావ్ అని యష్ మురిసిపోతాడు.
విన్నీ వేసే భయంకరమైన జోకులకు నవ్వుతూ ఉంటారు. అందరూ కలిసి హ్యపీగా మాట్లాడుకుంటూ పానకం తాగే పోటీ పెట్టుకుంటారు. విన్నీ అన్నింటిలో గెలుస్తాడని వేద చెప్తుంది. డాడీ పార్టిసిపేట్ చేస్తాడని ఖుషి అంటే పోటి చేస్తానని యష్ కూడా అంటాడు. ఎవరు ఎక్కువ పానకం తాగుతారో అని పోటి పెట్టుకుంటారు. పార్టీసిపెట్ చేయవద్దని వేద చెప్తుంది కానీ యష్ మాత్రం వినడు. అంత పానకం తాగితే కడుపు చెడిపోతుందని చెప్తుంది కానీ తనది స్టీల్ స్టమక్ అని యష్ రెచ్చిపోతాడు. 15 గ్లాసుల పానకం ఎవరు ముందు తాగితే వాళ్ళు విన్నర్ అని పోటి పెడతారు. ఈ పోటీలో యష్ గెలుస్తాడు. గెలిచినందుకు పెళ్ళాం ముందు కాలర్ ఎగరేస్తాడు.
Also Read: కేఫ్ మూయించేందుకు గాయత్రి కుట్ర- అత్తకి ఎదురు తిరిగి భార్య మనసు గెలుచుకున్న అభి
యష్ స్టీల్ బాడీ కి పంక్చర్ అయిపోతుంది. మోషన్స్ పట్టుకుంటాయి. ఎలాగైనా బఫూన్ గాడి మీద గెలవాలని గ్లాసుల మీద గ్లాసుల పానకం తాగాను కడుపులో మిక్సీ ఆన్ అయినట్టు ఉందని యష్ ఇబ్బంది పడుతూ ఉండగా వేద రావడం చూసి సైలెంట్ అవుతాడు. కానీ ఆపుకోలేక బాత్రూమ్ కి పరుగులు పెడతాడు. కడుపులో నొప్పిగా ఉంటే డాక్టర్ పెళ్ళాంకి చెప్పొచ్చు కదా అని వేదమనసులో అనుకుంటుంది. యష్ పరిస్థితి చూసి లోలోపల నవ్వుకుంటూ ఉంటుంది. కాళేశ్వరం డ్యామ్ దగ్గర గుడగుడ అని సౌండ్ వస్తుంది కదా అది నాకు ఇక్కడ వస్తుందని వేద కావాలని యష్ ని ఆటపట్టించేలా మాట్లాడుతుంది. అటు విన్నీ కూడా స్టమక్ అప్సెట్ అయ్యిందని తిప్పలు పడుతూ ఉంటాడు. వేద తనకి ట్యాబ్లెట్ ఇవ్వడానికి వస్తుంది.