By: ABP Desam | Updated at : 15 Feb 2023 07:47 AM (IST)
Edited By: Soundarya
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
ప్రేమలో సెకండ్ ఛాన్స్ గురించి అభిప్రాయం ఏంటని వేద యష్ ని అడుగుతుంది. అదొక పిచ్చి పని అనేసరికి వేద బాధగా వెళ్ళిపోతుంది. క్లినిక్ కి వెళ్ళేసరికి తన టేబుల్ మీద గులాబీ పూల బొకే ఉంటుంది. విన్నీ దాన్ని పంపాడని చూసి హ్యపీగా ఫీల్ అవుతుంది. వసంత్ హడావుడిగా వచ్చి ఆఫీసుకి రావడం లేదని ప్రేమికుల రోజని చిత్రతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలని చెప్తాడు. వదినతో కలిసి నువ్వు కూడా సంతోషంగా ఉండమని సలహా ఇస్తాడు. తను వెళ్ళిన తర్వాత వేద అడిగిన విషయం గురించి ఆలోచిస్తాడు. అసలు వేద మనసులో ఏముందని అనుకుంటాడు. వాలెంటైన్స్ డే కదా లవ్ మూడ్ లోకి వెళ్లిపోయిందని అనుకుని వేదకి కాల్ చేస్తాడు. ఇద్దరం కలిసి బయటకి వెళ్దామా అని అడుగుతాడు. ఎక్కడికి అని అంటే సర్ ప్రైజ్ అని చెప్తాడు. ఆ మాటకి వేద చాలా హ్యపీగా ఫీల్ అవుతుంది.
Also Read: రాజ్ చెంప మీద కొట్టిన కావ్య- కనకం ఇంటికి పెళ్ళిచూపులకు వస్తామన్న అపర్ణ
వేదతో ఫోన్లో మాట్లాడితే ఏదో కొత్త ఫీలింగ్ లా ఉందే అని యష్ అనుకుంటాడు. మాలిని గులాబీ పువ్వు తీసుకొచ్చి భర్తకి ఇచ్చి ప్రేమికుల రోజు శుభాకాంక్షలు చెప్తుంది. అటు శర్మ కూడా సులోచనకి గులాబీ పువ్వు ఇచ్చి ప్రేమికుల రోజని చెప్తాడు. డార్లింగ్ అని పిలుస్తూ పెళ్ళాంతో సరసాలాడతాడు. ఇలా చెప్తుంటే మిమ్మల్ని ఏదైనా పిచ్చి కుక్క కరిచిందా ఏంటని అని అంటుంది. అప్పుడే వేదకి కొరియర్ వచ్చిందని డెలివరీ ఇచ్చి వెళతాడు. అది యష్ తీసుకుని దాని మీద విన్నీ పేరు ఉండేసరికి ఓపెన్ చేసి చూస్తాడు. లవ్ స్టోరీ బుక్ ఉండటం చూసి నా పెళ్ళానికి రొమాంటిక్ నవల పంపిస్తాడా? బఫూన్ గాడు ఉంటే పీక పిసికి చంపేసేవాడిని అని కొప్పడతాడు. వెంటనే వేదకి కాల్ చేస్తాడు.
ఈ ప్రేమికుల రోజు ఈయన్ని చాలా బాగా మార్చేసిందని మురిసిపోతుంది. ఫోన్ లేట్ గా తీసేసరికి యష్ చిరాకుగా మాట్లాడతాడు. నీకోక కొరియర్ వచ్చింది, ప్రేమికుల రోజు నాడు ప్రేమ కథని బహుమతిగా పంపించాడు మీ విన్నీ అని యష్ కోపంగా చెప్పేసరికి వేద హ్యపీగా ఏం బుక్ పంపాడని అడుగుతుంది. లవ్ స్టోరీ బుక్ పంపించడాని చెప్పేసరికి వేద ఇక విన్నీ గోల మొదలుపెడుతుంది. వస్తానన్నారు కదా ఎంతసేపటికి వస్తారని అడుగుతుంది. యష్ కోపంగా నేను రావడం లేదు ఇంపార్టెంట్ పని ఉందని చెప్పి కోపంగా ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే ప్రేమగా మాట్లాడతాడు ఇంతలోనే కోపం ఎక్కడ దొరికాడు ఈ మిస్టర్ యారగెంట్ అని అనుకుంటూ ఉండగా విన్నీ వస్తాడు.
Also Read: చిత్రని ట్రాప్ చేయడానికి అభిమన్యు స్కెచ్- వాలెంటైన్స్ డే రోజు వేదకి విన్నీ గిఫ్ట్
మిస్టర్ యారగెంట్ ఎవరు అని విన్నీ అడిగితే మా ఆయన అని చెప్తుంది. మరి నీకు ఏం పేరు పెట్టాడు మిసెస్ న్యూసెన్స్ అనా అని విన్నీ అనేసరికి అవును నీకు ఎలా తెలుసని అంటుంది. మొన్న సంక్రాంతికి వచ్చినప్పుడు విన్నా అని చెప్తాడు. మీ పెళ్లి తర్వాత ప్రేమ సంగతి ఏంటి, నువ్వు మీవారు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారని విన్నీ అడుగుతాడు.
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
Silk Smitha Poster: ‘దసరా’ మూవీలో సిల్క్ స్మితా పోస్టర్ వెనుక ఇంత కథ ఉందా - అసలు విషయం చెప్పేసిన దర్శకుడు
Naga Chaitanya - Sobhita Dhulipala: చైతూ - శోభిత మళ్లీ దొరికిపోయారా? వైరల్ అవుతున్న డేటింగ్ ఫొటో!
Parineeti Chopra Wedding: ఆ ఎంపీతో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా పెళ్లి? అసలు విషయం చెప్పేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత
Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత
KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!
Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మరడం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Eesha Rebba: అందాలతో అబ్బా అనిపిస్తున్న ఈషా రెబ్బ