Gruhalakshmi February 16th: కేఫ్ మూయించేందుకు గాయత్రి కుట్ర- అత్తకి ఎదురు తిరిగి భార్య మనసు గెలుచుకున్న అభి
నందు కేఫ్ బిజినెస్ స్టార్ట్ చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
తులసి కోసం కొన్న నెక్లెస్ లస్య బలవంతంగా తన మెడలో వేయించుకుంటుంది. తెగ సంబరపడిపోతుంది. మెడలో నెక్లెస్ పడితేనే గాని మొగుడు కాళ్ళు పట్టుకోవడానికి నడుము వంగలేదు అన్నమాట అని అనసూయ చురకేస్తుంది. ప్రేమ్, శ్రుతి వంతు వస్తుంది. ప్రేమ్ తన భార్యకి తన తండ్రి చేతికి వేసుకున్న కంకణం, కనిపించకపోయింది ఆరు నెలలు వెతికి మరీ సాధించానని చెప్పి బహుమతిగా ఇస్తాడు. ఇక అందరూ అయిపోయారు కదా అని తులసి వెళ్దాం అంటుంది. తులసిని చీటీ తీయమని ప్రేమ్ అనేసరికి మాకంటే లైఫ్ పార్టనర్ ఉన్నారు తీశాం నీకేవరు ఉన్నారని లాస్య అంటుంది. ఆ మాటకి నందు కోపంగా అరుస్తాడు. నాకు లైఫ్ పార్టనర్ ఉన్నారు లేరని ఎవరు చెప్పారని తులసి అంటుంది. తన పార్టనర్ కి రోజా పువ్వు ఇవ్వాలని చీటీ వస్తుంది.
సామ్రాట్ కి ఇస్తుందేమో అని నందు టెన్షన్ పడతాడు. తులసి రోజా పువ్వు తీసుకుని కాసేపు ఆలోచించి అనసూయ, పరంధామయ్య, కొడుకు, కోడళ్ళని పిలుస్తుంది. ఇది నా కుటుంబం, జీవితాన్ని పోగొట్టుకుని ఒంటరిగా ఉన్నప్పుడు మేమున్నాం అని తోడుగా నిలబడిన కుటుంబం, వీళ్ళే నా లైఫ్ పార్టనర్ అని తులసి ఎమోషనల్ అవుతుంది. అభి గాయత్రిని కలుస్తాడు. అంకితని యూఎస్ వెళ్ళడానికి ఒప్పించి మొగుడివి అనిపించుకున్నావ్ భలే ట్విస్ట్ ఇచ్చావ్ అల్లుడు, డబ్బు కావాలా అని మాట్లాడుతూనే ఉంటుంది.
Also Read: వేదని ప్రేమిస్తున్నట్టు చెప్పిన విన్నీ, వినేసిన యష్ - మాళవికని సైడ్ చేసేందుకు భ్రమరాంబిక స్కెచ్
అభి: డబ్బు కోసం రాలేదు తిరిగి ఇవ్వడానికి వచ్చాను. ఒక పుణ్యకార్యం కోసం పాపపు డబ్బుతో చేయకూడదని తెలుసుకున్నా
గాయత్రి: పాపపు డబ్బు ఏంటి
అభి: మీరిచ్చిన డబ్బు మా ఫ్యామిలీని విడగొట్టేందుకు మీరిచ్చిన డబ్బు, నా దృష్టిలో ఇది పాపపు డబ్బు
గాయత్రి: నీకు ఎవరో చేతబడి చేసినట్టు ఉంది అందుకే ఇలా మాట్లాడుతున్నావ్
అభి: మీరు మా భార్యభర్తలను విడగొట్టే ప్లాన్ చెప్పారు నాకు మా భార్యాభర్తలు కలిసి ఉండేందుకు నాలుగు మంచి మాటలు చెప్పారు. నా కష్టంతో నా అంకితని యూఎస్ తీసుకుని వెళ్తాను. డబ్బులతో ప్రేమను కొనుక్కోలేరు ఆ విషయం నేను తెలుసుకున్నా, మీరు మారండి మీ అమ్మాయిని ప్రేమతో గెలుచుకోండి
కేఫ్ సక్సెస్ అయ్యింది అందుకే ఇలా ఎదురు తిరుగుతున్నాడు, అది మూత పడేలా చేస్తానని గాయత్రి అనుకుంటుంది. శివరాత్రి ఇంట్లో పూజ ఉంటుందని తులసి చెప్తుంది. ఉపవాసం ఉండాలని అంటుంది. అందరూ మాట్లాడుకుంటూ ఉండగా అభి వచ్చి తల్లిని ఫుడ్ తినిపించమని అడుగుతాడు. తులసి పెట్టగానే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎక్కడికి వెళ్ళావ్ అని తులసి అడుగుతుంది. కాళ్ళకి పడిన బంధాన్ని తెంచుకుని స్వేచ్చగా ఉండటానికి వెళ్ళాను, మా అత్త దగ్గరకి వెళ్ళి వీసా ఖర్చుల కోసం ఆవిడ ఇచ్చిన రూ.10 లక్షలు తిరిగి ఇవ్వడానికి వెళ్ళాను బరువు దించేసుకున్నా చాలా ప్రశాంతంగా ఉందని అంటాడు.
Also Read: రాహుల్ స్కెచ్ సక్సెస్ పెళ్లి చూపుల నుంచి ఎస్కేప్ అయిన స్వప్న- ఎంట్రీ ఇచ్చిన కావ్య
నీతో ఒక అబద్ధం ఆడాను నా ఖర్చులతో కాకుండా మీ మామ్ ఇచ్చిన డబ్బుతో వెళ్ళడానికి ప్లాన్ చేశాను. నేను చేస్తుంది ఎంత పెద్ద తప్పో అమ్మ చెప్పిన తర్వాత అర్థం అయ్యింది అందుకే మీ అమ్మ ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వడానికి వెళ్ళాను, నా స్వార్జితంతోనే నిన్ను యూఎస్ తీసుకుని వెళ్తానని అభి ఎమోషనల్ గా చెప్తాడు. అంకిత వెంటనే వెళ్ళి తనని హగ్ చేసుకుంటుంది. నందు కేఫ్ కి అరవింద్ అనే వ్యక్తిని లాస్య పిలిపిస్తుంది. మంచి చెఫ్ అని చక్కగా వంట చేస్తాడని లాస్య చెప్తుంది. ప్రస్తుతం వేకెన్సీ లేదని అవసరమైతే మళ్ళీ కాల్ చేస్తానని నందు చెప్పేస్తాడు. కేఫ్ లో పని చేసే చందుని పిలిచి తులసి మాట్లాడుతుంది. అప్పుడే గాయత్రి ఫోన్ చేస్తుంది.