అన్వేషించండి

Gruhalakshmi February 15th: నందు ప్లాన్ గోవిందా..! తులసికి కొన్న నెక్లెస్ లాస్య మెడలోకి

నందు కేఫ్ బిజినెస్ స్టార్ట్ చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

ప్రేమికుల రోజు అంటే ప్రేమికులు, భార్య భర్తల మీదే కాదు తల్లి పిల్లల మధ్య కూడా ఉంటుందని తులసి అంటుంది. రెండేళ్ల క్రితం వరకు నా కొడుకు గులాబీ ఇచ్చే వాడు కానీ ఏమైందో ఏమో ఈ మధ్య తల్లి చేదు అయ్యిందని తులసి అనేసరికి ప్రేమ్ బాధగా వెంటనే అక్కడ ఉన్న రోజా తీసుకుని ఇస్తాడు. తులసి, నందు మాట్లాడుకుంటూ ఉంటే లాస్య వచ్చి నక్లెస్ ఇవ్వకుండా  ఏంటి ఊరిస్తున్నాడని అనుకుంటుంది. ఎవరు చూడటం లేదని నందు నెక్లెస్ ఇచ్చే టైమ్ కి లాస్య వచ్చేస్తుంది. నెక్లెస్ ఇవ్వమని ఇన్ డైరెక్ట్ గా అడుగుతుంది. అప్పుడే సామ్రాట్ వచ్చి నందుని మెచ్చుకుని కేఫ్ బాగుందని ఒక హగ్ చేసుకోవచ్చా అని అంటాడు. పనిలో పనిగా తులసిని కూడా మెచ్చుకుంటాడు. కొంపదీసి తులసిని కూడా హగ్ చేసుకుంటాడా ఏంటని నందు అమాంతం వెళ్ళి సామ్రాట్ ని హగ్ చేసుకుంటాడు.

Also Read: గాల్లో తెలిపోతున్న యష్, కిందకి లాగేసిన విన్నీ- భర్త మీద అమితమైన ప్రేమ చూపిస్తున్న వేద

సామ్రాట్, తులసి నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి మనసులో జలస్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. లాస్య వచ్చి నందు దగ్గర నెక్లెస్ తీసుకోవడం కోసం బిస్కెట్స్ వేస్తూ ఉంటుంది. వాలెంటైన్స్ డే రోజు అందరూ గిఫ్ట్ లు ఇచ్చిపుచ్చుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు మనం కూడా అలాగే చేద్దామని లాస్య ట్రై చేస్తుంది. నందు ఎంతకీ స్పందించకపోవడంతో లాస్య కోపంగా ఇవ్వకపోతే లాగేసుకోవాలని అనుకుంటుంది. నందు కాఫీ తెచ్చి సామ్రాట్ కి ఇస్తాడు. తులసికి ఇంకొకటి తీసుకొస్తానులె అంటే వద్దని సామ్రాట్ కాఫీ షేర్ చేసి ఇస్తాడు. అది చూసి ఏంటి తేడాగా మాట్లాడుతున్నాడని నందు మనసులోనే తిట్టుకుంటాడు. ఈరోజు నుంచి తులసి మీ కళ్ళ ముందు ఉంది రేపటి నుంచి ఇక నా కళ్ళ ముందు ఉంటుందని సామ్రాట్ చెప్పేసరికి నందు మొహం మాడిపోతుంది.

జేబులో ఉన్న నెక్లెస్ తీసి తులసికి ప్రజెంట్ చేయలేకపోతున్నా అని నందు తిట్టుకుంటాడు. వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకోవడం చూసి నందు చిరాకుగా మొహం పెడతాడు. సామ్రాట్ వెళ్లబోతుంటే ఇంట్లో అందరం సరదాగా గడపాలని ప్లాన్ చేశాం రమ్మని పిలుస్తుంది. ఇంట్లో వాలెంటైన్స్ డే సెలెబ్రేషన్స్ మొదలవుతాయి. అందరూ అక్కడ కూడా తులసి భజన మొదలుపెట్టేస్తారు. ఎప్పటిలా తులసి నా గొప్ప కాదు సమిష్టి కృషి అని అంటుంది. సామ్రాట్ తులసి చేతి వంటకి వీరాభిమాని అనేసరికి నందు మొహం చిరాకుగా పెడతాడు. ఒక్కొక్క జంట వచ్చి పెర్ఫామెన్స్ ఇస్తారు. గేమ్స్ ఆడుతూ, డాన్స్ చేస్తూ అందరూ సరదాగా గడుపుతారు.

Also Read: రాజ్ చెంప మీద కొట్టిన కావ్య- కనకం ఇంటికి పెళ్ళిచూపులకు వస్తామన్న అపర్ణ

ఇక లాస్య జంటకి నాది నెక్లెస్ గొలుసు పాటకి డాన్స్ చేయమని చీటి వస్తుంది. భలే సాంగ్ వచ్చిందని లాస్య తెగ సంబరపడుతూ డాన్స్ వేస్తుంది.  నందుకి మొహమాటం ఎక్కువ మనసులో ఉన్న విషయం త్వరగా బయట పెట్టడు వాలెంటైన్స్ డే రోజు గిఫ్ట్ గా ఇద్దామనుకుని రెండు రోజుల నుంచి జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడాని లాస్య చెప్పేసరికి నందు బిక్కమొహం వేస్తాడు. అదేమీ లేదని నందు చెప్తున్నా వినకుండా బలవంతంగా నెక్లెస్ బయటకి తీయిస్తుంది. నా జేబులో నెక్లెస్ సంగతి తనకి ఎలా తెలిసిందని నందు ఏడుపుమొహం పెడతాడు. నెక్లెస్ చూసి లాస్య తెగ సంబరపడుతూ మెడలో వేయించుకుంటుంది. 

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Korean Kanakaraju : కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget