Guppedanta Manasu February 11th: మహేంద్ర, జగతి దెబ్బకు తోకముడిచిన దేవయాని- రిషికి నిజం చెప్పాలని డిసైడ్ అయిన వసు
Guppedantha Manasu February 11th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
రిషి మీద కోపాన్ని వసు జగతి ముందు చూపిస్తుంది. తన మీద కస్సుబుస్సులాడుతుంది. రిషి మహేంద్ర దగ్గరకి వచ్చి కడుపునొప్పి పూర్తిగా తగ్గిందా అని అడుగుతాడు. నువ్వు వెళ్ళిన పని ఏమైంది కాయ, పండా అని అడుగుతాడు. డాడ్ మేమేమైనా టెండర్ వేయడానికి వెళ్లామా అంటాడు. కడుపు నొప్పి తగ్గిందా అని అడగ్గా అప్పుడే ధరణి వస్తుంది కషాయం ఇచ్చావా వదిన అని అడుగుతాడు. మహేంద్ర తాగానని చెప్తాడు కానీ లేదు కషాయం అక్కడే ఉందని చెప్పేసరికి రిషి పక్కనే కూర్చుని బలవంతంగా తాగించేస్తాడు, అది తాగలేక నానా అవస్థలు పడి నవ్వులు పూయిస్తాడు. ఇద్దరూ రిషి, వసు గురించి కాసేపు మాట్లాడుకుంటారు.
తన మెడలో వేసుకున్న మంగళసూత్రాన్ని రిషి కట్టాడని వసు నమ్ముతుంది, వాళ్ళ ప్రేమే వాళ్ళని గెలిపిస్తుందని జగతి అంటుంది. రిషి వసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తను అన్న మాటలకి ఫీల్ అవుతూ ఉంటుందా? అయినా నేను అన్నదాంట్లో తప్పేముందని ఫోన్ చేద్దామని అనుకుంటాడు. తను ఏ పరిస్థితిలో ఉందో అని మిస్డ్ కాల్ ఇస్తాడు. రిషి సర్ ఏంటి కొత్తగా మిస్ట్ కాల్ ఇస్తున్నారు, కాల్ చేస్తే చెయ్యి లేదంటే లేదని అర్థమా నేను మిస్ట్ కాల్ ఇస్తానని వసు అలాగే చేస్తుంది. మెడలో తాళి పడ్డాక తను మామూలుగా ఉంటుంది నేను ఉండలేకపోతున్నా సరే నేనే ఫోన్ చేస్తానని అనుకుని ఇద్దరూ ఒకేసారి ఫోన్ చేసుకుంటారు. లేని పంతానికి వెళ్ళి రిషి సర్ ని బాధపెడుతున్నాను ఏమో అని వసునే రిషికి కాల్ చేస్తుంది.
ఇద్దరూ మాట్లాడకుండా ఉంటారు. ఫోన్ చేసి మాట్లాడకపోతే ఎలా అని మళ్ళీ ఇద్దరూ పోట్లాడుకోవడం మొదలుపెట్టేస్తారు. తిట్టడానికే ఫోన్ చేస్తారు కదా, వసుధార తిన్నావా, ఏం చేస్తున్నావ్ అని ఆడగరుగా అని అంటుంది. ఇది జీవితం ఫజిల్ ఏం కాదు నాకు బాధ్యత తెలుసు అని అంటాడు. వసుని మాట్లాడనివ్వకుండా తిట్టేసి ఫోన్ పెట్టేస్తాడు. ఆరోజు అన్ని మాటలు అనకుండా ఉంటే నేనే నిజం చెప్పేదాన్ని, ఇలాంటప్పుడు నేనేం చెప్పినా నమ్మరు గొడవ పెద్దది అవుతుందని అనుకుని సైలెంట్ గా ఉండిపోతుంది. మహేంద్ర ఫోన్లో గేమ్ ఆడుకుంటూ ఉండగా దేవయాని వస్తుంది. మళ్ళీ నీకు కడుపు నొప్పి ఎప్పుడు వస్తుందని వెటకారంగా అడుగుతుంది.
దేవయాని: నిజం కడుపునొప్పి అయితే చెప్పి రాదు అబద్ధం కడుపునొప్పి అయితే మనం అనుకున్నప్పుడే వస్తుంది. వసుధార, రిషి కలిసి టూర్ కి వెళ్లాలని కడుపునొప్పి నాటకం ఆడారా? మీరు మాట్లాడకున్నవన్నీ నేను చాటుగా విన్నాలే
జగతి: మీకు చాటుగా వినడం ఇష్టం కదా అక్కయ్య
Also Read: పొగరుని ఊసరవెల్లి అనేసిన రిషి- జగతి మీద కస్సుబుస్సులాడిన వసు!
మహేంద్ర: అవును నాటకం ఆడాను కావాలని వసుధారతో రిషిని పంపించాను అందుకు మీకు కడుపునొప్పి ఏంటి. ఇన్నాళ్ళూ మీరేం చేశారు నాటకాలు ఆడలేద, స్కెచ్ లో వేయలేదా వాటి ముందు ఇవి ఎంత చెప్పండి. అవును నేనే నటించాను ఇప్పుడు ఏంటంట
దేవయాని: పెళ్ళైన వసుధార వెంట రిషిని పంపించడం ఏంటి. ఈ విషయం రిషికి చెప్తే ఏమవుతుందో తెలుసా
జగతి: చెప్పండి అక్కయ్య ఎప్పుడెప్పుడు చెప్తారా అని ఎదురుచూస్తున్నా.. మా గురించి మీరు చెప్పండి మీ గురించి మేం ఇన్నాళ్ళూ కడుపులో దాచుకున్నవన్నీ చెప్తాం
మహేంద్ర: ప్రేమ అనే ముసుగులో రిషిని తప్పుదారి పట్టించారు. అవన్నీ రిషికి చెప్తే తెలుసు కదా అని ఇద్దరూ తనని రివర్స్ లో బెదిరిస్తారు. దీంతో దేవయాని ఏం మాట్లాడలేక వెళ్ళిపోతుంది.
వసు రిషి మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటుంది. చక్రపాణి వచ్చి వసుని పిలుస్తాడు. నిజం తెలియక రిషి సర్ బాధపడటం, నిజం చెప్పలేక నువ్వు బాధపడటం ఎందుకని చక్రపాణి వసుని అడుగుతాడు. అసలు నిజం తెలిస్తే ఎలా ఫీలవుతారో అని భయంగా ఉందని వసు అంటుంది. మీ ఇద్దరి మధ్య దూరం పెరగకముందే నిజం చెప్పేయమని అంటాడు. చెప్పేస్తాను మనసులో భారాన్ని మోయలేకపోతున్నా, ఇక ఆలస్యం చేయను రిషి సర్ కి నిజం చెప్పేస్తానని వసు అంటుంది.