అన్వేషించండి

Brahmamudi February 13th: రాజ్ చెంప మీద కొట్టిన కావ్య- కనకం ఇంటికి పెళ్ళిచూపులకు వస్తామన్న అపర్ణ

దుగ్గిరాల కుటుంబానికి తన కూతుర్ని కోడల్ని చేయాలని కనకం ప్లాన్స్ వేస్తోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

ఎంత రిచ్ వేషం వేసినా పూర్ బుద్దులు పోలేదని కనకాన్ని చూసి రుద్రాణి మనసులో అనుకుంటుంది. ఒకతను వచ్చి ఇంగ్లీషులో మాట్లాడటం చూసి ఇంట్లో పనతను కూడా పాష్ ఇంగ్లీషు మాట్లాడతారా అని కనకం డౌట్ గా అడుగుతుంది. అతను ఆఫీసులో పని చేసే మేనేజర్ ఒక చిన్న విషయంలో మోసం చేశాడని రాజ్ ఈ పనిష్మెంట్ ఇచ్చాడని అపర్ణ చెప్పడంతో కనకం షాక్ అవుతుంది. సర్వెంట్ తెచ్చిన శాండ్ విచ్ తినమని చెప్పేసరికి చండాలంగా తింటుంది. తనని కవర్ చేయడం కోసం రుద్రాణి కూడా తెగ తిప్పలు పడుతుంది. పెళ్లయ్యాక పిల్లలతో వేర్వేరు కాపురాలు పెట్టిస్తారా అని కనకం అడిగేసరికి అందరూ షాక్ అవుతారు. దుగ్గిరాల కుటుంబం ఎప్పుడు వేరు పడదు, ఉమ్మడి కుటుంబంగానే ఉంటామని అపర్ణ చెప్తుంది.

Also Read: మాజీ పెళ్ళానికి నెక్లెస్ ఇవ్వడానికి తిప్పలు పడుతున్న మాజీ మొగుడు- నందు మీద అనుమానపడుతున్న లాస్య

మా ఆస్తుల వివరాలు చెప్పాం ఇప్పుడు మీ ఆస్తుల, అంతస్తుల వివరాలు చెప్పండని అపర్ణ కనకాన్ని అడుగుతుంది. తెలియదని అనేస్తుంది. ఈ దేశంలో, సిటీలో ఎన్ని బంగ్లాలు ఉన్నాయో కూడ తెలియదని బోలెడు అబద్ధాలు చెప్తుంది. ఎంత మంది పిల్లలు అని ధాన్యలక్ష్మీ అడిగేసరికి స్వప్న ఒక్కతే కూతురని అబద్ధం చెప్తుంది. మీ అమ్మాయి స్వప్నని మా ఇంటి కోడాలిని చేసుకోవాలని అనుకుంటున్నామని అపర్ణ అడుగుతుంది. అందుకు సంబరపడిన కనకం సరే అని వెంటనే ముహూర్తాలు పెట్టుకుందామని అంటుంది. కానీ అప్పుడే కాదు మీ ఆస్తిపాస్తులు చూడాలని అపర్ణ అంటుంది. కొంపదీసి దొరికిపోతుందా ఏంటి రాజ్ కి ఇంతకంటే దారిద్రపు గొట్టు సంబంధం దొరకదని రుద్రాణి మనసులో అనుకుంటుంది. రేపే మీ ఇంట్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేయమని అపర్ణ కనకంకి చెప్తుంది. అక్కడే ఎంగేజ్ మెంట్ కూడా చేసేయాలని రుద్రాణి ప్లాన్ వేస్తుంది.

రాజ్ క్లాస్ విని స్వప్నకి పిచ్చిలేస్తుంది. అప్పుడే కావ్య ఆ కేఫ్ కి వస్తుంది. కావ్య వచ్చేటైమ్ కి రాజ్ వెళ్ళిపోతాడు. కారులో వెళ్తూ సంగీతం పెట్టేసరికి స్వప్న ఇంత బోరింగ్ గా ఉన్నాడేంటని తిట్టుకుంటుంది. రాజ్ కి రాహుల్ కి ఇంత తేడా ఉందని అనుకుంటుంది. రాజ్ మాటలకి స్వప్న తలకొట్టుకుంటుంది. వామ్మో ఈ ఎన్విరాన్మెంట్ క్లాస్ వినడం వల్ల కావడం లేదని స్వప్న కారు దిగి తప్పించుకుని వెళ్ళిపోతుంది. నేను బాగా నచ్చినట్టు ఉన్నాను అందుకే గిఫ్ట్ కూడా మర్చిపోయి వెళ్తుందని రాజ్ అనుకుంటాడు. అదే ఆలోచిస్తూ ఎదురుగా వస్తున్న కావ్యని ఢీ కొడతాడు. మళ్ళీ ఇద్దరూ కాసేపు గొడవపడుతూ ఉంటారు. వాళ్ళ గొడవకి చుట్టూ పక్కల జనాలు మూగుతారు. కావ్య రాజ్ కారులో స్వప్న ఉందేమోనని చూస్తుంది.

Also Read: మాళవికని తప్పుదారి పట్టించిన అభిమన్యు- వేదకి వార్నింగ్ ఇచ్చిన యష్

కావ్య గురించి చాలా చీప్ గా మాట్లాడతాడు. డబ్బుకోసమే కదా నువ్వు ఇదంతా చేస్తుందని రాజ్ డబ్బు ఇవ్వబోతుంటే కావ్య వాటిని తిరిగి ఇవ్వబోతూ పొరపాటున తన చెంప మీద కొడుతుంది. ఇంతమంది ముందు కొడతావా అని రాజ్ కోపంతో రగిలిపోతాడు. నువ్వేం మనిషివి ఒక అమ్మాయి చెంపదెబ్బ కొడితే లాగిపెట్టి కొట్టకుండా ఊరుకుంటావా అని ఒకతను అనేసరికి రాజ్ అతన్ని కొట్టేస్తాడు. స్వప్న నడుస్తూ వెళ్తుంటే రాహుల్ వచ్చి పాదాలు కందిపోతాయన్నట్టు అంటుంటే పక్కన రాజ్ కనిపించి నడక మంచిదని క్లాస్ తీసుకుంటునట్టు ఊహించుకుంటుంది. ఇంత బోరింగ్ పర్సన్ ని లైఫ్ లాంగ్ భరించాలంటే కష్టమని రాహుల్ అంటాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
India vs Bangladesh: ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
Embed widget