(Source: ECI | ABP NEWS)
గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి.. సెమీస్ ఆశలు లేనట్లేనా..?
విమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 సీజన్ నుంచి టీమిండియాలో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలవాల్సిన చోట కూడా కేవలం 4 పరుగుల తేడాతో ఓడిపోయి సెమీస్ ఆశలని సంక్లిష్టం చేసుకుంది హర్మన్ సేన. ముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 8 వికెట్లకు 288 రన్స్ చేస్తే.. 289 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియాకి 88 రన్స్ బాదిన స్మృతి సాలిడ్ ఓపెనింగ్ ఇవ్వగా.. కెప్టెన్ హర్మన్ కూడా ఫాంలోకొచ్చి 70 రన్స్‌తో సూపర్ నాక్ ఆడటంతో గెలుపు టీమిండియాదే అనుకున్నారంతా.
హర్మన్ అవుటయ్యాక.. స్మృతికి తోడుగా.. దీప్తి శర్మ కూడా 50 పరుగులతో క్రూషియల్ హాఫ్ సెంచరీ చేయడంతో టీమిండియా గెలవడం దాదాపు ఫిక్స్ అయిపోయింది. కానీ సడెన్‌గా స్మృతి, దీప్తి ఇద్దరూ అవుట్ కావడంతో మ్యాచ్ ఇంగ్లండ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. చివరి ఓవర్లో 14 రన్స్ చేయాల్సి ఉండగా.. అమన్జోత్ కౌర్, స్నేహ్ రాణా ఒత్తిడిలో ధాటిగా బ్యాటింగ్ చేయలేక 10 పరుగులతోనే సరిపెట్టారు. దీంతో 4 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. గెలవాల్సిన మ్యాచ్‌లో జట్టు ఓడిపోవడంతో డగౌట్‌లో కూర్చున్న స్మృతి ఏకంగా కన్నీళ్లు పెట్టుకుంది. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ టైంలో కూడా.. తను చెత్త షాట్ అవుట్ కావడం వల్లే మ్యాచ్ ఓడిపోయామంటూ ఓటమికి పూర్తి బాధ్యత తీసుకుంది.
ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇంగ్లండ్ చేతిలో ఓటమితో టీమిండియా హ్యాట్రిక్ ఓటములతో దాదాపు టోర్నీ నుంచి అవుటైపోయేదే. కానీ వరుణుడి పుణ్యమా అని న్యూజిల్యాండ్, పాకిస్తాన్ మ్యాచ్ రద్దు కావడంతో.. టీమిండియాకి టోర్నీలో ఇంకా సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి హర్మన్ సేన సెమీస్ చేరాలంటే.. 23వ తేదీన న్యూజిల్యాండ్‌తో జరగబోయే మ్యాచ్‌తో పాటు.. 26వ తేదీన బంగ్లాదేశ్‌తో జరగబోయే మ్యాచ్‌లో కూడా తప్పనిసరిగా గెలవాల్సిందే. అంతేకాకుండా.. ఈ మ్యాచ్‌లకి వరుణుడు కూడా అడ్డుపడకుండా ఉండాలి.





















