అన్వేషించండి

KL Rahul Luxury Electric Car: లగ్జరీ ఎలక్ట్రిక్ కారు కొన్న కేఎల్ రాహుల్.. 548 కిలోమీటర్ల రేంజ్.. ధర, ఫీచర్లు ఇవే

KL Rahul Electric MPV: కేఎల్ రాహుల్ లగ్జరీ కారు ఫైవ్ స్టార్ హోటల్ లాంటి అనుభూతినిస్తుంది. అయితే ఎంజీ ఎం9 కారు ధర, రేంజ్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

MG M9 Electric MPV | భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఇటీవల MG M9 ఎలక్ట్రిక్ ఎంపీవీని కొనుగోలు చేశాడు. ఈ మోడల్‌ను కొనుగోలు చేసిన మొదటి భారత క్రికెటర్ రాహుల్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కేఎల్ రాహుల్ తన కొత్త కారును డెలివరీ తీసుకుంటున్నట్లు కనిపించాడు. ఇంతకీ ఎంజీ ఎం9 కారు ఫీచర్లు, ధర ఎంత ఉందో ఇక్కడ తెలుసుకుందాం. 

కేఎల్ రాహుల్ కారు ధర ఎంత? 

భారత్‌లో MG M9 ఎలక్ట్రిక్ MPV ఒకే ఒక టాప్ వేరియంట్- ప్రెసిడెన్షియల్ లిమోలో తీసుకొచ్చారు. కారు ఎక్స్-షోరూమ్ ధర 69.90 లక్షలు, కాగా ఇది మన దేశంలో అత్యంత ప్రీమియం, లగ్జరీ ఎలక్ట్రిక్ MPVలలో ఒకటిగా నిలిచింది.

కారు పనితీరు ఎలా ఉంటుంది 

MG M9 ఎలక్ట్రిక్ MPV 245 PS పవర్, 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్‌ను కలిగి ఉంది. ఇందులో అమర్చిన 90 kWh బ్యాటరీ 548 కిలోమీటర్ల అద్భుతమైన రేంజ్ జర్నీ చేయవచ్చు. ఒకే ఛార్జ్‌తో ఎక్కువ దూరం జర్నీ చేయవచ్చు. ఈ కారు వెహికల్-టు-వెహికల్ (V2V), వెహికల్-టు-లోడ్ (V2L) సాంకేతికతతో అమర్చబడి ఉంది. దీని ద్వారా ఇతర కార్లను లేదా ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేయవచ్చు. 

కారు ఇంటీరియర్ ఎలా ఉంది? 

MG M9 కారు క్యాబిన్ చాలా ప్రీమియంగా ఉంటుంది. ఇది కేవలం కారు మాత్రమే కాదు, నడుస్తున్న బిజినెస్ క్లాస్ లాంజ్ అని చూసినవాళ్లు చెబుతారు. దీని ఇంటీరియర్ కాగ్నాక్, బ్లాక్ డ్యూయల్ టోన్ థీమ్‌లో తయారు చేశారు. అల్యూమినియం, వుడ్ ఫినిషింగ్‌తో డిజైన్ చేశారు.  ఇందులో ఇచ్చిన కెప్టెన్ సీట్లు 16-వే ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌మెంట్, హీటింగ్, వెంటిలేషన్ ఫంక్షన్‌లతో వస్తాయి. సీట్లను పూర్తిగా రీక్లైన్ మోడ్‌లోకి మార్చుకునే వీలుంది. సుదీర్ఘ ప్రయాణాలు సౌకర్యవంతంగా చేసే వారికి ఈ కారు బెస్ట్ ఛాయిస్.

MG M9 ఎలక్ట్రిక్ MPV 5 స్టార్ హోటల్ ప్రైవేట్ లాంజ్ వంటి అనుభూతిని ఇచ్చే ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. ఇందులో 12-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, 12.23 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ ఉంది. 360 డిగ్రీల కెమెరా, లెవెల్-2 ADAS, రియర్ ప్యాసింజర్ డిస్‌ప్లే, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్ (Wireless Charger), కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఉన్నాయి. సెలబ్రిటీల కొత్త చాయిస్‌గా MG M9 మారింది.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Horror Thriller OTT : మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Embed widget