By: ABP Desam | Updated at : 13 Feb 2023 07:39 AM (IST)
Edited By: Soundarya
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
విన్నీ తనకు ఎప్పుడు ఛాన్స్ ఇవ్వలేదు కదా అని అడుగుతాడు. ఇప్పుడు ఎప్పుడు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని వేద చెప్తుంది. ఫ్రాంక్ గా ఒకటి చెప్పనా నీ హజ్బెండ్ నువ్వు చెప్పినంత జెంటిల్మెన్ ఏం కాదని విన్నీ అంటాడు. కానీ వేద మాత్రం యష్ ని వెనకేసుకొస్తుంది. ఇక మాళవిక అయితే అభి దగ్గరకే వెళ్ళి తేల్చుకుందాం పద అంటుంది. అప్పుడే విన్నీ వేద కూడా బయటకి వెళ్లిపోతారు. యష్ వాళ్ళు బయటకి రాగానే వేద కనిపిస్తుంది. యష్ వెళ్ళి తనని నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. ఖుషి స్కూల్ కి వెళ్తూ కాఫీ తాగుదామని ఆగానని చెప్తుంది. అభిమన్యు మీద చాడీలు చెప్పి అభిమన్యుని బ్యాడ్ చేసి మమ్మల్ని విడదీయాలని కుట్ర పన్నుతున్నారని మాళవిక అంటుంది. అదేమీ లేదని వేద చెప్తున్నా వినదు, పదండి మీ ముందే అభిని నిలదీస్తానని వాళ్ళని తీసుకుని వెళ్తుంది.
అభిమన్యు విన్నీ పార్టీలో కలిసిన అమ్మాయిని తన ఇంటికి తీసుకుని వస్తాడు. కాసేపు తన అందాన్ని పొగుడుతూ తనని ఫ్లట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మాళవిక, వేద వాళ్ళతో కలిసి ఇంటికి వస్తుంది. అభి ఇంకొక అమ్మాయితో క్లోజ్ గా ఉండటం చూసి మాళవిక షాక్ అవుతుంది. వెంటనే కోపంగా వెళ్ళి అభి కాలర్ పట్టుకుని యు చీట్ ఎవరిది నా బెడ్ రూమ్ లో ఎవరు నువ్వు? ఎన్నాళ్ళు నుంచి సాగుతుందని నిలదీస్తుంది.
Also Read: మహేంద్ర, జగతి దెబ్బకు తోకముడిచిన దేవయాని- రిషికి నిజం చెప్పాలని డిసైడ్ అయిన వసు
మాళవిక: ఆరేళ్లుగా నీతో కాపురం చేస్తున్నా పెళ్లి కోసం ఎదురు చూస్తున్నా, అలాంటి నన్నుమోసం చేస్తావా. నీ నిజస్వరూపం నాకు తెలిసిపోయింది, నిన్న పార్టీలో తాగి వాగావంట నేను నీకు బోర్ కొట్టేస్తానంట పెళ్లి చేసుకొను అన్నావంట కదా. ఎంత నమ్మాను నిన్ను నీకోసం ఎన్ని వదులుకున్నా. నీకోసం నా భర్తని, పిల్లల్ని వదులుకున్నా కానీ నువ్వు నన్ను వాడుకుంటూ వచ్చావ్ మోసం చేశావ్ హు కెన్ యు డూ దిస్
వేద వాళ్ళు వెళ్లిపోవాలని అనుకుంటుంటే భ్రమరాంబిక వస్తుంది. పట్టపగలు పడకగదికి ఎవరిని తీసుకొచ్చాడో చూడండి మేడమ్ నిలదీయండి అని మాళవిక కోపంగా అంటుంది. ఆ అమ్మాయి ఎవరో మాళవికకి చెప్పలేదా అని భ్రమరాంబిక కళ్ళతోనే సైగ చేస్తుంది. చెప్పనిస్తేనే కదా అని అభి ప్లేట్ ఫిరాయిస్తాడు. పేరు షీలా తానొక వెడ్డింగ్ ప్లానర్. ఎందుకు నువ్వు ప్రతిదీ బూతద్దంలో చూస్తున్నావ్, రేపు మన పెళ్లి అయ్యాక ఫస్ట్ నైట్ డెకరేషన్ కోసం పిలిపించామని అభిమన్యు వాళ్ళు మాళవికని నమ్మించడానికి ట్రై చేస్తారు. వేద వాళ్ళ మాటలు విని షాక్ అవుతుంది. కొంతమంది మనల్ని వేరు చేయడానికి కుట్ర చేస్తున్నారని మాయమాటలు చెప్తాడు. ఎప్పుడెప్పుడు మన పెళ్లి అవుతుందా అని ఎదురుచూస్తున్నా అని షీలాని సిస్టర్ అని పిలిచి తనని పంపించేస్తాడు.
అభిమన్యు మాటలు నమ్మిన మాళవిక తనకి సోరి చెప్తుంది. నన్ను మాళవికని ఆ దేవుడు కూడా వేరు చేయలేడని అభి అంటాడు. ఇదంతా యశోధర్ వల్లే కాఫీ షాపుకి పిలిచి తన బుర్ర చెడగొట్టాడని అంటుంది. ఈ వేద నా పాలిట శనిలా దాపురించిందని అనేసరికి వేద గురించి ఒక్క మాట మాట్లాడినా ఊరుకొనని యష్ తన మీద సీరియస్ అవుతాడు. కసాయి వాడిని నమ్ముకున్న గొర్రెలా కనిపిస్తున్నావని మాళవికతో యష్ అనేసి వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చిన తర్వాత యష్ వేద మీద అరుస్తాడు. మాళవిక ఏమైపోతే నీకెందుకు, పక్కవాళ్ళ గొడవల్లో జోక్యం చేసుకోవడం తప్ప వేరే పని లేదా అని తిడతాడు. తన చావు తనని చావనివ్వు మనకి ఎందుకని అంటాడు. మనకి దగ్గర కాని వాళ్ళకి దూరంగా ఉండలేకపోతే నువ్వు నా లైఫ్ నుంచి దూరం అవ్వాల్సి వస్తుందని వేదకి వార్నింగ్ ఇస్తాడు.
DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య
Suriya Jyotika: ముంబైకి మకాం మార్చిన సూర్య, జ్యోతిక - తొలిసారి తల్లిదండ్రులను వదిలి..
18 ఏళ్లుగా అదేపని, చోరీ డబ్బుతో ఏకంగా ఇల్లే కట్టేశారు - సూపర్ స్టార్ కూతురికే షాకిచ్చిన పనివారు
Nithiin Rashmika New Movie : నితిన్ ఫ్లాపులు, రష్మిక కాంట్రవర్సీలు - కొత్త సినిమా కబురులో ఫుల్ సెటైర్లు
Dasara: అదరగొట్టే మాస్ స్టెప్స్తో ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ - ‘దసరా’ ఫస్ట్ వీడియో సాంగ్ వచ్చేసింది!
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్
IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!
TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!
Pragya Nagra: ఉగాదికి ఇంత అందంగా ముస్తాబైన ఈ తమిళ బ్యూటీ ఎవరో తెలుసా?