Ennenno Janmalabandham February 16th: వేదని ప్రేమిస్తున్నట్టు చెప్పిన విన్నీ, వినేసిన యష్ - మాళవికని సైడ్ చేసేందుకు భ్రమరాంబిక స్కెచ్
వేద, యష్ మధ్యలోకి విన్నీ రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
వాలెంటైన్స్ డే కదా మీ ఇద్దరిలో ముందు ఎవరు విసెష్ చెప్పారని విన్నీ అడుగుతాడు కానీ వేద మాత్రం దాని గురించి మాట దాటేస్తూ ఉంటుంది. మేము ఇద్దరం బిజీ ఇలాంటి ఫార్మాలిటీస్ ఉండవని అంటుంది. లైఫ్ అందరికీ సెకండ్ ఛాన్స్ ఇచ్చినట్టే మీకు కూడా ఇచ్చింది. వేదు ఐయామ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ యు అని తన మనసులో ప్రేమని బయట పెడతాడు. నన్ను ఫ్లర్ట్ చేస్తున్నవా అని వేద అంటుంది. శివరాత్రి వస్తుంది కదా ఇంట్లో పూజ ఉంది రమ్మని ఆహ్వానిస్తుంది. వసంత్ చిత్రకి వాలెంటైన్స్ డే సందర్భంగా బొకే ఇచ్చి విసెష్ చెప్తాడు. నువ్వు ఎక్కడికి అడిగితే అక్కడికి తీసుకెళ్తానని అంటాడు. ఇద్దరూ కౌగలించుకుని ఎప్పటికీ ఇలాగే ఉందాం, విడిపోకూడదని చనిపోయే వరకు కలిసే ఉంటామని ప్రామిస్ చేసుకుంటారు.
Also Read: రాహుల్ స్కెచ్ సక్సెస్ పెళ్లి చూపుల నుంచి ఎస్కేప్ అయిన స్వప్న- ఎంట్రీ ఇచ్చిన కావ్య
శివరాత్రి పండుగకి ఆహ్వానించడానికి సులోచన, శర్మ మాలిని వాళ్ళని పిలవడానికి వస్తారు. వేద వాళ్ళకి పెళ్లి అయిన తర్వాత వస్తున్న తొలి పండుగ కదా మా అల్లుడు, వేదని ఇంటికి తీసుకెళ్తామని అనేసరికి మాలిని ఎదురుతిరుగుతుంది. మూడు రోజులు శివరాత్రికి ఉపవాసం చేయాలని, జాగారం కూడా చేయాలని సులోచన అంటుంది. వామ్మో అని బిక్క మొహం వేస్తుంది. వేద వచ్చి అత్తగారి తరఫున శివధనస్సు పట్టి వ్రతం చేస్తానని మూడు రోజులు ఉపవాసం చేస్తా పచ్చి మంచినీళ్ళు కూడా తాగను అని అంటుంది. యష్ ఆ మాటలన్నీ వింటూనే ఉంటాడు. మరుసటి రోజు ఇంట్లో పూజకీ ఏర్పాటు చేస్తారు. భార్యాభర్తలు అంటే ఇద్దరు కాదు ఒక్కరు. మూడు రోజులు వ్రతం ఆచరిస్తే దాంపత్యానికి మంచి జరుగుతుందని శాస్త్రం చెప్తునడాని పూజారి చెప్తాడు.
కుటుంబానికి మంచే జరుగుతుందని, భార్యాభర్తల బంధం మరింత గట్టి పడుతుందని చెప్పి వేద వాళ్ళతో పూజ మొదలుపెట్టిస్తాడు. మాళవిక ఏం చేస్తుందని భ్రమరాంబిక ఖైలాష్ ని అడుగుతుంది. తెల్లారి వరకు తాగి తాగి తలంటు పోసుకుందని ఖైలాష్ చెప్పేసరికి భ్రమరాంబికకి చెప్తాడు. మాళవికని వదిలించుకోవడానికి ఖైలాష్ ఐడియా ఇస్తాడు. అభిమన్యు వల్ల తనకి ఎటువంటి నష్టం జరగలేదని ఒక డాక్యుమెంట్ మీద సంతకం పెట్టించుకుంటే బాగుంటుందని ఖైలాష్ చెప్తాడు. ఇంట్లో పూజ బాగా జరిగిందని అందరూ అనుకుంటుంటే వేద విన్నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమైందని యష్ అడుగుతాడు. విన్నీ వచ్చి ఉంటే బాగుండేదని అనేసరికి ఆ బఫూన్ గాడు రాకపోవడమే మంచిదైంది నేను ఫుల్ హ్యపీ అని యష్ మనసులో అనుకుంటాడు.
Also Read: నందు ప్లాన్ గోవిందా..! తులసికి కొన్న నెక్లెస్ లాస్య మెడలోకి
అప్పుడే విన్నీ శంఖం ఊడుతూ జంగం వేషధారణతో ఇంట్లోకి వస్తాడు. తనని ఎవరు గుర్తు పట్టరు. జంగందేవర స్వామి వచ్చాడనుకుని సులోచన దణ్ణం పెట్టేస్తుంది. యష్ అతన్ని చూసి ఎక్కడో ఏదో తేడా కొడుతుందని అనుకుంటాడు. విన్నీ వేద గురించి పొగుడుతూ ఉండేసరికి ఖుషికి డౌట్ వచ్చి విన్నీని చెక్ చేసి డౌట్ గా చూస్తుంది. ఈయన జంగందేవర కాదు ఎక్కడో చూసినట్టు ఉందని అని ఖుషి అంటుంది.