Brahmamudi February 15th: రాహుల్ స్కెచ్ సక్సెస్ పెళ్లి చూపుల నుంచి ఎస్కేప్ అయిన స్వప్న- ఎంట్రీ ఇచ్చిన కావ్య
దుగ్గిరాల కుటుంబానికి తన కూతుర్ని కోడల్ని చేయాలని కనకం ఆశపడుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే
అకౌంటెంట్ దొరికిపోయినందుకు రాహుల్ తనని తిడతాడు. నువ్వు దొరికిపోవడం వల్ల నా ఆదాయం పోయిందని అంటాడు. రాజ్ వల్ల డల్లాస్ కాంట్రాక్ట్ పోయింది, డబ్బులు వచ్చే అకౌంటెంట్ ఉద్యోగం ఊడింది, ఎలాగైనా కోటీశ్వరురాలైన స్వప్నని పెళ్లి చేసుకుని కోటీశ్వరుడిని అయిపోవాలని రాహుల్ అనుకుంటాడు. స్వప్న రాహుల్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ రాజ్ తో పెళ్లి చేయడానికి ఎంత కష్టపడుతుంది, కానీ నాకు రాహుల్ మీద ఇష్టం పెరిగిపోతుంది రాజ్ కంటే రాహుల్ కి ఎక్కువ ఆస్తులు ఉన్నాయని చెప్తే అమ్మ ఒప్పుకుంటుందిలే అని స్వప్న మనసులో అనుకుంటుంది. అప్పుడే కనకానికి వాళ్ళ అక్క మీనాక్షి ఫోన్ చేస్తుంది. పెళ్లి ఎలా చేయాలని కావ్య ఆలోచిస్తూ ఉంటే మీ పేర్ల మీద ఉన్న ఫిక్సిడ్ డిపాజిట్ తీద్దామని కృష్ణమూర్తి అనేసరికి స్వప్న వద్దని చెప్తుంది. తన పేరు మీద ఉన్న డబ్బు తీయడానికి వీల్లేదని స్వప్న గొడవకు దిగుతుంది.
Also Read: నందు ప్లాన్ గోవిందా..! తులసికి కొన్న నెక్లెస్ లాస్య మెడలోకి
సమయానికి అక్క ఫోన్ చేసి దుగ్గిరాల ఇంటికి కోడలు అవుతుంది కద మా ఇంట్లో పెళ్లి చూపులు చేసుకోమని చెప్పిందని కనకం చెప్తుంది. కనకం అక్క ఎందుకు ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకున్నావ్ అని అడుగుతుంది. అందరినీ తన దారిలోకి తెచ్చుకోవడం కోసం పెట్రోల్ క్యాన్ లో పెట్రోల్ బదులు నీళ్ళు పోసానని కనకం అసలు నిజం బయట పెడుతుంది. స్వప్న రాజ్ ఇచ్చిన రాధాకృష్ణుల బొమ్మని పక్కకి విసిరేస్తుంది. అది గతంలో తను రంగు వేసిన బొమ్మ అని కావ్య గుర్తు చేసుకుని ఇది ఇంటికి ఎలా వచ్చిందని అడుగుతుంది. రాజ్ ఈ గిఫ్ట్ ఇచ్చాడని చెప్తుంది. మిస్టర్ డిఫెక్ట్ కి ఇంత మంచి బొమ్మ గిఫ్ట్ గా ఇచ్చే టెస్ట్ ఉందన్నమాట అని కావ్య అనుకుంటుంది. రాహుల్ విషయం తల్లికి చెప్పడానికి ట్రై చేస్తుంది కానీ తను వినకుండా వెళ్ళిపోతుంది.
అటు రాజ్ కావ్య ఫోటో చూస్తూ రేపు పెళ్లి చూపులని తెగ మురిసిపోతూ ఉంటాడు. పెళ్లి చూపులకు రాజ్ రావాలా ఏంటి అని తన తండ్రి అడుగుతాడు. కొత్త డిజైన్ లాంఛ్ చేయడానికి ఈవెంట్ పెట్టావ్ కదా మర్చిపోయావా అనేసరికి సరే మీరు పెళ్లి చూపులకి వెళ్ళండని రాజ్ అంటాడు. వెంటనే రాహుల్ ఆ ఈవెంట్ నేను చూసుకుంటాను నువ్వు పెళ్లి చూపులకు వెళ్ళు అని సలహా ఇస్తాడు. అందుకు సరే అనడంతో రాహుల్ మొహం వెలిగిపోతుంది. రాహుల్ మనసులో ఏముందో తెలుసుకున్నాక తల్లికి చెప్పాలని స్వప్న అనుకుంటుంది. స్వప్న కాంటినెంటల్ ఫుడ్ ఆర్డర్ చేస్తుంటే అప్పు వచ్చి డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయని అంటుంది. అంత ఖరీదైన ఫుడ్ కొనడానికి తన దగ్గర లేవని కావ్య కూడ అంటుంది. అక్కాచెల్లెళ్లు కాసేపు గొడవపడతారు.
Also Read: గాల్లో తెలిపోతున్న యష్, కిందకి లాగేసిన విన్నీ- భర్త మీద అమితమైన ప్రేమ చూపిస్తున్న వేద
కావ్య పెళ్లి చూపులకు రావడం లేదని చెప్తుంది. అక్కడికి వస్తే రాజ్ కి తనకి గొడవ అవుతుందని అంటుంది. భర్తని రావడం లేదా అని అడుగుతుంది. వస్తాను అని చెప్పేసరికి కనకం సంతోషంగా వెళ్తుంది. రాజ్ గురించి నువ్వు చెడుగా చెప్తున్నావ్ తనకి ఇచ్చి పెళ్లి చేయాలంటే భయంగా ఉందని కృష్ణమూర్తి కావ్యతో అంటాడు.